S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

03/06/2016 - 21:53

ప్రస్తుత సమాజ స్థితిగతులలో, తెలుగు నాట పుస్తక పఠనం దిగజారిపోవటానికి, మాతృభాష పట్ల ఆదరణ తగ్గటానికి రచయితలు, కవులు బాధ్యులనటంలో సందేహం లేదు. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థి ఎవ్వరైనా ఒకవేళ ఉత్సాహంగా కాలక్షేపం కోసం ఏదైనా నవల చదవాలని ప్రయత్నిస్తే ప్రస్తుత రచయిత ఫలానా పుస్తకం చదవమనటం లేదా చదివించటానికి ఆస్కారం లేదు.

02/28/2016 - 18:33

పద్యనిర్మాణ వాస్తు శిల్పం ప్రారబ్ధవశాత్తు అప్రయోజకుల పాలబడ్డది. కవితాగుణం కొరవడ్డ పదప్రోతంలోకి శబ్దాలు అక్షరాలు ప్రవేశపెట్టబడ్డాయి. రూప విన్యాస వైఖరికి ఆస్వాదమయ్యాయి. దానికి తగ్గట్టు ఏవేవో కొత్త కొత్త పేర్లు తగిలించుకున్నాయి. అలానే అఘోరిస్తున్నాయి. ‘్ఛందస్సుల అశ్వహృదయం’ తెలియకుండానే కనీసం అందులో ప్రాథమిక పరిజ్ఞానమనే అర్హత కూడా లేకుండానే పితృపాదుడౌతున్నాడు.

02/28/2016 - 18:32

ఆ రోడ్డున
పూల వర్షం కురిసింది!
బహుశా -
ఎవరో నేలతల్లిని చేరుకునేందుకు
ప్రయాణం కట్టినట్లున్నాడు!?

మొన్న కల్సినవాడిని
అభిమానంగా పలకరిద్దామని
బయలుదేరాను!
చిత్రం!
ఆ ఇంట్లో ఫొటోలోకి చేరి దండై వేలాడుతూ
వెక్కిరించాడు!!

కొన్ని కరచలనాలు నీడలై
చాలాసార్లు జ్ఞాపకాల ముద్రవేసుకొని
వెంటాడుతూంటాయి!

02/28/2016 - 18:31

ఆకాశ కల్లోలిత ప్రాంతంలో
మేఘాలు వస్త్ర సన్యాసం చేసాయి
కురులు విప్పిన శిశిరం
నగ్నమానుల్ని కౌగలించుకుంటుంది.
అనేక రాత్రులన్నీ కలలుగా భావించబడ్డాయి
నిద్రలో అలలుగా భాగించబడ్డాయి
తారల తనువుల్లోంచి
పర్యాయ దేహాలు పుట్టుకొచ్చాయి
అవి కొన్ని కొత్త దాహాల్ని ఏరుకొచ్చాయి
నెలవంక ఆ నేల వంక చూసి
చిలిపిగా నవ్వుతుంది

02/28/2016 - 18:29

సారవంతమైన నేలలో
రాలే విత్తనాలయితే బాగుండునివి

కల్తీ కానివి
మచ్చలేనివి చిట్లిపోనివి
దోష రహితమైనవి
అరుదుగా రాలిపడే
అమూల్యమైనవి

ఆనందాన్ని ఆపుకోలేక
నవ్వుతో పుష్పించి
ఆశ్రువుగా జారిపడే
వినూత్న సృష్టి ఇది

02/28/2016 - 18:25

‘జలపుష్పం’ అని
నాన్న ముద్దుగా పిలుచుకునే చేపల గంప
ఏ వీధిలో వున్నా
రెక్కలుగట్టుకొని వాకిట్లో వాలుతుంది.
నాన్న, కొసరి కొసరి బేరమాడి
ప్రాణం వచ్చినట్టు
చేపలు చేతుల వలకెత్తుకున్న ముఖంల
మురిపెం పూసిన ఆనందమవుతాడు.

సగం బరువు దిగిన చేపలమ్మ
ఎవరెస్టు ఎక్కిన విజేత గర్వంలా
ఊరేగుతుంది.

02/28/2016 - 18:23

పుస్తకమ్

వేకువపిట్ట
ఎస్.ఆర్.్భల్లం
పుటలు: 82; వెల:రు.100/-
ప్రతులకు: భల్లం సామ్రాజ్యలక్ష్మి,
4-87-12, ఇందిరానగర్, గాంధీబొమ్మ సెంటర్,
తాడేపల్లిగూడెం- 534101.. ఫోను: 9885442642
విజయవాడ, విశాలాంధ్ర బుక్‌హౌస్, సాహితీ బుక్‌హౌస్,
నవోదయ పబ్లిషర్స్, శివకామేశ్వరీ గ్రంథమాల.

02/28/2016 - 18:20

తెలంగాణ సాహిత్యానికి, సాహిత్య చరిత్రకు, సాహిత్యకారులకు దక్కవలసిన న్యాయమైన స్థానం నేడు దక్కకుండా పోతుంది. గతంలో తెలంగాణ కవులూ, రచయితలూ, కళాకారులు తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎత్తిచూపడానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ కవులను, రచయితలను, కళాకారులను పూర్తిగా విస్మరించడం జరుగుతుంది.

02/21/2016 - 20:43

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, శాన్‌ఫ్రాన్సిస్కోకు దిగువ పసిఫిక్ సముద్ర తీరంలోనికి ఒక పాయగా - అంటే మన బంగాళాఖాతంలా చొచ్చుకు వచ్చిన ప్రాంతాన్ని ‘బే ఏరియా’గా పిలవడం పరిపాటి. ఇక్కడ మన తెలుగువాళ్లు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకరించి ఉన్నారు. వాతావరణంలో కొంత సమస్థితి, యాపిల్, గూగుల్ కంటే పెద్దపెద్ద కంపెనీలుండటంతో, ఎక్కువ ఉద్యోగ వసతి ఉండటం కారణంగా, అక్కడ ఉండటానికి ఎక్కువమంది ఇష్టపడతారు.

02/21/2016 - 20:40

1959 నవంబరు, డిశంబరు మధ్యకాలంలో కాకినాడ సూర్యకళామందిరంలో గురజాడ వర్ధంతి రెండుసార్లు జరిగింది. మొదటిసారి పాలగుమ్మి పద్మరాజు, ఆవంత్స సోమసుందర్, ఉషశ్రీ సభలో పాల్గొన్నారు. రెండవసారి సభ ఉషశ్రీ అధ్యక్షతన, కృష్ణశాస్ర్తీ, కాటూరి వెంకటేశ్వరరావు ఉపన్యాసాలతో రసవత్తరంగా సాగింది.

Pages