S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

01/18/2016 - 04:02

పుస్తక విపణిలో వ్యక్తిత్వ వికాసం పేరిట వేడివేడి పకోడీల్లా వందలాది పుస్తకాలు అమ్ముడుపోవడం ఆశ్చర్యమేస్తుంది. ఇంతటి ఘనమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద గల తెలుగు జాతికి విడిగా వ్యక్తిత్వ వికాసమంటూ ఓ కొత్త విషయంలా నేర్పవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. ఉగ్గుపాలతో నేర్చిన సుమతీ, వేమన శతకాల్లోని వ్యక్త్విత్వ వికసన పాఠాలు కాలం చెల్లిపోయాయా? వాటిని మించిన తత్త్వబోధ ఈ పుస్తకాల్లో ఏముంది?

01/11/2016 - 05:47

పేరాశల పేర్చుబడిలో
ఆశల భవంతుల్నెంతకాలం
నిర్మించుకుంటూ జీవిద్దాం

అబద్దాల బడుద్దాయలమని
మనల్ని మనమే ఎంత దూరం
చాటుకుంటూ గడిపేద్దాం

రేపటికి కనీసపు మంచివారమని
ఆనవాళ్లనయనా మిగుల్చుకుందామా
నేటిని నేటి దినంలోనే
దినవారాలు గావించుకుందామా...

01/11/2016 - 05:45

తెగిన మత్తడి
నీళ్లు లేని నేల దుఃఖం
మట్టి బతుకు
ఉరితాడుకు నైవేద్యం
కరువు వేటుకో
కరంటు పోటుకో
సేద్యం కొండెక్కిపోతుంటే
బతుకు రేడియోలో
జాడ తెలీని బాధల కేంద్రాలెన్నో
ఎండిపోయిన మోట బావుల్లాంటి కళ్లల్లో
సందె వేళ
వరి మడికి నీరు పారించినట్టు
మట్టిలో నాటిన
మునివేళ్లని ముద్దాడాలి
మట్టిలో విత్తనమంటూ పడ్డాక

01/11/2016 - 05:43

జనవరి 12న
అలిశెట్టి ఫ్రభాకర్ వర్ధంతి.. జయంతి
.............................
తాను మరణించి..కవితా చరణాలకు జీవం పోసి...
.....................

01/11/2016 - 05:41

జనవరి 12న అలిశెట్టి ఫ్రభాకర్ వర్ధంతి.. జయంతి
.......................

01/11/2016 - 05:00

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలని, పాలన బహుముఖాలై విస్తరించాలని రచయితలు కోరుతున్న సందర్భంలో అక్షరం నిఘా పెరగవలసి ఉంది. ఇప్పుడు కలాల మీద బాధ్యత పెరిగింది. కాబట్టి అక్షరాలు ఇవ్వాళ పూర్వశక్తిని అమేయంగా పుంజుకోవాలి.

01/11/2016 - 04:59

ప్రముఖ రచయిత చిలుకూరి దేవపుత్ర రచించిన ‘పంచమం’ నవలకు ప్రముఖ రచయిత ఎన్.వేణుగోపాల్, ప్రముఖ కవి కలేకూరి ప్రసాద్ ముందుమాట రాశారు. పాత్రల తోటి రాయలసీమ మాండలికంతో మాట్లాడించారు రచయిత. సెకండ్ క్లాసులో పాసయ్యే మొగోడు మా దగ్గరలో పుడితే ఇంకేమిలే అనే అవమానంతో మొదలయ్యే నవల ఆసాంతమూ మాల మాదిగల మీద భూస్వాముల అణచివేతను, పీడనను చిత్రించినట్లుగానే కనబడతాడు రచయిత.

01/11/2016 - 04:58

ఊరిలో ప్రజలంతా ఊరిని ఆవరించి వున్న అరణ్యాన్ని తెలుసుకోవాలని అనుకొన్నారు. అనుకొన్నదే తడవుగా ఎవరికి తోచిన మార్గంలో వారు ధైర్యంగా అరణ్యంలోకి దారితీశారు. మనసులో ధైర్యం, కాళ్లలో బలం ఉన్నవారు, ఆలోచనలో శక్తి ఉన్నవారు ముందుకి వెళ్లారు.

01/03/2016 - 22:10

కన్నీటి బిందువులను ఏరుకుంటున్నాను
నీకు నాకు మధ్య కొనసాగిన జ్ఞాపకాల నుండి
జారిపోయన జీవితాలను తాకుతున్నాను
నిన్ననటికీ నేటికీ మధ్య ఎడతెగని యాతన
పరిశోధించి మధించి నింపుకున్న జ్ఞానం
నా మెదడులోంచి కారిపోతున్న
అవాంఛనీయ అనుభూతి
రాత్రి కల నుండి
ఉదయానే్న నన్ను నేను తట్టి లేపుకునే వరకు
వెంటాడిన కలవరింత
కరువుతో ముక్కలవడం

Pages