S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/09/2016 - 07:51

హైదరాబాద్, నవంబర్ 8: తిరుమలలో రెస్టారెంట్లు, హోటళ్ల పనితీరు, ఎక్కువ రేట్లకు తినుబండారాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విజిలెన్స్ అధికారి ఇచ్చిన నివేదికను సమర్పించాలని హైకోర్టు మంగళవారం టిటిడి దేవస్థానాన్ని ఆదేశించింది.

11/09/2016 - 07:50

హైదరాబాద్, నవంబర్ 8: విశాఖపట్నం మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గిరిజనుల హక్కుల కోసం తీసుకుంటున్న చర్యలు తెలియచేయాలని కోర్టు ఆదేశించింది. శక్తి సంస్థకు చెందిన డాక్టర్ శివరామకృష్ణ అనే పిటిషనర్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ అంశంపై గ్రామ సభలను నిర్వహించి గిరిజనుల అభిప్రాయాలను సేకరించలేదని ఆయన హైకోర్టుకు నివేదించారు.

11/09/2016 - 07:49

విశాఖపట్నం, నవంబర్ 8: వస్తుతయారీ రంగంలోనే విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని, పారిశ్రామికాభివృద్ధి ద్వారానే అది సాధ్యమని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఎస్‌ఎస్‌భండారే అభిప్రాయపడ్డారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌పై ఫోరం ఆఫ్ ఫ్రీ ఎంటర్‌ప్రైస్, గీతం గీతం యూనివర్శిటీ సంయుక్తంగా విశాఖలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

11/09/2016 - 07:49

విజయవాడ, నవంబర్ 8: పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో నూరు శాతం ఆధార్ సంఖ్యతో కూడి లబ్ధిదారులు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన మధ్యప్రదేశ్ సాంకేతిక బృందాల సభ్యులతో ఆయన స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

11/09/2016 - 07:48

కడప, నవంబర్ 8: రాష్టవ్య్రాప్తంగా 1400 ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్‌టిఆర్ వైద్యసేవలు అందిస్తున్నామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రైవేట్ వైద్యంపై మోజుతో ప్రభుత్వ వైద్యంపై అలసత్వం వహించే వైద్యులు, సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని అన్నారు.

11/09/2016 - 07:34

తిరుపతి, నవంబర్ 8: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్తున్న భక్తుల కారుపై ఘాట్‌రోడ్డులోని హరిణి మలుపు వద్ద సుమారు 20 కేజీల బరువు కలిగిన బండరాయి దొర్లి పడింది. అదృష్టవశాత్తూ ఈసంఘటనలో భక్తులకు ఎలాంటి ప్రమాదం కలుగలేదు. అయితే బండరాయి 40 అడుగుల ఎత్తునుంచి దొర్లుకుంటూ పడటంతో కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది.

11/09/2016 - 07:27

విశాఖపట్నం, నవంబర్ 8: ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఎఓబి) బెజ్జంగిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్న మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపారని కోఆర్డినేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ (సిడిఆర్‌ఓ) నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల కూటమి ప్రతినిధులు మూడు రోజుల పాటు ఎన్‌కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో పర్యటించి వాస్తవాలను సేకరించారు.

11/09/2016 - 07:27

గుంటూరు, నవంబర్ 8: మల్కన్‌గిరి ఆపరేషన్ ద్వారా ఆంధ్ర- ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఎఒబి)లో పట్టు సాధించామని డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. గుంటూరులో మోడల్ పోలీసుస్టేషన్ల నిర్మాణాలను మంగళవారం డిజిపి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో వివిఐపి, ప్రజాప్రతినిధులకు భద్రత పెంచామన్నారు.

11/09/2016 - 06:55

విజయవాడ, నవంబర్ 8: దేశంలో చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రానంతరం దేశంలో తీసుకున్న చారిత్రక నిర్ణయంగా మిగిలిపోతుందని అభివర్ణించారు.

11/09/2016 - 02:49

విజయవాడ, నవంబర్ 8: నవ్యాంధ్రలో కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఏర్పాటు కానుంది. తూర్పు తీరంలో విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోస్టల్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ వల్ల అభివృద్ధితో పాటు వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

Pages