S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/16/2017 - 23:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెరాస ప్రభుత్వ ప్రతినిధివేణుగోపాలాచారి అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించడంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అలాగే తొలిసారి రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.

09/16/2017 - 23:19

హైదరాబాద్/గచ్చిబౌలి, సెప్టెంబర్ 16: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లోని స్పా సెంటర్లలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఆదిత్యను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో అరెస్టయిన ఆదిత్యకు హైదరాబాద్‌లో 6, బెంగుళూరులో ఒక మసాజ్ స్పా సెంటర్ ఉంది. అయితే వీటిల్లో థాయిలాండ్, ఈశాన్య దేశాలకు చెందిన యువతులను రప్పించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

09/16/2017 - 23:18

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఫీజుల బకాయిలు చెల్లించాలని, పూర్తి ఫీజుల పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో శనివారం అనేక కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను ఉద్ధేశించి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.

09/16/2017 - 23:18

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఎప్పుడూ రద్దీగా ఉండే ఉప్పల్ మార్గం (ఎన్‌హెచ్-202)లో జాతీయ రహదారి అంబర్‌పేట్ కూడలి వద్ద ఫ్లై-వోవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

09/16/2017 - 23:17

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. శనివారం ఇక్కడ జలసౌధలో ఆయన పాలమూరు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

09/16/2017 - 23:16

హైదరాబాద్, సెప్టెంబర్ 16: స్కూళ్లలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా పాఠశాలల వార్షిక షెడ్యూలులో మార్పులు చేసింది. దానికి అనుగుణంగా వచ్చే ఏడాది నుండి జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

09/16/2017 - 23:15

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులు రూ.1000 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కోరారు. తెలంగాణలో 8571 గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి కేంద్రమంత్రికి ఆదివారం లేఖ రాశారు.

09/16/2017 - 03:15

హైదరాబాద్, సెప్టెంబర్ 15: జర్మనీ దేశ ప్రాక్టీస్ స్కూల్ విధానం తరహా తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను పరిశ్రమలో ఒక ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఇస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ఐటి మంత్రి కె తారకరామారావు అన్నారు. టాస్క్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్, విద్యాసంస్థల చైర్మన్లు మంత్రి కెటిఆర్‌తో శుక్రవారం నాడు సమావేశమయ్యారు.

09/16/2017 - 02:31

హైదరాబాద్, సెప్టెంబర్ 15: సంచార పశువైద్యశాలలను శుక్రవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన సందర్భంగా సభా వేదికపై తమాషా ఘటన జరిగింది. రైతులకు టోల్‌ఫ్రీ నెంబర్ బాగా పనిచేస్తోందా? అందుబాటులో ఉందా? అని సిఎం అధికారులను ప్రశ్నించారు. వెంటనే అధికారులు ఆ నెంబరుకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి చేతికి అందించారు. ఎంత సేపట్లో మా వద్దకు రాగలుగుతారని సిఎం ప్రశ్నించారు. ‘మీ పశువుకు ఏమైందో చెప్పగలుగుతారా?

09/16/2017 - 02:28

హైదరాబాద్, సెప్టెంబర్ 15: గోదావరి, కృష్ణా బేసిన్‌ను అనుసంధానిస్తూ మిషన్ భగీరథలో మంచినీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడ ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో మిషన్ భగీరథ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను కెటిఆర్ ఆవిష్కరించారు.

Pages