S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/18/2017 - 04:27

మచిలీపట్నం, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు ప్రొ. ఐలయ్య వైశ్యులపై రాసిన వివాదాస్పద పుస్తకం, వ్యాఖ్యలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడటంతో పాటు వారిలో ఐక్యతను మరింతగా పెంచాయని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు.

09/18/2017 - 04:18

హైదరాబాద్, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో కెసిఆర్ పాలన రజాకర్లను మించిపోయిందని టిటిడిపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బోడ జనార్థన్, టిఎన్‌టియూసి అధ్యక్షుడు బిఎన్ రెడ్డి ఆరోపించారు. విలీన దినోత్సవం ముందు రోజు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండల పరిధిలో 36 మంది గిరిజనులను, మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టి చిత్ర హింసలు పెట్టి, వారి గుడిసెలను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని అన్నారు.

09/18/2017 - 04:16

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్య పటిష్టతకు పునరంకితం కావాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ నిబంధనలు ఖరాలు చేసి పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. గత కొనే్నళ్లగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యను గత మూడేళ్లగా గాడిలో పెడుతున్నామని అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం 70 ఏళ్ల ఉద్యమోత్సవంలో కడియం పాల్గొని ప్రసంగించారు.

09/18/2017 - 04:14

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన నిజాం పాలనను తలపిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కెసిఆర్ పాలనపై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

09/18/2017 - 04:11

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన (విలీన) దినోత్సవాన్ని ఆదివారం మజ్లిస్ మినహా అన్ని పార్టీలు ఘనంగా నిర్వహించాయి. జాతీయ జెండా ఎగుర వేశారు. ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో తెలంగాణకు విమోచన కలిగేందుకు ముఖ్య కారకుడైన నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవను కీర్తిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకుండా వెనకడుగు వేయడాన్ని తూర్పారబట్టారు.

09/18/2017 - 04:09

నిజామాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిజెపి ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన సంకల్ప యాత్రకు ప్రజల నుండి ఆశించిన స్థాయిలోనే ఆదరణ లభించినప్పటికీ, ఆ పార్టీ నాయకుల్లో ఈ సభ ఒకింత అసంతృప్తినే మిగిల్చినట్లయ్యింది.

09/18/2017 - 03:11

కొత్తగూడెం, సెప్టెంబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుగూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మణుగూరు నుండి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును సత్తుపల్లి నుండి కొత్తగూడెం వైపు వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

09/18/2017 - 03:06

హైదరాబాద్, సెప్టెంబర్ 17: హృద్రోగంతో బాధపడుతున్న ఓ పేదింటి పసిబిడ్డకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడి మంత్రి హరీశ్‌రావు దయార్ద్ర హృదయన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా తుఫ్రాన్‌కు చెందిన ఏడు సంవత్సరాల సిందె అక్షయ పుట్టుకంతోనే గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది. పాప తండ్రి కడు పేదరికంతో ఉండటంతో ఆ పాపకు చికిత్స చేయించుకునే స్థోమత లేక తనను ఎవరైనా ఆదుకోవాలని సామాజికమాద్యమాల ద్వారా వేడుకున్నాడు.

09/18/2017 - 03:03

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు పంటలు సాగయిన భూముల విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 108 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకావలసి ఉండగా, ఈ ఏడు సెప్టెంబర్ రెండోవారం వరకు 96 లక్షల ఎకరాల్లో పంటల సాగు అయింది. గత ఏడాది ఇదే సమయానికి కేవలం 92 లక్షల ఎకరాల్లోనే పంటల సాగు జరిగింది. వరినాట్లు చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి.

09/18/2017 - 03:02

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ఈ నెల 20న బిసి యువజనుల మహాసభ నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు సామాజిక న్యాయం-సమాన వాటా దక్కాలనే ప్రధాన డిమాండ్‌తో 20 తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిసి యువజన మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభ వాల్‌పోస్టర్‌ను జాజుల ఆవిష్కరించారు.

Pages