S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/03/2016 - 22:08

భూగోళమంత గంగాళంలో
మనిషి రక్తం మరగకాస్తున్న వాసన
సంపదల వేట, సంస్కృతుల తంటా
నరాంకానికి దించుతున్న తెర

నెత్తుటి పగ, రుధిర ప్రతీకార సెగ
శవాల గుట్టల కాటా, వాటాలు తేల్చే తూటా
చర్య, ప్రతి చర్యల దోబూచులాట

01/03/2016 - 22:05

ఫోన్ చేసి
‘నా పానం బాగాలేదురా
ఎట్లున్నవ్ అందరు మంచిగున్నరా
నిన్నూ అమ్మనూ చూడాలని ఉంది’ అడుగుతా
నువ్వు ఎక్కెక్కి దుఃఖించినప్పుడు
నా గుండె గూడుపట్లు కదిలిపోయినయ్ మామా!

01/03/2016 - 22:03

త్రికాలానే్వషణలో తీరిన కవి మాత్రమే అనంతానే్వషణశీలిగా సృజనాత్మకమైన కవిత్వాన్ని సృష్టించగలుగుతాడు. గతాన్ని జ్ఞాపకాల్లోను, భవిష్యత్తును దార్శనికంగాను, తనతో నడిచే వర్తమానంతో సరిపోల్చుకుంటూ అక్షరాల్లో దర్శనమిస్తుంటాడు.

01/03/2016 - 22:00

మానవీయ విలువలు, నైతికత, ధర్మస్థాపన, త్యాగం ప్రేమ వంటి విషయాలపై దాదాపు అన్ని ప్రపంచ భాషలలో కథలొచ్చినట్టుగానే మన భారతీయ భాషలలో కొడా వచ్చాయి. ఇటీవలి కాలంలో స్ర్తివాదం, దళిత వాదం, విప్లవం, తిరుగుబాటు, ఉద్యమాలకు సంబంధించి భారతీయ భాషలన్నింటా కథలొచ్చాయి. జీవన విధానంలో ఆచార వ్యవహారాలలో కొద్దిపాటి తేడాలు కనిపించిన అంతస్సూత్రంగా సాగే ‘్భరతీయత’ మనకు అన్ని రచనల్లో కనిపిస్తుంది.

12/28/2015 - 00:27

జనవరి 3న సావిత్రిబాయి ఫూలే
184వ జయంతి సందర్భంగా...

12/28/2015 - 00:22

‘‘ఈ దేశంలో భారతరత్నాలున్నాయ్. పద్మవిభూషణ్‌లూ, పద్మభూషణ్‌లూ, పద్మశ్రీలూ ఉన్నాయి. దేశం విడిచి పోతామని ఝడిపించిన వారికి భారత రత్నాలు ఇచ్చారు. కావల్సిన వారికి, కొద్దిమంది అర్హులకీ పద్మ అవార్డులందజేశారు. కొందరైతే పద్మశ్రీ అవార్డులు కొనుక్కున్నారట కూడా...’’

12/28/2015 - 00:14

రంగు రంగుల అందమైన
సీతాకోక చిలుకలు
మెరిసే కళ్ళు,
ఇంద్ర ధనుస్సు నువ్వు
దేహంపై పట్టుల్లాంటి రెక్కలు
చిన్న పెద్ద, ముడుచుకుని ఉండె
పసుపురంగు రెక్కలు
అయినా, ఆకాశంలోకి ఎగురుతాయి
వాటి రూపం రంగు మనోహరం

సీతాకోక చిలుకలను చూస్తూ చూస్తూ
నన్ను నేను మరచిపోయాను

12/28/2015 - 00:15

మా అమ్మ ఎంతో శ్రమజీవి
ప్రేమానురాగాల గని
దయామయురాలు

ఆమె ముందు సముద్రం కూడ
చిన్నబోతుంది
ఆమె ముందు ఆకాశం కూడ
తలదించుకుంటుంది

నెమలి వచ్చి కూర్చున్నట్లుగా
మా అమ్మ ఇంటికొచ్చింది

విద్యాశక్తి
ప్రత్యక్ష స్వరూపిణిలా
నేనామెను గుండెలో దాచుకున్నాను
*

‘ పూలే కావ్య-సుబోధ్ రత్నాకర్’ మరాఠీ సంకలనం నుండి కవితల అనువాదం

12/28/2015 - 00:06

కుర్చీల నగిషీలు పొదిగిన మణులు
మకుటాల మెరుపుల్ని
ద్విగుణీకృతం చేసే కెంపులు
దూరం పెరిగినందున ప్రతిఫలించే నునుపు
మేలిమిగా మెరుస్తుంటాయి
నిజానికి
గొప్పదేదీ పైన ఉండదు
అక్కడ
అవసరం కోసం
అన్ని బంధాలు పునర్నిర్మితమవుతాయి
ముసుగు కనిపించనంత
పల్చని నటనలు పండిపోతాయి
అందర్నీ స్తుతిస్తూ
తమ మీద దృశ్యాన్ని కేంద్రీకరించుకుంటారు

12/28/2015 - 00:05

చాతుర్వర్ణ వ్యవస్థ సామాజికంగానే కాదు సాంస్కృతికపరమైన అంటరానితనానికీ బలమైన పునాదులు వేసింది. శిష్టులైన దేశీయ పండిత వర్గం తమ ఆధిపత్యం కొనసాగింపులో భాగంగా అట్టడుగు వర్గాలైన జన జీవితాలతో మమేకమై వారి సాంస్కృతిక మూలాల ఆధారంగా నిర్మించుకున్న ప్రజాకళలు, సాహిత్యాన్ని ప్రధాన సాహితీ స్రవంతిలో భాగం కానీయని కుట్రను పకడ్బందీగా కొనసాగిస్తూ వస్తున్నది.

Pages