S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/03/2016 - 02:55

విజయవాడ (ఇంద్రకీలాద్రి) అక్టోబర్ 2: గాలి కోసం ఆరబెట్టిన అమ్మవారి ప్రసాదం లడ్డూలపై పురుగులు వాలడటంతో సుమారు 50 వేల లడ్డూలను ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. లడ్డూల తయారీ కేంద్రంలో ముందుగా తయారైన సుమారు 90 వేల లడ్డూలను ప్యాక్ చేసేందుకు ఆలయ సిబ్బంది అరబెట్టారు. కొన్ని లడ్డూలపై పురుగులు పడి ఉండటం గమనించి ఒక ఛానల్ ప్రతినిధి ఇవో కార్యాలయ సిబ్బందికి దృష్టికి తీసుకువెళ్ళారు.

10/03/2016 - 02:53

తిరుపతి, అక్టోబర్ 2: భద్రతాధికారులు, రూట్ మ్యాప్‌లో సమన్వయ లోపంతో రేణిగుంట విమానాశ్రయం నుంచి మహతి ఆడిటోరియంకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ దారి తప్పిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లే కాన్వాయ్‌కు ముందుగా అధికారులు ఒక రూట్‌మ్యాప్‌ను తయారుచేసి వాహనాలకు ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించారు.

10/03/2016 - 02:52

అరకులోయ, అక్టోబర్ 2: విశాఖ మన్యంలోని అరకులోయ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాణాంతక వ్యాధులు నమోదు కావడంతో గిరిజనుల్లో భయాందోళన మొదలైంది. కిల్లోగుడ, గనె్నల, మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోకి వచ్చే గిరిజనులు డెంగ్యూ వ్యాధి బారిన పడినట్టు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు నిర్ధారించారు.

10/03/2016 - 02:51

కడప, అక్టోబర్ 2 : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ (పట్ట్భద్రులు, ఉపాధ్యాయ) ఎన్నికలకు ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో సీమ జిల్లాల్లో సందడి మొదలైంది. ఆయా ఎమ్మెల్సీ స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులు ఓటర్లుగా నమోదు చేయిస్తూ వారిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు.

10/03/2016 - 02:50

పాలకొండ (టౌన్), అక్టోబర్ 2: అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని బిజెపి, టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారని, నిజానికి బిజెపి సహకారంతోనే అది జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సిఎల్ నాయుడు కళాశాలలో ఆదివారం ఆయన కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

10/03/2016 - 02:50

విశాఖపట్నం, అక్టోబర్ 2: విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు.

10/03/2016 - 02:49

తిరుపతి, అక్టోబర్ 2: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం రిలయన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జియో వైఫై సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం రిలయన్స్ సంస్థ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్వీయూ విసి ఆవుల దామోదరంతోపాటు తన స్నేహితులు 20 మందితో ముచ్చటించారు.

10/03/2016 - 02:49

విజయవాడ, అక్టోబర్ 2: రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్న ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలు మిన్న.. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, అనేక సంస్థలు ఒకదాని వెంట మరొకటిగా రాబోతున్నాయంటూ కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటనలపై ప్రకటనలు చేస్తూ సత్కారాలు పొందుతున్నారు.

10/02/2016 - 04:06

విజయవాడ: దసరా వేడుకలు శనివారం విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయ. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తున్న పూజారులు

10/02/2016 - 03:28

హైదరాబాద్, అక్టోబర్ 1: రాష్ట్రంలో దశలవారీగా 13500 గ్రామాల్లో 25 లక్షల ఎల్‌ఇడి వీధీ దీపాలను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు, రాష్ట్రం విద్యుత్ ఆదా చేసేందుకు ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ విద్యుత్ ద్వారా విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా చేశామన్నారు.

Pages