S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/02/2018 - 01:57

సూర్యాపేట, ఏప్రిల్ 1: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విభజించు పాలించు పద్ధతిలో బ్రిటిష్ తరహా పాలనా విధానాన్ని అనుసరిస్త్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాడని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు.

04/02/2018 - 01:27

ఒంటిమిట్ట, ఏప్రిల్ 1: ప్రసిద్ధ రామాలయాల్లో విశిష్టస్థానం సంపాదించి ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారు కాళీయ మర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శ్రీ సీతారాములు అశ్వవాహనంపై ఆశీనులై మాడవీధుల్లో విహరించారు. ముందుగా అర్చకులు సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, ఆరాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

04/02/2018 - 01:56

విజయవాడ, ఏప్రిల్ 1: కాలితో భారీ కాన్వాస్‌పై పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డు సాధించిన మాగంటి జాహ్నవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అభినందించారు. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసింది. పిన్న వయస్సులోనే వినూత్న తరహాలో పాదంతో భారీస్థాయి పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డు పుస్తకంలో పేరు నమోదు చేయించుకున్నందుకు జాహ్నవిని చంద్రబాబు ప్రశంసించారు.

04/02/2018 - 03:56

హైదరాబాద్: గద్వాల జోగులాంబ జిల్లా జూరాల ప్రాజెక్టు కింద ఎండిపోతున్న పంటలను కాపాడటానికి కర్నాటక అంగీకరించింది. 30 వేల ఎకరాలలో వేసిన రబీకి సాగునీరు అందించేందుకు ఎగువనున్న కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి నీరు విడుదల తప్ప మరో మార్గం లేదు. దీంతో నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదివారం కర్నాటక నీటిపారుదలశాఖ మంత్రి పాటిల్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.

04/02/2018 - 00:59

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు చేసిన అప్పు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పెనుభారంగా మారింది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు లాభాపేక్ష లేకుండా నిర్మాణ వ్యయానికే ఇళ్ము నిర్మించి ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ పథకం ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది.

04/02/2018 - 00:56

గోదావరిఖని, ఏప్రిల్ 1: తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన అన్నివర్గాల ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిన కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతికహక్కు లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెగేసి చెప్పారు.

04/02/2018 - 00:46

విశాఖపట్నం, ఏప్రిల్ 1: మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను పరిశోధన కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ఇప్పటికే దీని ప్రభావంతో రెండు రోజులుగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిశాయి.

04/02/2018 - 00:39

విజయవాడ, ఏప్రిల్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన, వైకాపా ఎంపీలు రాజీనామా చేసేందుకు నిర్ణయించడం వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం గురించి రాష్ట్ర శాసనసభలో వివరించి, అనంతరం రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి.

04/02/2018 - 03:55

రాజమహేంద్రవరం అఖండ గోదావరి నది ఎడమగట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆధునికీకరణ పనులు లేకపోవడం వల్ల పూడుకుపోతోంది. పుష్కర ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు దాదాపు 200 మీటర్ల దూరం వరకు గోదావరి నీరు అందడం లేదు. పంపుహౌస్ వద్ద పూడుకుపోయింది.

04/01/2018 - 04:40

హైదరాబాద్, మార్చి 31: హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర శనివారం ఘనం గా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద రాత్రి 8 గంటల సమయానికి శోభాయాత్ర ముగిసింది. భారీ భద్రత నడుమ భక్తుల జై హనుమాన్ నినాదాలతో హనుమాన్ ఊరేగింపు కొనసాగింది.

Pages