S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

02/21/2016 - 20:38

అన్నం ముందు
ఆకలితో కూర్చున్నా
‘‘ఈ నాలుగు ముద్దలు
నా ఆకలిని ఓదార్చగలవా?’’ అనుమానం.

‘‘అదైతే తిను’’ అన్నట్లు ఆమె.
అక్కడికే సరిపోయింది.
నా ఆకలి ఆమెకు తెలిసినంతగా
నాకు తెలియదు.

02/21/2016 - 20:36

అజ్ఞాత మిత్రమా
ఎవరు కన్నబిడ్డవో
ఎవర్ని కన్నతండ్రివో నీవు
ఎనే్నండ్లు బతికేవో

ఈమధ్యనే కాలధర్మం చెంది
కానరాని లోకాలకేగినట్టున్నావు
నాకెలా తెలిసిందనా?

02/21/2016 - 20:35

ఒక సంఘటన
అంతులేనంత విషాదాన్ని రేపి
జీవనానే్న ప్రశ్నించినప్పుడు
అశృబాష్పమై కరగడం
ఆవేశమై జ్వలించడం
మానవత్వం.

జరిగిన ప్రతిచర్యతో పాటూ
ఆ ప్రతిచర్య వెనుక నిగూఢంగా దాగిన
చర్యని చూడలేకపోవడం
అనుభవ రాహిత్యం,
అసంపూర్ణ వ్యక్తిత్వం.

02/14/2016 - 19:58

మాదిరాజు లక్ష్మీనరసింహారావు
(కనువెలుగు: 7-11-1928 : కనుమరుగు: 12-2-2016)

02/14/2016 - 19:57

కన్యాశుల్కం తరువాత వెలువడిన సాంఘిక నాటకాలు ఏవీ కన్యాశుల్కం వలె పాఠకుల హృదయంలో చెరగని ముద్రవేయలేకపోయాయి. ఆ నాటకం ఒక అపూర్వ సృష్టి. నాటి సాంఘిక జీవనానికి ప్రతిబింబం. కొందరు విమర్శకులు ఈ నాటకం అంతా పానకమేనని కాని అందలి ఘట్టాలు కొన్ని పుడకలవలె ఉన్నాయని అన్నారు. వారి దృష్టిలో మధురవాణి ఇంటిలో పేకాట సారా దుకాణ ఘట్టాలు శిష్యుని తత్వాలు మొదలయినవి కావచ్చు. అవి పుడకలు కావు.

02/14/2016 - 19:56

రచన, సృజనని స్థలకాలాలు నిర్దేశిస్తాయి. ఇప్పుడు స్థలం కొత్త రాష్ట్రం. కాలం రాష్ట్రావతరణ అనంతర సమయం. వీటి మధ్య జీవిస్తున్న తెలంగాణ ప్రజల జీవితమే వర్తమానం. ఈ వర్తమానాన్ని మానవీయంగా, ప్రజాస్వామ్యంగా, సుఖసంతోషాలతో తీర్చిదిద్దడమే కర్తవ్యం.

02/14/2016 - 19:55

‘అమ్మమ్మా వాన పడుతోంది’
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
‘పడనీరా చల్లగా ఉంటుంది’అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది

వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు
వానలో తడవటం బావుంటుంది
దయలాంటి వానకి, ప్రకృతిలోని అందమంతా కరిగి నీరైనట్లు పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది

02/14/2016 - 19:54

రెండు జీవితాలు
ఎంచుకోవడం పరిష్కారం
నమ్మి నడవడం సమస్య
ఆలోచనా ఉరిని బిగించుకోవడం మరణం.
***
నువ్వొక కాలిబాటను ఆశిస్తావు.
ఏ సంకేతాలు లేని విశాల
అయోమయ తత్వాన్ని నేను
ఆదరంగా ఆహ్వానిస్తాను.

చేధించడానికి
నీకొక లక్ష్యం కావాలి.
నేను కలలుగంటాను
నిర్లక్ష్యాన్నై సంచరించాలని.

02/14/2016 - 19:53

భాషలేని తనం,
గొంతు లేని తనం,
తలపాగా లేని తనం
ఈనాటి శాపాలు
ఈ దేశానికి
బ్రహ్మశాపం లాంటి
ప్రపంచ బ్యాంకు పుణ్యమా అని!
ఎన్ని ముక్కలయ్యాయో,
ఎన్ని ముద్దలయ్యాయో,
జన శరీరాలు
తపస్సులు చేసే, చేసే,
జపాలు జరిపే జరిపే,
యుద్ధాలు చేసే చేసే,
భారతావని బాలసారకి!
***
భూగర్భ శాస్త్రానికి అందే విజ్ఞానంలా

02/07/2016 - 21:27

ఆత్మ పరమాత్మల పరిశోధనకు
ఉపక్రమించటం లేదు
అంతర్ముఖ ఆలోచన్ల పాతర లోతుల్ని లెక్కించటం లేదు
వర్తమాన జీవన స్రవంతిపై జలతరంగిణి
వినిపించాలనీ లేదు
బాల్యం తప్పటడుగుల్ని తడిమి తడిమి
చూచుకుంటున్నాను
వయస్సు ఎక్కుతున్న నిచ్చెన మెట్లపై నుండి
వెనక్కి వెనక్కి ఆలోచించుకుంటున్నాను
ఎడారిలో పూల పరిమళాల సుగంధాలను
ఆస్వాదించలేమని ఆకళింపు లేనివాణ్ణి

Pages