S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

12/13/2015 - 22:31

పత్రికల్లో శీర్షికలు - ఒక్క మాటలో చెప్పాలంటే బొట్టూ కాటుకలు. ఇవి ఇంగ్లీషులో కాలమ్స్‌గా మొదలై తెలుగు పత్రికా రంగంలోనూ ప్రకాశించాయి. విశేష సందర్భాలు వీటి అవసరాన్ని పాదుకొల్పితే, ఒక్కోసారి లబ్దప్రతిష్టులను కాలమిస్టులుగా పరిచయం చేసే క్రమంలో మొదలవుతాయి.

12/13/2015 - 22:29

తెలుగు కవిత్వం ఎన్నో చైతన్య జ్వాలల్ని, ఉత్తేజ తరంగాల్ని, ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తూ నేటికీ ఓ తీరని దాహంగానే ఉంది. అందులో పాఠకుడి పాత్ర ఎన్నదగినది. అలాంటి పాఠకుడు ఇవ్వాళ కనుమరుగు అవుతున్నాడా? నిజం చెప్పాలంటే చాలావరకు అవును అనే సమాధానం వస్తుంది. సాధారణంగా కవిత్వం చదివే పాఠకులు తగ్గిపోతున్నారు. దీనికి ఎన్నో కారణాలు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు.

12/07/2015 - 07:37

జీవితంలో ఎదుర్కొన్న యథార్థాన్ని
సాహిత్యంలో ఎదుర్కొంటే హర్షించడు
పాఠకుడు. అతనికి కావల్సింది
కళానుగుణమైన సత్యం.
నగ్నసత్యం కాదు.
- బుచ్చిబాబు

12/07/2015 - 07:36

రచయిత పి.వి.బి.శ్రీరామమూర్తితో ముఖాముఖి
==== ఒకరితో ఒకరు =====

12/07/2015 - 07:35

ప్రశ్నించాల్సి వస్తుందనుకోలేదు
తర్కించాల్సి ఉంటుందనుకోలేదు
చావు ముందా బతుకు ముందా
సుద్దులను సరిహద్దులను రద్దుచేసే
జీవిత విధానం నిర్ణయస్తుంది
కాలానికి ఎదురీదే గట్టిదల
బతుకును గెలుచుకోవాలనే పట్టుదల
చావు పుట్టుకల్ని నిర్ధారిస్తుంది

12/07/2015 - 07:34

నేనొక జీవనదిని
కనాలని కలగంటున్నాను

నేల నలుచెరగులా కలియతిరిగి
జీవితాన్ని ఎప్పుడూ తడితడిగా వుంచే సెలయేరుని
కనాలని కలగంటున్నాను

ధర్మాన్ని బహిరంగపరిచి
మానవ మతాన్ని నిర్మించే
ఒక ఏలికను,
నిష్కల్మషమైన మహావీరుల్ని
కనాలని కలగంటున్నాను

11/30/2015 - 02:36

దేశమును ప్రేమించమంటివి
మంచియన్నది పెంచమంటివి

పరాయి దేశమును ప్రేమించుచుంటిమి
కిరాయి సంస్కృతి నేరుగా దించుతుంటిమి
మహా జోరుగా పెంచుతుంటిమి

ఈసురోమని మనుజులుండరాదని
దేశ జనులను ఆదేశించినావు

మంది తినెడి కందిపప్పే...
కేజీ వంద కంటే కింద దిగదే
భూసురుడైనా ఈసురోమనక
భేషుగ్గా ఎటులుండగలడే!

11/30/2015 - 02:33

కారణం ఏదయినా
ప్రాణం తీసుకొంటే ఎలా?
అనుకున్నవి సిద్ధిస్తే
ఆస్వాదించడమేనా?
అనుకోనివి సంభవించినా... స్వీకరించాలిగా!

విజయం అధిరోహించడమేకాదు
అపజయం అధిగమించడమూ తెలియాలి
జీవన గమనంలో
ఏ సమస్యా ముగింపు కాదు... మలుపు మాత్రమే
యిదే ముగింపు అని ఆగిపోతే
దారులన్నీ ఊపిరి ఆడనంత చిరాకులు.

11/30/2015 - 02:30

‘నీకేం తెలువదు ఊరుకో’
అన్నాడు కొడుకు
ఆమె తలెత్తి చూసి
ఓ చిరునవ్వు నవ్వి
మళ్లీ తన పనిలో మునిగిపోయింది.

‘నీదంతా పక్షపాతం
నీకు వాడంటేనే ప్రేమ’
అన్నాడు కొడుకు
ఆమె వాడి కళ్ళల్లోకి
సూటిగా చూసి
కళ్ళు మూసుకుంది.

‘నువ్వు మాకేం చేసినవ్?’
అన్నాడు కొడుకు
ఆమె నేల చూపులు చూస్తూ
మోకాళ్ళకు
గుడ్డలు కట్టుకుంటుంది.

11/30/2015 - 02:28

పాఠకుల కంటె కవులు ఎక్కువ. ప్రతి కవి పాఠకుడు కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఉద్యమ కవిత్వం ఒక చక్కని వ్యాపారం. ఇంత చదువుకోని పూర్వ కవులు తమ కృతుల కారణంగా ఇంకా మిగిలి వున్నారంటే అపుడు ఇంత జనాభా లేరు. కవులున్నూ లేరు. ఇన్ని సభలప్పుడు లేవు. ఇన్ని ఆవిష్కరణలున్నూ లేవు. ఐతే ఆధునిక సాహిత్యంలో పది కాలాలపాటు నిలచే రచనలేమైనా వున్నాయా అంటే- అసలీ ప్రశ్న ఎవరు ఎవర్కి వేయాలి అనే సమస్య తల ఎత్తుతుంది.

Pages