S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

09/30/2016 - 22:27

పెళ్లి ప్రతీ వారి జీవితంలో ఆనందదాయకమైనదే. విడాకులు? అదీ ఆనందదాయకమైందే. లేకపోతే విడాకులు తీసుకోరుగా? సౌదీ అరేబియా దేశాన్ని స్తాపించిన ఇబిన్ సౌద్ 17 సార్లు, ముస్త్ఫా ఈద్ సమిద్ అనే సంగీతకారుడు 23 సార్లు పెళ్లి చేసుకున్నారు. విడాకులకి అవకాశం లేకపోతే మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టం. లేదా అంతమంది భార్యలని ఓ భర్త ఎలా పోషించగలడు?

09/24/2016 - 23:37

అతని పేరు జాన్ జేమ్స్ రేండాల్ఫ్ అడోల్ఫస్ మిల్స్. 23 జూన్ 1923న బెర్ముడాలో పుట్టిన ఇతన్ని జానీ బార్నెస్ అని పిలుస్తారు. బెర్ముడాలోని హేమిల్టన్ అనే ఊళ్లో ఈయన నివసించేవాడు. బెర్ముడా ట్రావెల్ గైడ్‌బుక్స్‌లో సందర్శించే అంశాల జాబితాలో ఈయన పేరు కూడా ఉంటుంది.

09/18/2016 - 21:33

ప్రపంచంలో అత్యంత అందమైన జంతువు ఏది?
అత్యంత ఖరీదైన జంతువు ఏది?
అత్యంత అరుదైన జంతువు ఏది?
ఈ మూడు ప్రశ్నలకు జవాబు ఒకటే. పాండా.

09/10/2016 - 22:01

అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. అప్పటికే జర్మన్స్ పోలెండ్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. పోలెండ్ ప్రజలని లేబర్ కేంప్‌కి తరలించి, పని చేయించేవారు. అలా పనిచేసే వేల మంది పోలిష్ ప్రజల్లో ఒకతనికి రోజ్‌వాడో గ్రామంలోని తన కుటుంబాన్ని చూసి రావడానికి పధ్నాలుగు రోజుల సెలవుని మంజూరు చేశారు.

09/04/2016 - 05:59

అమెరికన్ గూఢచార సంస్థ సిఐఏ (ఆనాటి ఓఎస్‌ఎస్) ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో ఓ వ్యక్తి కోసం జరిపిన వేట, మళ్లీ ఇంతదాకా ఆ స్థాయిలో జరిగింది ఒక్క బిన్‌లాడెన్ విషయంలోనే.

08/28/2016 - 00:17

స్నేహమేరా జీవితం అని నమ్మే ఇద్దరు వ్యక్తుల కథ ఇది. వారిద్దరూ అమెరికన్స్. వారిలో ఒకరి పేరు జోవైట్ హెడ్. మరొకరి పేరు స్టీవ్ మారిస్.
4 ఏప్రిల్, 1976న వారిద్దరూ వెస్ట్ పామ్ బీచ్‌లోని ఎల్‌సిడ్ బార్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తన మిత్రుడికన్నా ఓ సంవత్సరం పెద్దయిన వైట్‌హెడ్ (24) జేబులోంచి పర్స్ తీసి, అందులోంచి ఓ డాలర్ నోట్‌ని తీసి దాన్ని మధ్యకి చింపి చెప్పాడు.

08/21/2016 - 05:42

నూట నలభై ఏళ్లుగా అమెరికాలో ఓ అపూర్వమైన పోస్ట్ఫాస్ పని చేస్తోంది. అది ప్రేమలేఖలు, పీజాలు ఇలా చాలా వాటిని బట్వాడా చేసింది. ఓసారి గొర్రెని కూడా బట్వాడా చేసింది. ప్రపంచంలో నీటి మీద తేలే పోస్ట్ఫాస్ ఇదొక్కటే. ఆ ప్రైవేట్ పోస్ట్ఫాస్ పేరు జె.డబ్ల్యు.వెస్ట్ కాట్ కంపెనీ.

08/13/2016 - 03:25

లండన్ జూలోని ఎలుగుబంటి ప్రభావంతోనే ఏ ఏ మిల్‌నే అనే రచయిత ‘విన్నీ ది ఫూ’ అనే పాత్రని సృష్టించి కథలు రాశాడు.
ఐతే లండన్ జూలోని విఐపి జంతువు ఏదో తెలుసా?
లండన్ ప్రజలందరూ ప్రేమించిన జంతువు ఏదో తెలుసా?

08/07/2016 - 00:36

పూర్వం మన దేశంలో పెళ్ళిళ్ల పేరయ్యలు సంబంధాలు కుదిర్చేవారు. ఇప్పుడు అది మేరేజ్ బ్యూరో వ్యాపారంగా మారింది. వధూవరుల కోసం ఓ సంత జరగడం వింతే. చైనాలోని షాంఘైలో పీపుల్స్ స్క్వేర్ అనే చోట ఈ సంత ప్రతీ శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నించి సాయంత్రం ఐదు దాకా జరుగుతోంది. పెళ్లి కాని పిల్లలు గల తల్లిదండ్రులు ఈ సంతలో పాల్గొంటూంటారు. వీరి లక్ష్యం తమ పిల్లలకి తగిన వధువు/ వరుడిని కనుగొనడమే.

07/30/2016 - 23:41

సాధారణంగా దేశ సరిహద్దుల మధ్య ఊరు ఉండదు. బయలు ప్రదేశమే ఉంటుంది. లేదా కొండలు, నదులు, సముద్రాలు లాంటివి సరిహద్దులుగా ఉంటాయి. కాని అమెరికా, కెనడా దేశాల మధ్య సరిహద్దు రేఖ ఓ చోట డెర్బీ లైన్ అనే ఊళ్లోని ఓ లైబ్రరీ భవంతిలో ఉండటం ఆశ్చర్యం. సరిహద్దు రేఖ విభజిస్తూండటంతో ఈ ఊరి ప్రజల్లో కొందరు కెనడా దేశ పౌరులు. మరి కొందరు అమెరికన్ పౌరులు అవుతారు. గత రెండు వందల ఏళ్లుగా డెర్బీ లైన్‌లో ఈ విభజన కొనసాగుతోంది.

Pages