S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 00:38

రాప్తాడు, జూన్ 17: రాప్తాడుకు చెందిన విద్యార్థి బాబు(19) శుక్రవారం స్థానిక రైల్వేగేటు సమీపంలో రైలు కింద పడి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఉజ్జినప్ప, నల్లమ్మ దంపతులకు ఇద్దరు సంతానం వేణు, బాబు. వేణు గొర్రెలు కాసేవాడు. బాబు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నల్లమ్మ గొర్రెల వద్దకు వెళ్ళాలని బాబుకు చెప్పడంతో ఇంట్లో గొడవపడ్డాడు.

06/18/2016 - 00:35

యాడికి, జూన్ 17 : మండల పరిధిలోని బోగాలకట్ట గ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, యశోద కుమార్తె వెంకటేశ్వరి (22) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంకటేశ్వరి విజయవాడలో ఎంబిఎ రెండో సంత్సవరం చదువుతోంది. కంటి ఆపరేషన్ నిమిత్తం తల్లిదండ్రులు మదురై వెళ్లారు. ఈనేపథ్యంలో శుక్రవారం ఫలితాలు రావడంతో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది.

06/18/2016 - 00:33

ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రదానం చేసిన ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డుల ఎంపిక, వర్గీకరణ సహేతుకంగా లేవనిపిస్తున్నది. ఉదాహరణగా చాగంటి కోటేశ్వరరావుగారు తమ ప్రతిభను దిగ్విజయం గా ప్రదర్శిస్తున్న ప్రవచన రంగాన్ని కాకుండా ‘అవధానం’ విభాగంలో ప్రకటించి, ప్రదానం చేయడాన్ని తీసుకో వచ్చు.
- జయ కాకినాడ

06/18/2016 - 00:29

కరడుగట్టిన అనే పదాన్ని వివిధ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కాగా ఎక్కువగా కమ్యూనిస్టుల విషయంలో ఆ పదాన్ని వాడుతుంటారు. ఫలానా నాయకుడు కరడుగట్టిన కమ్యూనిస్టు అనడం వింటున్నాం. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు మారాయి. వివిధ రాజకీయ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు లేదా ముఖ్యమైన నాయకులు మరో పార్టీలోకి ఫిరాయిస్తే ప్రజలు పెద్దగా సీరియస్‌గా పట్టించుకోవడం లేదు.

06/18/2016 - 00:28

భిక్కనూరు, జూన్ 17: ఒక చంద్రబాబు కాకుండా జగన్‌బాబు, వందమంది ఆంధ్రబాబులు అడ్డువచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లి చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఆవేశపూరితంగా ప్రసంగించారు.

06/18/2016 - 00:28

బాల్కొండ: 2007నుండి 2014వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, లక్ష్మి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్‌లు, మోటార్లను కొనుగోలు చేసి అందినకాడికి కమిషన్లను దండుకున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నిర్మిస్తున్న లక్ష్మి లిఫ్ట్ పనులను హరీశ్‌రావు సందర్శించిన అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడారు.

06/18/2016 - 00:27

భిక్కనూరు, జూన్ 17: కరువుతో అల్లాడుతున్న కామారెడ్డి నియోజక వర్గంలో 10సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న నీవు ఒక్క చెరువును నిర్మించావా, ఒక్క చెరువు పునరుద్దరణకు స్వీకారం చుట్టావా అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు చురకలు అంటించారు.

06/18/2016 - 00:26

మోర్తాడ్, జూన్ 17: తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రతి సెంటు భూమికి నీరందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు భూమికి కూడా నీరందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.

06/18/2016 - 00:25

కామారెడ్డి, జూన్ 17: రైతుల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మాత్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు.

06/18/2016 - 00:25

‘‘్ధనమూలం ఇదమ్ జగత్’’ అని మన పెద్దలు ఎందుకు చెప్పారో కాని, ప్రస్తుతం మన దేశంలో వైద్యానికి సంబంధించి మాత్రం ఈ నానుడి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. పేదరికంలో ఉన్న వారికి ఏదైనా జబ్బు వస్తే, వారికి చావు తప్పదనే భావన ప్రజలలో నెలకొని ఉంది. ఇందుకు కారణం పాలక పక్షాలు ఒక పథకం ప్రకారం, ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేయడమే.

Pages