S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/16/2017 - 02:27

హైదరాబాద్, సెప్టెంబర్ 15: బంగారు తెలంగాణ చేయాలన్న అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పోలీసులకు ఆధునిక వసతి సౌకర్యాలు కల్పిస్తూ, పోలీసు కార్యాలయాలను, పోలీస్ స్టేషన్లనూ బంగారు పోలీసు స్టేషన్లుగా తీర్చి దిద్దేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించారని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.

09/16/2017 - 02:26

మెదక్ టౌన్, సెప్టెంబర్ 15: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశ తండ్రి, కొడుకులను దొంగనోట్ల ముఠా వద్ద బందీలను చేసింది. డబ్బులు అప్పుగా తీసుకున్న పరిచయస్థుడు బాధితుల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసింది. దొంగ నోట్ల మార్పిడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న దురాశ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బందీలుగా మార్చింది.

09/16/2017 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 15: పాఠశాల విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ శుక్రవారం నాడు చెప్పారు. రాష్ట్రంలో బ్లూవేల్‌ని కంట్రోల్ చేయడానికి నిశింత్ యాప్‌ను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. మొబైల్, కంప్యూటర్స్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. పేరెంట్స్ యాప్ ద్వారా అన్ని గేమ్స్ యాప్‌లను కంట్రోల్ చేసుకునే వీలుందని అన్నారు.

09/16/2017 - 02:22

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దురవస్థలో ఉన్నామని చెప్పారు.

09/15/2017 - 23:39

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఒక వినూత్న ప్రయోగమని, అటవీ భూములను రక్షించుకునేందుకు, రెవెన్యూ రికార్డుల్లో వాటిని నమోదు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమని ప్రధాన అటవీ సంరక్షణాధికారి పికె ఝూ అన్నారు.

09/15/2017 - 23:38

హైదరాబాద్, సెప్టెంబర్ 15: నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ కారణంగా బండి బయటకు తీస్తే అడుగడుగున ట్రాఫిక్ గండంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే మహానగరవాసులకు మెట్రోరైలు అందుబాటులోకి వచ్చేందుకు కౌంట్ డౌన్ మొదలైంది.

09/15/2017 - 23:36

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపధ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి మహిళా శిశు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను సత్వరమే విడుదల చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి విజ్ఞప్తి చేశారు.

09/15/2017 - 23:36

హైదరాబాద్, సెప్టెంబర్ 15: పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలకు, రైతులకు చేరువయ్యేందుకు డిసెంబర్ 28 వరకు ‘ఇందిరమ్మ రైతు బాట’ చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. శుక్రవారం టిపిసిసి అధ్యక్షుడు ఎన్.

09/15/2017 - 23:33

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళనా కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు గ్రామాల వారిగా తమ శాఖల పరిధిలోని భూ వివరాలను రెవిన్యూ రికార్డుల్లో చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం శాఖాధిపతులతో సిఎస్ సమీక్ష నిర్వహించారు.

09/15/2017 - 03:21

వలిగొండ, సెప్టెంబర్ 14: మూసీ ఏగువ ప్రాంతమైన హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మూసీనదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో సంగెం గ్రామం వద్ద మూసీ నదిలో భీమలింగంకు పూజలు చేసేందుకై వెళ్లిన ఆరుగురు భక్తులు, ఇద్దరు పశువుల కాపరులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారిని మత్స్యకారులు తెప్పలతో రక్షించేదాకా వారంతా ఏడు గంటల పాటు నీటిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.

Pages