S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

07/22/2017 - 21:07

టాలీవుడ్‌లో రామ్‌చరణ్ చిత్రం ‘చిరుత’లో తళక్కున మెరిసిన అమ్మడు నేహాశర్మ గుర్తుందిగా. అవునులే.. అప్పుడే ఎలా మరిచిపోతాం. ఆ చిత్రంలో ఈ అమ్మడి హొయలు.. చిందించిన గ్లామర్‌ని యువతరం ఎలా మరిచిపోతుంది? తెలుగులో తొలి చిత్రమే అత్యంత ప్రతిష్టాత్మకం.. కానీ, ఏం లాభం? తొలి చిత్రం తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అంతే టాలీవుడ్‌లో రెండో సినిమా చేశాక, తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

07/22/2017 - 21:03

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బాగా మారిపోయిందని ఆమె సన్నిహితులే కాదు, తోటి నటిమణులు అక్కసు వెల్లగక్కుకుంటున్నారట. ఇంతకీ ఈ అమ్మడిలో మార్పేమిటో అని ఆరా తీస్తున్నవారెవరికీ అంతు చిక్కకుండా వుంటోందిట. అగ్ర హీరోలందరితో హిందీ చిత్రాల్లో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ టార్గెట్ ఇక హాలీవుడ్డేనట!

07/15/2017 - 21:25

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్‌కు గ్లామరే రక్షలా వుంది. అందుకే తన అంద చందాలతో గ్లామర్ పాత్రలవైపే దృష్టి సారిస్తోంది. వైవిధ్యమైన పాత్రల వైపు కనె్నత్తి కూడా చూడటం లేదు. దర్శక, నిర్మాతలు కూడా రకుల్‌ని గ్లామర్ పాత్రల్లో చూపించడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి పాత్రలు కెరీర్‌ని కాపాడలేవు అన్న విషయం రకుల్‌కు తెలియదా? అని అంటున్నారు ఆమె సన్నిహితులు.

07/15/2017 - 21:24

‘బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను తమ చిత్రాల్లో తీసుకోవాలంటే నిర్మాతలు జడుసుకుంటున్నారట. అందుకు కారణం లేకపోలేదు. తను ఏదైనా చిత్రంలో నటించాలంటే భారీ పారితోషికం ఇచ్చుకోవలసిందేనంటూ దర్శక, నిర్మాతలకు షరతులు కూడా పెడుతోందట. ఆ పారితోషికం అంతా ఇంతా కాదు.. 12 కోట్లపై మాటేనట! మరీ అంత డిమాండా? అని నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారట. దీపికా ఇంత హఠాత్తుగా రెమ్యూనరేషన్‌ని పెంచడానికి కారణం ఏమైవుంటుదనేగా మీ డౌటు!

07/15/2017 - 21:21

కొంత విరామం తర్వాత మళ్లీ నటి అమలాపాల్ కెరీర్ గాడిలో పడ్డట్టేనంటున్నారు చిత్రసీమకు చెందిన ఆమె సన్నిహితులు. పెళ్లికి ముందు.. ఆ తర్వాత ఆమె కెరీర్‌ని విశే్లషించుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. పెళ్లికి ముందు తక్కువ చిత్రాలే చేసినా అవి ఆమె కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ సమయంలో కెరీర్ కూడా మంచి ఊపులో సాగింది. ప్రతి హీరోయిన్‌లోనూ ఏదో ఒక స్పెషాలిటీ వుంటుంది. అలా అమలాపాల్‌లోనూ వుంది.

07/15/2017 - 21:19

తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ తాప్సీ గ్లామర్ హీరోయిన్‌గా క్రేజ్‌ని సంపాదించుకుంది. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు లభించిన అవకాశాలను ఎంపిక చేసుకోవడంలో ఆచి తూచి అడుగులు వేసింది. గ్లామర్ వుండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

07/08/2017 - 22:16

తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన ఆడిపాడిన అందాల భామ కాజల్ అగర్వాల్‌కు అత్యాశలేమీ లేవట! కాకపోతే కొన్ని చేయాలనుకుంటున్న డ్రీమ్‌రోల్స్ మాత్రం ఇంకా మిగిలే వున్నాయట. ప్రతీ ఒక్కరి జీవితంలో జయాపజయాలు సహజం. కానీ, వాటిని నిలదొక్కుకుని నిల్చున్నవారే కెరీర్‌లో పైకి వస్తారన్నది నిజం. చిత్రసీమకు అయితే ఇది సరిగ్గా సరిపోతుంది.

07/08/2017 - 22:15

ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో వెండితెరపై వెలిగిపోవాలని కలలుగన్న అందాలతార శ్రద్ధాదాస్ మళ్లీ కెరీర్‌పై శ్రద్ధపెడుతోంది. గతంలో ఈ అమ్మడు చేసిన చిత్రాల్లో చెప్పుకోతగ్గ పాత్రలేవీ తనకు లభించలేదు. వచ్చిన వాటిలో అందరూ మెచ్చేనటననే ప్రదర్శించినప్పటికీ టాలీవుడ్ అనుకున్న రేంజ్‌లో అవకాశాలను కలిపించలేకపోయింది. అయినా కెరీర్‌పై శ్రద్ధ తగ్గలేదు. పైగా ఎప్పటికైనా అనుకున్నది సాధించాలనుకుంది.

07/08/2017 - 22:13

...అంటున్నారంతా టాలీవుడ్‌లో కీర్తి సురేష్ చేస్తున్న చిత్రాలు.. పోషిస్తున్న పాత్రల గురించి. పరిశ్రమలోకి వచ్చిరావడంతోనే తన ఖాతాలో మంచి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. పాత్రలో విలీనమై హావ భావాలను వ్యక్తం చేయడంలో తనకు తానేసాటి అనిపించుకునేలా చేసింది. రెండు సినిమాలతోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకోవడం మాటలు కాదు, చేతలు కావాలి.

07/08/2017 - 22:11

ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవ్వరినోట విన్నా యువతరం క్రేజీ తార హెబ్బాపటేల్ గురించే. అందం, అభినయంతో పాటు చలాకీతనం మెండుగావున్న ఈ బ్యూటీ తెలుగు చిత్రసీమలోకి వచ్చిన కేవలం మూడేళ్ల కాలంలోనే ఎనిమిది చిత్రాల్లో నటించి తన నటనతో అందర్నీ విశేషంగా అలరించింది. ఆయా చిత్రాల్లో పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ని సంపాదించుకుంది.

Pages