S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 00:25

మోర్తాడ్, జూన్ 17: ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు వరప్రదాయినిగా మారనున్న ఎత్తిపోతల పథకాలను అడ్డుకునే పార్టీలను, నాయకులను గ్రామాల్లోకి రానివ్వమని మోర్తాడ్‌లోని వ్యవసాయదారుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం సంఘ భవనంలో సమాశమైన భీమ్‌గల్ పాత తాలుకా స్థాయి మండలాల రైతు ప్రతినిధులు నాయకుల పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/18/2016 - 00:20

పెద్దపల్లి, జూన్ 17: నాణ్యమైన విద్యకు చర్యలు చేపట్టతున్నట్లు ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డిలు తెలిపారు శుక్రవారం స్థానిక ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల నుండి నష్ట పోతున్న విద్యావ్యవస్థను కాపాడుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాలన చేస్తున్నామని పేర్కొన్నారు.

06/18/2016 - 00:19

మానకొండూర్, జూన్ 17: రాష్ట్రంలోనే కరీంనగర్ గుండెకాయాలాంటిది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపి వినోద్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ హాజరయ్యారు.

06/18/2016 - 00:19

నసీరొద్దీన్ కొడుకుతో కలిసి గాడిదను తోలుకుంటూ సంతకు పోతుంటాడు. ఎదురుపడిన కొందరు, గాడిదను నడిపించుకుంటూ మీరు నడుచుకుంటూ పోవడమేంటని ఆశ్చర్యపడతారు. దీంతో కొడుకును గాడిదపై ఎక్కించి తాను నడుస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన మరికొందరు, తండ్రి నడుస్తూ, కొడుకును గాడిదపై కూర్చుండబెట్టడమేంటని అంటూ వాపోతారు.

06/18/2016 - 00:19

కరీంనగర్, జూన్ 17: వరుసగా మూడేళ్లు కరువుతో అతలాకుతలమైన అన్నదాత ఈ సారైనా వర్షాలు కరుస్తాయనే ఆశతో ఖరీఫ్‌కు సిద్ధం కాగా, రుతు పవనాల రాకలో ఆలస్యం జరుగుతుండటంతో రైతులను చినుకు చింత వెంటాడుతోంది. వారం కిందట కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్నుకొని సిద్దంగా ఉన్న రైతులు తొలకరి వర్షాల కోసం ఆకాశానికేసి తదేకంగా చూస్తున్నారు.

06/18/2016 - 00:18

గోద్రా దగ్ధకాండ జరిగిన తరువాత గుజరాత్‌లో హింసాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తున్న న్యాయప్రక్రియలో ఇది మరో ఘట్టం. ఆహమ్మదాబాద్ సమీపంలోని గుల్‌బర్గ్‌లో దహనకాండ జరిపిన నేరస్థులకు శుక్రవారం అహమ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం కారాగార శిక్షను విధించడం దేశంలో పరిఢవిల్లుతున్న సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి నిదర్శనం.

06/18/2016 - 00:18

కరీంనగర్, జూన్ 17: కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధికి కార్పొరేటర్లు అందరు కలిసికట్టుగా పాటుపడాలని, అప్పుడే కరీంనగర్ స్మార్ట్ సిటిగా అవతరిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా కార్పొరేటర్లు మారాలని సూచించారు.

06/18/2016 - 00:17

కరీంనగర్, జూన్ 17: రైతుల రుణ మాఫీకి సంబంధించి మూడవ విడత 25 శాతం నిధులు బ్యాంకర్లకు వెంటనే ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లు కరవు ఉన్న మాట వాస్తవమేనని, ప్రభుత్వం రుణాల రీ షెడ్యూల్ చేయడం, అప్పులు చేస్తూ రైతులు ఎలాగోలా నెట్టుకొచ్చారన్నారు.

06/18/2016 - 00:17

వేములవాడ, జూన్ 17: దసరా నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని, అందుకు అనుగుణంగా విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా కొత్త మండలాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

06/18/2016 - 00:16

వీణవంక, జూన్ 17: మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శీలం సమ్మిరెడ్డి (48) అనే రైతు శుక్రవారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సమ్మిరెడ్డికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండేళ్లుగా పంట సరిగా పండడం లేదు. గ్రామంలోని నాలుగు లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేమనే బెంగతో కొద్ది రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు.

Pages