S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 00:02

నల్లగొండ రూరల్, జూన్ 17: నిబంధనలు ఉల్లంగిస్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో ఆర్టీఎ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో 1467పాఠశాల బస్సులుండగా ఇప్పటివరకు 1107బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ పొందాయి. మరో 360బస్సులు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయి. జిల్లాలో 15సంవత్సరాలు దాటిన బస్సులు అధికంగా ఉన్నప్పటికి యాజమాన్యాలు యదావిధిగా నడిపిస్తున్నారు.

06/18/2016 - 00:01

నల్లగొండ, జూన్ 17: అధికార పార్టీ చూపిన ప్రలోభాలకు ఆశపడే దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ నాయక్ సిపిఐని వీడి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించాడని సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి దుయ్యబట్టారు.

06/18/2016 - 00:00

మిర్యాలగూడ, జూన్ 17: మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలి లేదంటే నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన మిర్యాలగూడ బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. బంద్ సందర్భంగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంక్‌లు మూసివేయగా మిర్యాలగూడ డిపోలో బస్సులు పాక్షికంగా నడిచాయి.

06/17/2016 - 23:59

మునుగోడు, జూన్ 17: పాలిటెక్నిక్‌లో ఫెయల్ అయినందుకు మనస్తాపానికి గురై విద్యార్ధిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని ఊకొండి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజూమున చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన పోగుల కృష్ణయ్య, యాదమ్మలకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు కలరు.

06/17/2016 - 23:57

దేవరకద్ర, జూన్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు అండగా ఉంటూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలో రైతు ధర్మయ్య (45) అప్పుల బాధతాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సహయ నిధి కింద రూ.6లక్షల రుపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

06/17/2016 - 23:57

ధన్వాడ, జూన్ 17: ధన్వాడ మండల పరిదిలోని మరికల్ గ్రామంలోని గ్రామపంచాయతీ అవరణంలో 108 కార్యాలయంను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 108వాహనంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ జెండాను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

06/17/2016 - 23:57

కల్వకుర్తి, జూన్ 17: రైతు సంక్షేమంతోనే బంగారు తెలంగాణ సాద్యమని,నాబార్డు రుణాలతో మానవశైలిలో మార్పు చెందాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని సింగిల్‌విండో కార్యాలయం ఆధ్వర్యంలో చిన్న, సన్న కారు రైతులకు విత్తనాల పంపిణి కార్యాలయంతో పాటు కార్యాలయంలో ఇంకుడు గుంతను చైర్మన్ భూపాల్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ప్రారంభించారు.

06/17/2016 - 23:56

జడ్చర్ల, జూన్ 17: రైతులకు పరిపూర్ణ న్యాయం జరగాలనే ఉద్దేశంతో యూపిఎ హయాంలో పార్లమెంట్‌లో చర్చించి తీసుకొచ్చిన చట్ట ప్రకారమే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే రైతుల పక్షాన భూ పోరాటానికి సన్నద్ధం అవుతామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రానికి వెళ్తూ..

06/17/2016 - 23:55

మహబూబ్‌నగర్, జూన్ 17: ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సద్భావన యాత్ర, ఉగ్రవాద వ్యతిరేక యాత్ర సందర్భంగా రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.

06/17/2016 - 23:54

మక్తల్, జూన్ 17: తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో అప్పటి నిజాం కాలంనాడు నిర్మించిన కృష్ణానది వంతెన పనులకు కర్ణాటక ప్రభుత్వం మరమ్మతు పనులు చేపడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు వంతెన కింది భాగంలో పనులు పూర్తికావస్తున్నాయి. ప్రస్తుతం వంతెనపై అప్పట్లో సిసి రోడ్డుపై బిటి రోడ్డు వేయడంతో రోడ్డు మొత్తం పూర్తిగా గుంతల మయంతో అధ్వాన్నంగా మారింది.

Pages