S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 23:54

ధన్వాడ, జూన్ 17: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలతో బీడు భూములకు సాగునీరు అందించే దశలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పని చేస్తుండగా కాంగ్రెస్, టిడిపి నేతలు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.

06/17/2016 - 23:53

మహబూబ్‌నగర్, జూన్ 17: బంగారు తెలంగాణ సాధనలో పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి కోరారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో లక్షల సంఖ్యల్లో మొక్కలు నాటి జిల్లాను హరితమయం చేయాలన్నారు.

06/17/2016 - 23:52

బాలానగర్, జూన్ 17: కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్‌ఎస్ట్‌లో చేరింది అవినీతి పరులేనని..దీని వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం జరిగేది లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్‌రావు అన్నారు. శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వి.హనుమంత్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, వీడిన వారందరు అవినీతి పరులేనని అన్నారు.

06/17/2016 - 23:52

ఆమనగల్లు, జూన్ 17: ఆమనగల్లు మండలంలోని కడ్తాల గ్రామంలో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు విక్రయించిన పాఠ్య పుస్తకాలను సీజ్ చేసినట్లు ఆమనగల్లు ఎంఇఓ కిషన్ తెలిపారు.

06/17/2016 - 23:50

సిద్దిపేట టౌన్, జూన్ 17: ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని, యాజమాన్యాలు వ్యవహరిస్తున్న వైఖరిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు.

06/17/2016 - 23:49

ములుగు, జూన్ 17: బ్యాంక్ ఉద్యోగినంటూ బ్యాంకులో డబ్బులు వేయడానికి వచ్చిన ఓ ఖాతాదారుని వద్ద డబ్బులు దోచుకెళ్లిన సంఘటన గురువారం ములుగు ఎస్‌బిఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబందించి బాదితుడు సత్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి.

06/17/2016 - 23:48

మెదక్, జూన్ 17: మెదక్ డివిజన్ అటవి ప్రాంతంలో మూడు కోట్ల మొక్కలను హరితహారం క్రింద టార్గెట్‌గా ప్రణాళికను సిద్దం చేసుకున్నామని మెదక్ డిఎఫ్‌ఓ శ్రీ్ధర్‌రావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హరితహారం క్రింద లక్ష్యంగా పెట్టుకున్న 3 కోట్ల మొక్కలలో 2 కోట్ల 68 లక్షల మొక్కలు అటవివేతర భూములకు కెటాయించినట్లు ఆయన తెలిపారు.

06/17/2016 - 23:48

సంగారెడ్డి టౌన్, జూన్ 17: భూ సేకరణ పేరుతో సర్వం కోల్పోతున్న రైతులు జీవించేది ఎలాగని, భూ నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని మాజీ ఎంపి సోలిపేట రాంచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు భూ నిర్వాసితులు చేపట్టిన నిరవధిక నిరహారదీక్షలను శుక్రవారం సోలిపేట రాంచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

06/17/2016 - 23:47

సిద్దిపేట, జూన్ 17: పాఠశాలల బస్సులను తప్పక ఫిట్‌నెస్ చేయించుకోవాలని, ఫిట్‌నెస్‌లేని బస్సులను సీజ్ చేస్తామని సిద్దిపేట ఆర్టీఓ ఏసురత్నం అన్నారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, యాజమాన్యాలతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం సేవించే డ్రైవర్లను నియమించొద్దని సూచించారు. ఫిట్‌నెస్‌లేని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌లు 3నెలలపాటు సస్పెండ్ చేస్తామన్నారు.

06/17/2016 - 23:46

సంగారెడ్డి టౌన్, జూన్ 17: చెరుకు రైతులు ఆదునీక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించే దిశగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సిడిసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెరుకు సాగుపై విజ్ఞాన యాత్రలు నిర్వహించి రైతుల్లో అవగాహాన పెంచుతామన్నారు.

Pages