S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/31/2016 - 21:20

ఈ మధ్య నేను గడిచిన మూడుసార్లు సాహిత్య అకాడమి గురించి రాశాను. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతమైన రచనగా పరిగణించి సాహిత్య అకాడమి వారు పురస్కారం ప్రదానం చేసిన గ్రహీతలను, పురస్కార నిర్ణాయకులను (జూరీ సభ్యులు) అధిక్షేపించానా అని నాకు భ్రమ కలుగుతోంది. అలాంటి ఒక రచనను ఆంధ్రభూమి (సాహితి) దినపత్రికలో చూసినవారు, చదివినవారు, అందులో కనీసం కొందరు కోపం తెచ్చుకునే అవకాశం లేకపోలేదని నాకు తెలియకపోలేదు.

01/24/2016 - 20:39

కాటుకను, కటిక చీకటిని,
కురులను, కారుమబ్బులను
తలదనే్న సిరా చుక్కకి
కాంతిని కరిగించగల చిక్కదనమట
కాలాన్ని కవ్వించగల చక్కదనమట

01/24/2016 - 20:38

మిత్రులారా
నా పిల్లల్లారా
నాకు షష్టిపూర్తా?
ఏమిటీ! ఉత్సవమా!
మన దేశంలో
ఇంకా
సమష్టి వసంతం
పూయనే లేదు కదా!

01/24/2016 - 20:36

కళామతల్లి కాలిమువ్వల సవ్వడి కడుపులో
అరవైనాల్గు రంగుల రాగఝురులు
మనసులో గిలిగింతలు పూయించే లయ తాళాలు
సంగీత, సాహిత్య,
చిత్ర శిల్ప లలిత కళా గేయాలు
సాధారణ జీవి హృదయ కేదారాలు.
ఒక్కటి రంగరించుకున్నా
చక్కని కళాతపస్సే.
కలం హలం కాయితం క్షేత్రాన్ని దునే్నసినా
రాగఝురిలో హంగులు గళమెత్తినా
రాతి గుండె గూడు మీద ఉలి నాట్యమాడినా

01/24/2016 - 20:34

కన్‌సైజు ఆక్స్‌ఫర్డు ఇంగ్లీషు డిక్షనరీ (2011 ప్రచురణ- పునర్ముద్రణ 2013)లో ఇంగ్లాండు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియా, రష్యా, జపాన్, చైనా తదితర దేశాలకు చెందిన అనేక భాషలలోని పదాలు ఎన్నో యథాతథంగా స్వీకరింపబడి, ప్రాంతీయ వైవిధ్యంతో కూడిన స్టాండర్డు ఇంగ్లీషుగా ప్రకటింపబడ్డాయి.

01/24/2016 - 20:33

శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధింపబడే పురోగతి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పందొమ్మిదవ శతాబ్దంలో జరిగిన వివిధ వైజ్ఞానిక రంగాలలోని విప్లవాత్మకమైన ఆవిష్కరణలు ప్రపంచ దేశాలన్నింటితోపాటు భారతదేశాన్నీ ప్రభావితం చేసాయి.

01/24/2016 - 20:33

"Words make you think. Music makes you feel.
A song makes you feel and thought''.
- E.Y.Harburg

01/18/2016 - 04:57

మిత్రుడా...
నాకింకా ఈ మనుషుల మీద
బంధాల మీద
నమ్మకం సడలలేదు
నన్నిక్కడే వుండనివ్వు

ఈ పల్లెల మీద, పిలుపుల మీద,
వరుసల మీద
నాకింకా మమకారం తీరలేదు
నన్నిలా వదిలిపెట్టు -

ఇక్కడి చల్లగాలి లేత స్పర్శలో
ఏదో తెలియని
ఆత్మీయత పొడమి వుంది
తనివితీరా గ్రోలనివ్వు -

01/18/2016 - 04:55

అనుకోకుండానే కొన్ని
ఆఖరు క్షణాల్లో చిక్కిపోతుంటాం

మనసుకూ జీవితానికి మధ్యన
తెగని దారం ఒకటి
రెండు చివర్లను కలుపుతుంది

తెగకుండా దగ్గరవకుండా
నిర్ణయానికి భవిష్యత్తుకు పొంతనా ఉండదు
అడుగు వెనకేస్తే ముందు ఆగిపోతుంది
ఒక్క క్షణమే కాలానికీ గమనానికీ ముడివేసేది

01/18/2016 - 04:03

పదకొండో శతాబ్దపు తొలి దశకాల్లో ఆంధ్ర సాహిత్యానికి అంకురార్పణ జరిగిందనీ, వ్యాసకృతమైన సంస్కృత భారతానువాదంతో తెలుగులో లిఖిత సాహిత్యం ప్రారంభమయిందనీ అందరూ ఎరిగినదే. ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ’ అనే సంస్కృత శ్లోకంతో ప్రారంభమైన భారతపు ఆంధ్రానువాదమే తెలుగు తొలి కావ్యంగా అందరూ అంగీకరించారు. అలా భారతానువాదాన్ని ప్రారంభించిన నన్నయభట్టునే ఆదికవిగా గుర్తిస్తున్నారు.

Pages