S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

08/18/2018 - 23:45

‘తేజ్.. ఐ లవ్‌యూ’ చిత్రానికి వెనె్నల బాగోలేదన్న సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఆ చిత్రం విడుదలైన మర్నాటినుంచి దాన్ని పొగడుతూ నిర్మాత, దర్శకుడు బాకాలూదారు. తేజ్ స్టయల్‌గా ఉన్నాడు, ఎనర్జీ కనిపించలేదని సమీక్ష చెబితే.. దర్శకుడు ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో రన్ అవుతోంది. తేజ్ ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పుడే పెయింటింగ్ చేసిన బొమ్మలాగ హీరోయిన్ ఆకర్షించింది అంటూ డప్పుకొట్టాడు.

08/11/2018 - 21:52

మాఫియా చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడు- ఆర్జీవీ. ‘శివ’ తర్వాత నాగార్జున, ఆర్జీవీ కలయికలో వచ్చిన ‘ఆఫీసర్’లో సవాలక్షసార్లు చూసేసిన అదే తరహా చిత్రీకరణ, అవే మాఫియాలు, అదే సౌండ్ ఎఫెక్ట్ అవే కెమేరా యాంగిల్స్. అస్సలు కొత్తదనం లేదు. కథ లైన్ కాస్త కొత్తగా అనిపించినా కథాకథనాల్లో పెప్ లేదు. దాంతో ఆఫీసర్ చతికిలపడ్డాడు.

08/04/2018 - 19:50

కొన్ని చానల్స్, కంపెనీలూ నటుల్ని, వారి సినిమాలనూ పొగిడితే తమకు ప్రయోజనం కలుగుతుందని భావించి పొగిడేస్తూ ఉంటారు. అలాగే నానీని ఉబ్బేయడానికి ఆయన చిత్రం ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సూపర్ హిట్ అని భజన చేసిందొక చానల్ అయితే నానీ ఆ చానల్ వలలోపడలేదు. అంతలేదు బాబాయ్! ఆ సినిమా ఆడలేదు. కాని మనసుపెట్టి కష్టపడి చేశాం. ఫలితం దక్కలేదు’అని నిజాయితీగా చెప్పుకున్నాడు. అంతటి సౌజన్యం ఎందరిలో ఉంది? గ్రేట్ నానీ..

08/04/2018 - 19:48

ఆంధ్రభూమి వెనె్నల సమీక్షలో ‘విజేతకాదు పరాజితుడు’ అంటూ హీరో నటన ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. అయితే అల్లుడ్ని పొగడాల్సిన అవసరం ఉన్న చిరంజీవి ‘ఇది ఎడ్యుకేటివ్ ఫిలిం. కళ్యాణ్‌దేవ్ ఎక్కడా బెదురులేకుండా పరిణితితో సెటిల్డ్‌గా నటించాడు’అని దండోరావేస్తే అల్లు అర్జున్ కూడా తనవంతు పొగడ్తలు గుప్పించాడు. ఆయనకు విజేత బాగా నచ్చిందట.

07/28/2018 - 19:03

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ని వివాదాస్పద వ్యక్తి అని చెబుతుంటారు. అది తప్పు. ఎవరేమనుకున్నా నేను నిజమే చెప్తాను. దాన్ని మీడియా వివాదాస్పదం చేస్తుంది అంటుందామె. మీరు మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారట అని సూటిగా అడిగిన విలేఖరికి సూటిగానే చెప్పింది. నేను పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నాకు గైడెన్స్ లేకపోయింది. సినిమా ఛాన్సులకోసం స్టూడియోల చుట్టూ తిరిగేటప్పుడు కొన్నిసార్లు మద్యం, డ్రగ్స్ తీసుకున్నా.

07/21/2018 - 19:02

నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన అలనాటి మేటి నటి ‘సావిత్రి’ బయోపిక్ ‘మహానటి’ ఆద్యంతం దృవ్యకావ్యంలా అనిపించింది. బయోపిక్ చిత్రాలు తీయాలంటే ఈ చిత్రం ఓ దిక్సూచిలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. చిత్రంలో కీర్తిసురేష్ నటన చూస్తే సావిత్రే దిగివచ్చి నటించిందా? అనిపించింది. కీర్తిసురేష్‌కు ఈ చిత్రానికి తప్పకుండా జాతీయ అవార్డు వస్తుందనిపించింది.

07/14/2018 - 18:39

హాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఎమీ అవార్డ్స్ వేడుకలో ‘్భరతీయ చిత్రాల్లో ఎక్కువ భాగం మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టే తిరుగుతాయి’అని చెప్పి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయింది. వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. నిజానికి ఆమె చెప్పిన మాటలో తప్పేముంది?

07/14/2018 - 18:36

నాగ్ కెరీర్‌లోనే మాయని మచ్చ!

07/07/2018 - 23:41

మూడేళ్ల క్రితమే కథ తయారైనా ఆ కథను విన్న హీరోలకు అది నచ్చక చివరకు ఒక ఎన్నారై బకరా సినిమా తీస్తానని ముందుకు రాగా రవితేజని కలిసి అతని స్థాయికి మించి 12కోట్లు ఇస్తామనగానే కథ విన్నాడో లేదో గాని మాస్ మహారాజా వెంటనే ఒప్పుకున్నాడు. అలా ‘నేల టికెట్’ తయారైంది. ఇది నేల టికెట్ ఆడియన్స్‌నేకాక బాల్కనీ ఆడియన్స్‌కి కూడా బాగా నచ్చుతుందని రవితేజా బాకా వాయించినా ఏ ప్రేక్షకులనూ అలరించలేక పోయింది.

06/30/2018 - 21:36

మహానటి చిత్రంలో కీర్తిసురేష్ సావిత్రి పాత్రను నిజంగా మనం సావిత్రిగా ఫీలవుతాము. దర్శకుడు క్రిష్ పాత్రతో కె.వి.రెడ్డి సావిత్రిలో ఒక కంట కన్నీరు కురిపించాలని రెండో కన్నులో ఎలాంటి భావం ఉండవద్దని చెబితే ఒకే షాట్‌లో లీనమైన సావిత్రి జీవితంలోని రెండో కన్ను కూడ కన్నీళ్ళమయమైంది.

Pages