S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/11/2015 - 15:31

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం మధ్యప్రదేశ్‌కు బయల్దేరింది. పలు జలాశయాలు, ఎత్తిపోతల పథకాలను మంత్రులు పరిశీలిస్తారు. శనివారంనాడు మధ్యప్రదేశ్ సిఎం. చౌహాన్‌తో భేటీ అవుతారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ బృందంలో ఉన్నారు.

12/11/2015 - 15:30

నిజామాబాద్: బీర్కూరు మండలం పోచారం కాలనీలో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు వంటగ్యాస్ సిలిండర్ పేలి మహిళతో సహా నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

12/11/2015 - 08:20

కోర్టుకు తీసుకువచ్చేటప్పుడు ఖైదీలకు సంకెళ్లు వద్దు!
కరీంనగర్ అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశం
మోహన్‌రెడ్డి, అనుచరుల బెయిలు పిటిషన్లు కొట్టివేత

12/11/2015 - 08:18

అర్థిక ఇబ్బందులతోనే చదువుకు ఆటంకం: జెఎసి చైర్మన్ కోదండరాం

12/11/2015 - 08:18

స్టేడియంలు అందుబాటులో ఉంచండి
అధికారులకు కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశం

12/11/2015 - 08:17

ములుగు, డిసెంబర్ 10: హైదరాబాద్- కరీంనగర్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లా ములుగు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయ. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/11/2015 - 08:16

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్ర సమీకరణలు.. బేరసారాలు
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస, కాంగ్రెస్
రెండు స్థానాలకు గులాబీ అభ్యర్థుల పోటీ
ఒక్కొక్క స్థానానికే పోటీ చేస్తున్న కాంగ్రెస్, టిడిపి

12/10/2015 - 12:57

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. వరంగల్‌ ఎమ్మెల్సీగా కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు గురువారం ఉపసంహించుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్ వశమైంది. కొండా మురళీ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

12/10/2015 - 11:25

హైదరాబాద్: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 11 మంది చోరులను పోలీసులు అరెస్టు చేశారు. జనం దృష్టి మరల్చి చోరీలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 2 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

12/10/2015 - 11:23

హైదరాబాద్: తెలంగాణ రాజధానిలో 10వేల ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. రసూల్‌పురాలో నిర్మించే 205 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఇదే రోజు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేస్తున్నట్లు చెప్పారు.

Pages