S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/09/2016 - 02:47

విజయవాడ, నవంబర్ 8 : ఓ వైపు ముఖ్యమంత్రి పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలతో భేటీలు వేస్తున్నారు. ‘సింగిల్ విండో’ పెట్టాం... వచ్చేయండని దండోరా వేస్తున్నారు. అర్జీ పెట్టిన వెంటనే అన్ని అనుమతులు వచ్చేస్తాయని భరోసా ఇస్తున్నారు. కానీ అధికారుల్లో ఆ స్పీడ్ కనిపించకపోగా, నత్తలతో పోటీ పడుతున్నారు.

11/09/2016 - 02:46

రాజమహేంద్రవరం, నవంబర్ 8: గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (గుడా) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించి జిఓ నెంబర్ 276ను విడుదల చేసింది. గతంలో కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లను విడివిడిగా అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.

11/09/2016 - 02:46

రాజమహేంద్రవరం, నవంబర్ 8: చారిత్రక నగరం రాజమహేంద్రవరం రూపురేఖలు మరికొద్ది కాలంలో మారిపోనుంది. తూర్పు గోదావరి జిల్లాలో చెన్నై-కోల్‌కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఐదు ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది. అందులో రాజమహేంద్రవరం వద్ద నాలుగు నిర్మించనున్నారు. ఆరు లేన్ల వెడల్పున ఈ వంతెనలు జాతీయ రహదారులకు అనుసంధానంగా నిర్మించనున్నారు.

11/09/2016 - 02:45

గుంటూరు, నవంబర్ 8: రాజధాని గ్రామాల్లో భవన నిర్మాణ దరఖాస్తులను ఇకపై తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా కమిషనర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో సంబంధిత అధికారులను నియమించినట్లు సీఆర్డీయే డెవలప్‌మెంట్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జెవి రాముడు తెలిపారు.

11/09/2016 - 02:43

అమరావతి, నవంబర్ 8: పేరుకేమో విద్యుత్ సరఫరాలో నెంబర్ వన్. మనది మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం. ఆ మేరకు చేసుకునే ప్రచారానికి కొదవలేదు. వాల్‌పోస్టర్లు, టీవీ ప్రచారాలకు తక్కువ లేదు. ప్రచారానికి పెట్టింది పేరైన ఈ శాఖ సచివాలయయానికి మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఉన్నతాధికారులు కొలువుదీరే సచివాలయంలో మాత్రం నిరంతర కోతలే.

11/09/2016 - 02:42

విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు కేంద్ర బృందం ఎపిలో పర్యటించనుంది. 11, 12 తేదీల్లో గుంటూరు జిల్లా, 13న విశాఖపట్నంలో బృందం పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు రూ.1065.08 కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.

11/09/2016 - 02:41

విశాఖపట్నం, నవంబర్ 8: కోల్‌కతా పోర్టు పూడికతీత పనులను విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) దక్కించుకుంది. చానల్స్ నిర్వహణ నిమిత్తం రూ.1119 కోట్ల విలువైన పనులను గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా డిసిఐ దక్కించుకోవడం విశేషం. గత మూడు దశాబ్ధాలుగా ఈ పనులను డిసిఐ నామినేషన్ విధానంలో చేపడుతోంది.

11/09/2016 - 02:41

టంగుటూరు, నవంబర్ 8: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజిలో మంగళవారం బిటెక్ మొదటిసంవత్సరం సివిల్ విద్యను చదువుతున్న కల్లూరి నాగలక్ష్మి(19) తన చున్నితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొదిలి మండలం తలమళ్ళ గ్రామానికి చెందిన కల్లూరి నాగలక్ష్మి (19) పేస్ ఇంజనీరింగ్ కాలేజిలో సివిల్ విభాగంలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.

11/09/2016 - 02:40

భీమునిపట్నం, నవంబర్ 8: అదాయానికి మించి ఆస్తులు సంపాదించి హైదరాబాద్‌లో సోమవారం ఎసిబికి చిక్కిన భీమిలి సబ్ రిజిస్ట్రార్ బిల్ల సంజీవయ్యను ఎసిబి అదికారులు ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం అరెస్ట్ చేశారు. ఎసిబి డిఎస్పీ, సిఐ (సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ టీం) దర్యాప్తు అధికారి ఎస్‌విఎస్ ప్రసాదరావువిలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని నిర్ధారించారు.

11/09/2016 - 02:39

గుంటూరు, నవంబర్ 8: రాజధాని ప్రాంతానికి తొలి ఐపిఎస్ అధికారి నియమితులయ్యారు. తుళ్లూరు పోలీసుస్టేషన్ స్థాయిని పెంచి ఇటీవలే సబ్ డివిజన్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఏఎస్‌పిగా కర్నాటక రాష్ట్రం ధార్వాడ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్‌ను నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. పాటిల్ 2012 బ్యాచ్‌కు చెందిన ఏపి క్యాడర్ ఐపిఎస్.

Pages