S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

07/05/2017 - 00:03

‘‘చాలామంది గతంలో జాక్వెలిన్ ఐటమ్‌సాంగ్స్ చేసింది.. మళ్లీ చేస్తుందేమో అని అంటుంటారు. కానీ నేను గతంలో చేసినవి ఐటమ్‌సాంగ్స్ కాదు, స్పెషల్ సాంగ్స్ మాత్రమే. అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మరీ మంచిది’’ అంటోంది అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తనకు చేయాలి అనిపిస్తే చాలు.. అది ఎలాంటి పాత్ర అయినా ఫర్వాలేదు. ఇట్టే ఒప్పేసుకుంటుందిట. గతంలో రెండు సినిమాల్లో ఇలా చేసింది. వాటికి మంచి పేరు వచ్చింది.

07/05/2017 - 00:01

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి రూమర్స్‌నే ఎదుర్కొంటుంది. అందాల భామలకు ఇలాంటి రూమర్స్ కథానాయికలకు మామూలే అయినా కత్రీనాకు మాత్రం మరీ ఎక్కువై పోయాయి. బాలీవుడ్‌లో ఎదుగుతున్న కథానాయికలకు, క్రేజీ భామలకు ఇలాంటివి తలనొప్పిగా తయారై వారి కెరీర్‌నే సందిగ్ధంలో పడేస్తున్నాయి. ఈ విషయం గురించి ఇటీవల కత్రీనాను మీడియా గుచ్చి గుచ్చి అడిగితే- ‘‘రూమర్స్ గోల నాకేల?

07/05/2017 - 00:00

బాలీవుడ్‌లోనే కాదు, హాలీవుడ్‌లోనూ ఇప్పుడు దీపికా పదుకొనే హవా కొనసాగుతూనే వుంది. నటిస్తున్న చిత్రాలతోపాటు చేస్తున్న పాత్రలు కూడా భిన్నంగానే వుంటున్నాయి. అంతేకాదు, హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టీన్ ఛాయిస్ పురస్కారం కోసం నామినేషన్ కూడా దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. ప్రముఖ హాలీవుడ్ నటిమణి గల్ గడొట్‌తో ఈ పురస్కారం కోసం పోటీ పడబోతోంది.

07/04/2017 - 23:59

నవతరం బ్యూటీ రాశీఖన్నా టాలీవుడ్‌లో యమ దూకుడును ప్రదర్శిస్తోంది. వెండితెరపై అడుగుపెట్టిన నాటినుంచి నేటి వరకు వరుస అవకాశాలతో కెరీర్‌లో పరుగులు పెడుతూనే వుంది. చేసిన ప్రతీ చిత్రంలో తన పాత్ర ద్వారా రెచ్చిపోతూ అదిరే రేంజ్‌లో నటనను ప్రదర్శిస్తోంది. తాజాగా ఎన్‌టిఆర్ ‘జై లవకుశ’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ చిత్రాలతో పాటు ఇటీవల వరుణ్ తేజ్‌తోనూ జోడీ కట్టింది.

06/24/2017 - 21:02

నిక్కీ గల్రాని.. గత మూడేళ్ల కాలంలో దక్షిణాది భాషల్లో దాదాపు పాతిక చిత్రాలకు పైనే నటించింది. ‘డార్లింగ్’ అనే తొలి తమిళ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తాజాగా ఆదిపినిశెట్టి హీరోగా కెఆర్‌కె శరవణన్ దర్శకత్వంలో ‘మరకతమణి’లో నటించింది. ఇది విభిన్నమైన పాత్రే ఆమెకు. తమిళంలో చేసిన ‘డార్లింగ్’ చిత్రం ద్వారా అక్కడ ఇప్పుడందరూ ఆమెను డార్లింగ్ అనే పిలుస్తున్నారట.

06/24/2017 - 21:00

అందాల భామ శ్రుతిహాసన్ టార్గెట్ ఇక బాలీవుడ్డేనట. దక్షిణాదితోపాటు హిందీలోనూ రాణిస్తున్న ఈ అమ్మడు తన దృష్టి అంతా ఇక నుంచి హిందీ చిత్రాలపై పెట్టాలనుకుంటోందిట. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న ఈ బ్యూటీ చాలా కాలంగా హిందీ చిత్రాల్లో రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చిందట. ఈ విషయం గురించి శ్రుతిని కదిలిస్తే- ‘‘ నటి అన్నాక అన్ని భాషల్లో చేయాలి.

06/24/2017 - 20:58

బాలీవుడ్‌లో కథానాయికగా అనుష్కశర్మ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటూనే మరో అవతారం కూడా ఎత్తింది. అదే నిర్మాతగా. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తూ విజయం వైపే దూసుకెళుతోంది. నటనతో పాటు, నిర్మాతగా కూడా తన సత్తా చాటుకుంటుండడంతో ఇప్పుడు అందరి దృష్టి అనుష్కపైనే పడింది. నిర్మాతగా అడుగుపెడుతూనే ‘ఎన్ హెచ్ ఓ’తో తొలి విజయాన్ని అందుకుంది. అటు తర్వాత ‘్ఫలౌరి’లో ఆత్మగా నటించి అందర్నీ మెప్పించింది.

06/24/2017 - 20:56

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే మంచి పాపులారిటీ, అంతకంటే మంచి అవకాశాలు సొంతం చేసుకున్న అదృష్ణవంతురాలు అందాల భామ రాశీఖన్నా. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్‌టిఆర్, రవితేజ చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వుంది. మరికొన్ని చిత్రాలు అంగీకరించినవి వున్నాయి. గ్లామర్ లుక్స్‌తో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకుంటున్న ఈ భామ ముఖ్యంగా యువతరం ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్‌ని సంపాదించుకుంది.

06/17/2017 - 22:12

బాలీవుడ్‌లో ‘రంగీలా’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన భామ ఊర్మిళా మతోండ్కర్ రీ ఎంట్రీకి సిద్ధమయిందట! అవును.. నిజంగా నిజం. 43ఏళ్ల వయస్సులో అదీ..ఐటమ్‌సాంగ్‌తోనట! ‘రంగీలా’ ఊర్మిళకు స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టడమే కాదు, కెరీర్‌ని కాపాడింది. అదే ఊపుతో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆ చిత్రంతో ఆమె బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా ప్రాచుర్యం పొందింది.

06/17/2017 - 22:11

బాలీవుడ్‌లో ‘క్వీన్’ చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. ఇంతటి ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని చాలా రోజులుగా సౌత్‌లో రీమేక్ చేసేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ ‘క్వీన్’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.

Pages