S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/04/2016 - 03:51

హైదరాబాద్, అక్టోబర్ 3: మిత్రపక్షాలైన తెదేపా-్భజపా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నేతల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. తమ అగ్రనేతలు కొందరు తెదేపాకు అమ్ముడుపోయి పార్టీని పణంగా పెడుతున్నారంటూ ఇప్పటివరకూ అంతర్గత వేదికపై ఆరోపణలు గుప్పించిన నేతలు, ఇప్పుడు రోడ్డెక్కారు.

10/04/2016 - 03:49

హైదరాబాద్, అక్టోబర్ 3: ప్రజా ఉద్యమకారులు, ఆందోళనకారులపై పిడియాక్ట్ బనాయించి అణచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడాన్ని కాపు రిజర్వేషన్ల పోరాటసమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఆక్షేపించారు.

10/04/2016 - 03:48

హైదరాబాద్, అక్టోబర్ 3: అరకొర వసతుల మధ్య అంత అర్జంటుగా అమరావతికి పరుగులు తీయాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. సచివాలయాన్ని అమరావతికి తరలించడానికి తాము వ్యతిరేకం కాదనీ, అయితే పూర్తి వసతులు లేకుండా తరలించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

10/04/2016 - 03:48

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా కావాలని నాడు రాజ్యసభలో డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రావడం లేదా? అని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ప్రశ్నించారు.

10/04/2016 - 03:47

హైదరాబాద్, అక్టోబర్ 3: పాక్ పప్పులు ఇక ఉడకవని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హెచ్చరించారు. ఉరీపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో మన దేశ సైన్యం సరైన గుణపాఠం చెప్పిందని చెప్పారు. 1926 నుంచి కార్మికుల కోసం ఉన్న 44 చట్టాలను సరళీకృతం చేసి 4 సంపుటాలుగా చేయబోతున్నామని అన్నారు. దీంతో యాజమాన్యాలకు, కార్మికులకూ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

10/04/2016 - 03:46

హైదరాబాద్, అక్టోబర్ 3: రోడ్డు ప్రమాదంలో శాశ్వతంగా వికలాంగుడైన ఒక ఉద్యోగి కుమార్తెకు సరైన ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సోమవారం నాడు ఆదేశించింది.

10/03/2016 - 08:32

గుంటూరు, సెప్టెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ కొత్త సచివాలయంలో సోమవారం నుంచి విధులు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 7 నెలల 26 రోజుల్లో ఐదు బ్లాకుల నిర్మాణం పూర్తయింది. ఇందులో సిఎం, సిఎస్‌ల కోసం నిర్దేశించిన ఒకటో బ్లాక్‌లో అంతర్గతంగా డిజైన్లలో మార్పులు జరిగాయి. దీంతో సిఎం కార్యాలయానికి మరికొంత వ్యవధి పడుతుందని అధికారులు చెప్తున్నారు.

10/03/2016 - 08:31

హైదరాబాద్, అక్టోబర్ 2: దేశ భద్రత ఎంత ముఖ్యమో, ఆహార భద్రత కూడా అంతే ముఖ్యమని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరా భవన్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో రఘువీరారెడ్డి ప్రసంగిస్తూ స్ఫూర్తి ప్రదాత, మహనీయుడు మహాత్మా గాంధీ అని చెప్పారు.

10/03/2016 - 08:31

రాజమహేంద్రవరం, అక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1101 కోట్లతో షెడ్యూల్డు కులాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, అదనంగా మరో రూ.220 కోట్లు ఎస్సీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

10/03/2016 - 08:30

హైదరాబాద్, అక్టోబర్ 2: ఏపి మంత్రుల సత్తాకు స్థానిక సంస్థల ఎన్నికలు సవాలుగా పరిణమించాయి. ఫలితాలపై మీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వారికి కత్తిమీద సాములా పరిణమించాయి.

Pages