S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/27/2016 - 07:50

హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్ నగరం మతతత్వ శక్తులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. మంగళవారం సైదాబాద్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. బీఫ్ కావాలంటే మజ్లిస్ పార్టీకి ఓటు వేయాలని అనడం దుర్మార్గమైన చర్య అని ఆయన విరుచుకుపడ్డారు.

01/27/2016 - 07:29

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణలో 67వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా కేంద్రాల్లో గణతంత్ర వేడుకలు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడవచ్చని ఇంటెలిజన్స్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

01/27/2016 - 07:22

హైదరాబాద్, జనవరి 26: కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సియూ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

01/27/2016 - 08:07

హైదరాబాద్, జనవరి 26: గోదావరి, కృష్ణా జీవనదుల జలాలతో తెలంగాణ భూములు తడవాలి. పచ్చని పంటలతో నేల పరవశించాలి. రాష్ట్ర ప్రజలకు సుఖం, శాంతి చేకూరాలని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహాన్ ఆకాంక్షించారు. మంగళవారం సికిందరాబాద్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహాన్ మాట్లాడారు.

01/27/2016 - 02:35

హైదరాబాద్, జనవరి 26: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ఐదు రోజులే మిగిలింది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్ర నేతలంతా ప్రచార బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. 30న జింఖానా మైదానంలో తెరాస నిర్వహించనున్న బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. అయితే బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడి గ్రేటర్‌లో విజయం సాధిస్తే ఏంచేస్తారో స్పష్టంగా వివరించనున్నారు.

01/26/2016 - 18:11

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా టిడిపి అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఈనెల 28, 29 తేదీల్లో నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. టిడిపి-బిజెపి కూటమి తరఫున ఆయన పలు రోడ్డు షోలు, ఎన్నికల సభల్లో పాల్గొంటారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 31న తెరపడనున్న నేపథ్యంలో టిడిపి-బిజెపి నేతలు చంద్రబాబు ప్రచార సభలను ఖరారు చేశారు.

01/26/2016 - 17:44

హైదరాబాద్: తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుకాని వాగ్దానాలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ ఆరోపించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మంగళవారం మల్కాజిగిరిలో పార్టీ తరఫున ప్రచార యాత్రలో పాల్గొన్నారు. టిడిపి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ఆరునెలల్లో నగర వాసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.

01/26/2016 - 11:39

వరంగల్: వచ్చే నెల 17 నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో తొలిసారిగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వంద రూపాయల టికెట్‌తో ప్రత్యేక దర్శనం వల్ల భక్తుల పట్ల వివక్ష చూపుతున్నట్లు వస్తున్న ఆరోపణల రీత్యా అధికారులు ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని క్యూ లైన్లనూ ఉచిత దర్శనం కోసమే వినియోగిస్తారు.

01/26/2016 - 11:38

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను బంద్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను తెలియజేసేందుకు నగరంలో నేడు విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ర్యాలీని నిరోధించాలని పోలీసులు సిద్ధమవుతున్నారు.

01/26/2016 - 11:37

హైదరాబాద్: ఎ.పి.లో త్వరలో కేన్సర్ ఆస్పత్రి ప్రారంభిస్తామని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నగరంలోని బసవ తారకం కేన్సర్ ఆస్పత్రిలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు అన్ని వర్గాలూ కృషి చేయాలన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కేన్సర్ ఆస్పత్రిని పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Pages