S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/02/2016 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 1: వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల కింద ఉన్న గోదాములు అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. దీనిని ఆచరణలోనికి తీసుకు రావడానికి కార్యాచరణ కోసం ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష జరిపారు.

12/02/2016 - 03:16

ములుగు/ములుగుటౌన్, డిసెంబర్ 1 : సకల వనరులు కలిగి ఉన్న ములుగును జిల్లాగా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ అశాస్ర్తియతకు నిదర్శనమని తెలంగాణ జెఎసి చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం పునరుద్ఘాటించారు. ములుగును జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి, జెఎసి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మహర్షి కళాశాల మైదానంలో జరిగిన ఆత్మగౌరవ భారీ బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

12/02/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 1:నోట్లరద్దుతో దెబ్బతిన్న రంగాలను ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. నల్లధనం తొలగిస్తామని కేంద్రం చెబితే ముఖ్యమంత్రి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. రైతులపై ఈ ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెద్ద నోట్ల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపైన, కూరగాయలపైన ఎక్కువ ప్రభావం పడిందని చెప్పారు.

12/02/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 1: రోడ్లు, భవనాల శాఖ పురోగతిపై సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు గురువారం శే్వత పత్రం విడుదల చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా తమ శాఖ సాధించిన పురోగతి, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలను శే్వతపత్రంలో పేర్కొన్నారు.

12/01/2016 - 08:40

హైదరాబాద్, నవంబర్ 30: వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలల్లో సమస్త సౌకర్యాలను కల్పించడంతో పాటు, విద్యాత్మకంగా స్కూళ్లను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం నాడు నిర్వహించిన డిఇఓల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థుల నమోదుతో పాటు వారి ఫలితాలు, ప్రతిభాపాటవాలు కూడా చాలా ముఖ్యమని అంతా గుర్తించాలని అన్నారు.

12/01/2016 - 08:39

హైదరాబాద్, నవంబర్ 30: ఎమ్సెట్ మెడికల్ స్ట్రీంలో కీలకమైన మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్లు నీట్ పరిధిలోకి వెళ్లడంతో మిగిలిన బ్రాంచిల్లో అడ్మిషన్లను మార్కుల ప్రాతిపదికగా భర్తీ చేస్తే ఎమ్సెట్ ఒత్తిడిని విద్యార్థులపై తొలగించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

12/01/2016 - 08:24

రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజి గోపాల్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రా
గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్ మున్సిపల్ పరిపాలనా కార్యదర్శిగా నవీన్ మిట్టల్

12/01/2016 - 08:22

హైదరాబాద్, నవంబర్ 30: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆగస్టు 2018 నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది నవంబర్‌కు మియాపూర్- ఎల్‌బి నగర్ మార్గం పూర్తి చేయాలని గడువు విధించారు. క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో బుధవారం మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిని సిఎం సమీక్షించారు.

12/01/2016 - 08:26

హైదరాబాద్, నవంబర్ 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. సచివాలయంలో జరిగిన రాజీవ్ శర్మ వీడ్కోలు సమావేశ వేదికపైనే సిఎం ఈ విషయాన్ని వెల్లడించారు.

12/01/2016 - 08:18

హైదరాబాద్, నవంబర్ 30: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ అపుడే పూర్తి కావస్తున్నా ర్యాగింగ్ కు ఫుల్‌స్టాప్ పడలేదు. మూడు నెలలుగా కొనసాగుతున్న ర్యాగింగ్ రోజురోజుకూ జడలువిప్పుకుంటోంది. యూనివర్శిటీ కాలేజీల్లో సైతం ర్యాగింగ్‌కు జూనియర్లు బెంబేలెత్తిపోతున్నారు. కూకట్‌పల్లి జెఎన్‌టియులో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న ర్యాగింగ్ భూతం మరోమారు పంజా విప్పింది.

Pages