S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/03/2016 - 08:29

హైదరాబాద్, అక్టోబర్ 2: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ జెన్కో సాధిస్తున్న అభివృద్ధి, అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.

10/03/2016 - 08:09

తిరుమల, అక్టోబర్ 2: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడిని మాడవీధుల ప్రదక్షిణగా నైరుతి దిశలోని వసంతం మండపం వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో భూమిపూజ నిర్వహించి, పాలికలలో పుట్టమన్ను సేకరించారు. అనంతరం ఊరేగింపుగా సేనాధిపతి ఆలయానికి చేరుకున్నారు.

10/03/2016 - 08:07

ఆదోని, అక్టోబర్ 2: ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి మన సైన్యం జరిపిన లక్షిత (సర్జికల్) దాడులులాంటివి ఎంతో అవసరమని హిందూ ధర్మ పరిరక్షక సమితి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఐటి సలహాదారు త్రిపురనేని హనుమాన్ చౌదరి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇతర దేశాల మద్దతు తీసుకుని పాక్‌ను ఏకాకి చేసి సర్జికల్ దాడులతో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడంతో ఆ దేశం కిక్కురుమనకుండా నోరుమూసుకుని కూర్చుందని పేర్కొన్నారు.

10/03/2016 - 07:52

తిరుపతి, అక్టోబర్ 2: ‘ఆ కలియుగ వేంకటేశ్వరుడు నాకు ఎంతకాలం శక్తి, యుక్తి, పరపతి, హోదా ఇస్తాడో వాటన్నింటినీ పేదల సంక్షేమానికే వినియోగించి పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే చేయడమే తన జీవిత లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియంలో అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

10/03/2016 - 07:26

హైదరాబాద్, అక్టోబర్ 2: అంతా ఎదురుచూస్తున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహుర్తం మారుతోందా? ముందుగా ఆశించినట్లు దసరాకు జరగదా? ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహచర నేతలతో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు యథావిధిగా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో మున్సిపల్ ఎన్నికలు చర్చకు వచ్చాయి.

10/03/2016 - 07:24

తిరుపతి, అక్టోబర్ 2: రాష్టమ్రంతా 2018 సంవత్సరం నాటికి పరిశుభ్రంగా ఉండేలా తమ ప్రభుత్వం రాజీలేని విధానాలను అమలుచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

10/03/2016 - 03:01

విజయవాడ, అక్టోబర్ 2: దసరా శరన్నవరాత్ర మహోత్సవాల్లో రెండోరోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ ఆదివారం శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తకోటికి దర్శనమిచ్చింది. ఆదివారం సెలవుదినం కావటంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. తెల్లవారుఝాము మూడు గంటల నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్గింది.

10/03/2016 - 03:00

శ్రీశైలం, అక్టోబర్ 2 : శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శివపార్వతులు మయూర వాహనంపై కొలువుదీరి శ్రీశైల మాడవీధుల్లో ఊరేగారు.

10/03/2016 - 02:58

కడప, అక్టోబర్ 2 : రాయలసీమను కరవు రహిత సీమగా మార్చి సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలం జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్‌కు చేరిన కృష్ణా జలాలను ఆదివారం జిఎన్‌ఎస్‌ఎస్ వరద కాలువ ద్వారా జిల్లాకు విడుదల చేశారు.

10/03/2016 - 02:57

ముత్తుకూరు, అక్టోబర్ 2: వచ్చే ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి దేశ కీర్తిప్రతిష్ఠలను ఉన్నతస్థాయికి తీసుకెళతానని రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ రజత పతక విజేత పివి సింధు అన్నారు. ఆదివారం సింధు కోచ్ గోపీచంద్‌తో కలిసి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. అనంతరం సెక్యురిటీ నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Pages