S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/21/2015 - 03:16

ఆత్మ పరమాత్మల పరిశోధనకు
ఉపక్రమించటం లేదు
ఆంతర్ముఖ ఆలోచన్ల పాతర లోతుల్ని
లెక్కించటం లేదు
వర్తమాన జీవన స్రవంతిపై జలతరంగిణి
వినిపించాలనీ లేదు
బాల్యం తప్పటడుగుల్ని
తడిమి తడిమి చూచుకుంటూ
వయసు ఎక్కుతున్న నిచ్చెనమెట్లపై నుండి
వెనక్కు వెనక్కు ఆలోచించుకుంటున్నాను

12/21/2015 - 03:13

చెట్టుకు వేలాడుతున్న
మట్టి పాదాల చుట్టూ మూగి
ఎంతగా పరితపించినా
ఏం ప్రయోజనం

చావు రహస్యాన్ని
పలుసార్లు చెవిలో ఊదినా
చలించని పాలకుల్ని
నిలదీయాలి గాని

రుతువు వెళ్లిపోయాక
రాలిన బంతిపూల మీద
ఎంతగా సానుభూతి వొలకబోసినా
ఏం ఫలితం

పొలాలమీద
పొరలు పొరలుగా విస్తరిస్తున్న
విషాద మేఘాల్ని
పసిగట్టాల్సి ఉంది

12/21/2015 - 03:11

ప్రఖ్యాత కవి, గాయకుడు గోరటి వెంకన్నకు మువ్వా పద్మవతి, రంగయ్య ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కవి మువ్వా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ అవార్డు కింద 25వేల నగదు, మెమొంటో బహూకరిస్తారు. ఈ నెల 27వ తేదీన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సత్కార సభ జరగనుంది.

12/21/2015 - 03:10

హిందీ సాహిత్య రంగంలో ప్రసిద్ధిగాంచిన సుప్రసిద్ధ కవి జయశంకర్ ప్రసాద్ రాసిన ‘ఆంసూ’ గేయ కవిత్వాన్ని ‘వేదన’గా జలజం సత్యనారాయణ అనుసృజించారు. ఈ నెల 24న మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ‘వేదన’ ఆవిష్కరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపి విచ్చేసి ఆవిష్కరిస్తారు. సభాధ్యక్షులుగా తె.ర.వే.

12/21/2015 - 03:09

తెలుగు నుడి ఏనాటిదో శక తేదీలతో చెప్పలేం కానీ... ప్రాచీన కాలం నాటిదే. మూల ద్రావిడ భాష నుండి విడివడినదే తెలుగు నుడి. మూలం నుండి విడివడినప్పుడు, ఆ మూలంలోని కొన్ని ధాతువులు కొత్త నుడిలోకి వస్తాయి. అలా వచ్చిన ధాతువుల మాటలు కొత్త అలికిడి (ఉచ్ఛారణ)ని సంతరించుకుంటాయి. తెలుగు నుడి పుట్టుక, వ్రాలు (లిపి) ఏనాటికి పుట్టిందో కాని, అది సరిగా చెప్పలేం. మనకు దొరికిన 6వ శతాబ్దం నాటి తెలుగు శాసనమే మొదటిది.

12/21/2015 - 03:08

ఏ వ్యాసం చదివినా, పుస్తక సమీక్ష చదివినా, పుస్తక పరిచయం చదివినా, విన్నా... ప్రతిచోటా కన్పించేది, విన్పించేది వస్తువైవిధ్య ప్రస్తావనలే. కొంచెం అందంగా దీనే్న కవిత్వ విస్తృతి అంటుంటారు. ఇది ఆహ్వానించదగినదే. నిజానికి అట్లా ఎంతవరకు రాస్తున్నాయన్నదే ప్రశ్న. ఆయా కవితా సంపుటాల్లో, సంకలనాల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా తరచు కన్పిస్తుంటాయి. సంపుటాల్లో పూర్తిగా కవిదే బాధ్యత. కానీ సంకలనాల్లో అది సంపాదకులదీ.

12/13/2015 - 22:44

గాలిపటంలా
రెక్కలను బార్లాచాపి
యోగిధ్యానంలా నిశ్చలస్థితిలో ఉంచి
చప్పుడు చెయ్యకుండా
నేలకు దిగుతున్న పారాచ్యూట్లల్లా
అవి ఆకాశంలో చక్కర్లు కొడుతుంటే
ఆనందమూ ఆశ్చర్యమూ
ముప్పిరిగొనగా
నేనూ పక్షిదేహినయితే
ఎంత బాగుండును అనుకుంటాను
ముదురాకు పచ్చని
చిక్కని చెట్ల చీకట్లలో
కొమ్మపై కూచుని
రెక్కల్ని విసనకర్రల్లా

12/13/2015 - 22:42

ఆ వ్యాసం నిండా
వాక్య రత్నాలే

12/13/2015 - 22:40

అమ్మా.. ఎందుకిలా చేశారు
నేను ఆడపిల్లననేగా
ఇంత ఘాతుకానికి ఒడగట్టారు

నీ ప్రేమ పొరల్లో
మొలకగా వూపిరి పోసుకున్న
నన్ను
చిదిమి వేయడానికి మనసెలా వచ్చిందమ్మా?

12/13/2015 - 22:37

తెలుగు సాహితికి
తన వంతు తోడ్పాటుగా
మీ అభిమాన దినపత్రిక
ఆంధ్రభూమి ఎప్పటిలాగే
ఈ సంవత్సరమూ
కథల పోటీ
నిర్వహిస్తున్నది.

Pages