S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/26/2018 - 02:58

నెల్లూరు, ఫిబ్రవరి 25: ఆంధ్రుల అతిలోకసుందరి, అభిమాన తార శ్రీదేవి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో శ్రీదేవి బంధం ప్రత్యేకమైనది. నెల్లూరంటేనే తనకు అంత ఇష్టంలేని ప్రదేశంగా శ్రీదేవి భావించే పరిస్థితి నెలకొంది. గతంలోకి వెళితే..

02/26/2018 - 02:55

విజయవాడ: శ్రీదేవి మరణం వార్త విని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమెతో తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రవీంద్రభారతిలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులకు సత్కారం, మరోసారి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి సన్మానం సందర్భంగా శ్రీదేవిని కలిసినట్లు ఆమె తెలిపారు.

02/26/2018 - 02:51

అమరావతి, ఫిబ్రవరి 25: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నాటకాలాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, హోదా కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ప్రకటించారు.

02/26/2018 - 02:26

నల్లగొండ, ఫిబ్రవరి 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం తొమ్మిదవ రోజు యాదగిరీశుడు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడవాహనంపై విహరించి భక్తులను పులకింపచేశారు.

02/26/2018 - 02:16

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ‘కలిసి సాగుదాం. తెరాస పాలనకు చరమగీతం పాడుదాం’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ సీనియర్లు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర సోమవారం నుంచి చేవెళ్లనుంచి మొదలవుతున్న సంగతి తెలిసిందే.

02/26/2018 - 02:13

హైదరాబాద్, ఫిబ్రవరి 25: రైతు సంక్షేమం కోసం 2018-19 బడ్జెట్‌లో నాలుగువేల పెట్టుబడి పథకానికి 12 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ (రాజేంద్రనగర్ వ్యవసాయ వర్శిటీ)లో ఆదివారం నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సాగు భూముల లెక్కలు తేలాయని, రాష్ట్రంలో 1.62 కోట్ల ఎకరాల సేద్యపు భూమి ఉన్నట్టు వెల్లడైందన్నారు.

02/26/2018 - 04:10

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: ప్రపంచం అంతా ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతోంది... అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్లజర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చేశారని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు కితాబునిచ్చారు.

02/26/2018 - 01:59

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పెట్టుబడుల వరద పారింది. కేవలం రెండో రోజు 1,74,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజులు కలిపి 2,18,814 కోట్ల రూపాయల పెట్డుబడులు వచ్చినట్టు రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. తొలి రోజు ఆటోమోటివ్ రంగంలో 15 సంస్థలు 15,224 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. పర్యాటక రంగంలో 56 సంస్థలు 7,807 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

02/26/2018 - 01:58

కర్నూలు, ఫిబ్రవరి 25 : రాష్ట్ర విభజన తరువాత తొలిసారి శ్రీశైలం జలాశయంలో ఫిబ్రవరి చివరలోనూ మోస్తరు నీటి నిల్వ ఉంచి ప్రజలకు ఆందోళన లేకుండా చేశారు. విభజన తరువాత గత నాలుగేళ్లు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇష్టానుసారం శ్రీశైలం జలాశయంలోని నీటిని వినియోగించుకోవడంతో ఫిబ్రవరి మొదటి వారానికే జలాశయం ఖాళీ అయి సీమ ప్రజలను భయపెట్టేది.

02/26/2018 - 01:55

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: సాంకేతిక పరిజ్ఞానంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖలో జరుగుతున్న రెండో రోజైన ఆదివారం ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అన్న అంశంపై జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రియల్‌టైం గవర్నెస్, ఈ ఫైలింగ్, క్లౌడ్ మేనేజ్‌మెంట్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు వివరించారు.

Pages