S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/27/2015 - 15:28

మెదక్: జిల్లాలోని నర్సాపూర్ ఫారెస్ట్ రేంజర్ మధుసూధన్‌రావు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

11/27/2015 - 13:47

హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండలో పోలీసులు విస్తత్ర తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్డాండ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి సంచిలో పేలుడు పదార్థాలు ఉంచి పరారయ్యాడు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

11/27/2015 - 11:58

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఒకే ఇంట్లో ఇరవై రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ చేసిన దొంగ ఇంటి గోడపై ‘సారీ’ అని రాసి పరారయ్యాడు. గత నెల 31న అదే ఇంట్లో అమెరికన్ డాలర్లు, బంగారు నగలు, ఖరీదైన కెమెరాలు, సెల్‌ఫోన్లు ఆ దొంగ దోచుకున్నాడు. మళ్లీ బుధవారం రాత్రి అదే ఇంట్లో దొంగ ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నాడు.

11/27/2015 - 11:57

హైదరాబాద్: కూకట్‌పల్లి మైత్రీనగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. మృతురాలి భర్త సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అత్తింటి వేధింపుల వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

11/27/2015 - 11:55

హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యత ఉన్న సుల్తాన్‌బజార్‌ను మెట్రో రైలు మార్గం నుంచి మినహాయించాలని కోరుతూ అక్కడి వ్యాపారులు శుక్రవారం బంద్ పాటించారు. ‘సేవ్ సుల్తాన్‌బజార్’ పేరుతో పోస్టర్లు ప్రదర్శించారు. ముందు అనుకున్నట్లే సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో రైలు వెళ్తుందని అధికారులు తాజాగా ప్రకటించడంతో వ్యాపారులు తమ ఆందోళనను ఉధృతం చేశారు.

11/26/2015 - 18:42

రంగారెడ్డి : రాష్ట్రంలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గురువారం కోకాపేటలో రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యూనివర్సీటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

11/26/2015 - 18:40

ఆదిలాబాద్‌: మామడ మండల పరిసరాల్లో పులి సంచరిస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లిన మామడ మండల కేంద్రానికి చెందిన చిన్నల్ల పోశెట్టి (25) అనే యువకుడిపై పులి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

11/26/2015 - 13:36

షాద్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం చిలకమర్రి వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున అస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

11/26/2015 - 11:38

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో బుధవారం రాత్రి ఓ ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు 50 తులాల బంగారం, 4 లక్షల నగదు దోచుకున్నారు.

11/26/2015 - 11:35

నిజామాబాద్: వేగంగా వస్తున్న టవేరా జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. జీపులో ఉన్నవారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు.

Pages