S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

10/17/2017 - 21:00

ఆ కళ్లు కొత్త భాషపై అక్షరాలు రుద్ది
హృదయంలోని భావాలను
చేతివ్రేళ్లపైన ఆడిస్తాయి
ఆ వ్రేళ్ళేమో మనిషికి - మనిషికి మధ్యన
జవాబుదారిగా నిలుస్తాయి

ఆ కళ్ళు సృష్టించిన కొత్త భాషతో
ప్రపంచపు భాషామోము మూగదవుతుంది
నీ భాష నీది - నా భాష నాది అనే ఆ కళ్ళూ
చెవులకు - నోటికి పని లేకుండా చేస్తాయి.

10/17/2017 - 20:59

అద్దం పగిలిందా
రాయిని కాదు ప్రశ్నించాల్సింది
విసిరిన చేయిని!

పగిలిందని ఎగిరి గంతేయకు
నీ వికృత రూపాన్ని
అది వేయి ముఖాలుగా చేసి
లోకానికి పట్టిచ్చింది!

నన్ను చూసి కన్ను మండిందా
చల్లార్చాల్సింది కంటిని కాదు
నీలోన మండుతున్న అసూయని!

ఆర్పకపోతేనేం
భావించావా లోలోన?
నిలువునా దహించేది నినే్న!

10/17/2017 - 20:58

మహాకవి శేషేంద్ర 90వ జయంతిని పురస్క రించుకుని ఈ నెల 20వ తేదీ సాయంత్రం త్యాగరాయ గానసభలో సాహిత్య సదస్సు నిర్వహి స్తున్నట్లు గానసభ అధ్యక్షులు వి.ఎస్.జనార్ధనమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య బన్న ఐలయ్య అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఆచార్య కె. యాదగిరి కీలకోపన్యాసం చేస్తారు. ముఖ్య అతిథిగా జిహెచ్‌ఎంసి ఉప కమీషనర్ డా. ఎన్. యాదగిరి, ఆత్మీయ అతిథిగా ఆచార్య ననుమాస స్వామి, ప్రముఖ సాహితీవేత్త వి.ఎస్.ఆర్.ఎస్.

10/17/2017 - 20:57

కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సమాఖ్య సంయుక్త నిర్వహణలో ప్రముఖ కవి శిఖామణి ఆరుపదుల సాహితీ ఉత్సవాన్ని ఈ నెల 29వ తేదీ ఉ. 9.30 నుంచి యానాంలో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షులు దాట్ల దేవదానం రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు శిఖామణి సాహితీ పురస్కార ప్రదానంతో పలు గ్రంథాలను కూడా ఆవిష్కరిస్తారు. శిఖామణి పరిశోధకులకు సత్కారం, కాళోజీ అవార్డు గ్రహీత డా.

10/17/2017 - 20:57

పుష్ప పరిమళాన్ని ఆఘ్రాణిస్తాం
కారణమైన పూవును మరుస్తాం
నాలుక తో రుచిని చవి చూస్తా
పంట చేసిన చేయిని విస్మరిస్తాం
కీర్తి పతాక ఎగరేస్తాం
మోసిన చేతులను దులిపేస్తాం
కమ్మదనం జుర్రుకుంటూ
స్వేదప్రాణిని ఛీ కొడతాం.

10/17/2017 - 20:55

గత వారం ‘సాహితి’లో ప్రచురితమైన జె.ప్రసాదరావు వ్యాసం ‘సమ భావమే సాహిత్య ధర్మం’లో స్పష్టత లోపించింది. అసలు సమభావం అంటే ఏమిటి? సాహిత్యంలో ఆ సమభావాన్ని సాధించటానికి గల పద్ధతులు ఎలాంటివో కనీసం సూత్రప్రాయంగానైనా రచయిత చెప్పలేకపోయారు.

10/17/2017 - 20:54

ప్రతిరోజు
ఓ సరికొత్త పేజీనే
క్షణానికో ప్రశ్నోదయం
అక్షరాల్లేని పుస్తకాల్లో
సమాధానాల కోసం వెతుకులాట!
అనుభవాల కలం
అనుభూతుల గతాన్ని లిఖిస్తుంది
మార్కుల్లేవు కాని
నిమిషానికో పరీక్ష!
అలుపెరగని నిత్య సాధన
అందులేని సత్య శోధన
వర్తమానపు గొంతుతో
వల్లె వేస్తూనే వుండాలి
మానిన గాయాల అడుగు జాడల్ని

10/17/2017 - 20:52

స్ర్తిలకు సమాన హక్కులు ఇవ్వాలని, వారిని హృదయపూర్వకంగా గౌరవించగలగాలని వ్యాసాలు, ఉపన్యాసాలు చేయడం వేరు; వారి వాస్తవిక పరిస్థితిని కళ్లకు కట్టేట్లుగా వర్ణించి చెప్పడం వేరు. ఇది కధ మాత్రమే అని తీసిపారవేయడానికి లేకుండా, వాళ్లు పడుతున్న శారీరక, మానసిక యాతనలను తెలియజెప్పడం ఎంతో ఉదాత్తమయిన విషయం. కీ.శే. పురాణం సూర్యప్రకాశరావు రాసిన ‘చరణదాసులు’ (1956) కథలో ఇటువంటి ప్రయత్నం జరిగింది.

10/08/2017 - 21:40

సాహితీ ప్రక్రియ ఏదైనా రచయిత భావుకతకు, సమకాలీన అంశాలపై అతడి అవగాహనకు అద్దం పడుతుంది. కథ అయినా, నవల అయినా, పద్యమైనా, గద్యమైనా అన్ని ప్రక్రియలు కూడా రచయిత ఎంపిక చేసుకున్న కాల్పనిక అంశాలను ప్రతిబింబిస్తాయి. ఆంగ్ల సాహిత్యంలో నిరుపమాన రచయితలెందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఒక్కో రీతి. తాము ఎంచుకున్న అంశాలను పాఠకుల హృదయాలు తాకేలా అందించగలిగే పదునైన పదజాలంతో సాగిన నవలలు కొన్నైయితే...

10/08/2017 - 21:39

ఒక బలహీన క్షణం. .. రహస్యం
రూపాంకురం .. అత్యంత రహస్యం
అత్యంత గోప్యంగా
రహస్య మందిరంలో
ఇప్పుడు నిశ్శబ్ద రణరంగం

గొంతులో గుడ్డ కుక్కబడిన
మూగ వేదన
బహుశా తొమ్మిది మాసాలుగా
దాచుకున్న రహస్యాన్ని
రక్షించే యుద్దమే అనుకుంటా...
ఇప్పుడిప్పుడే పచ్చి నెత్తురు వాసన
అంతలోనే మరో అరణ్య రోదన
లేత రక్తమాంసాల సంతర్పణ

Pages