S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/02/2016 - 03:27

హైదరాబాద్, అక్టోబర్ 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ (పిఎసి) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో మండిపడ్డారు.

10/02/2016 - 03:26

అనంతగిరి, అక్టోబర్ 1: కిరండోల్- కొత్తవలస రైల్వే మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు లింక్ ఊడిపోవడంతో ఇంజిన్ నుంచి వ్యాగన్లు విడిపోయయి. దీంతో మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం కిరండోల్ నుంచి విశాఖపట్నానికి ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలు బొర్రా, సిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య లింక్ తెగిపోయి ఇంజిన్‌తో వేరుపడింది.

10/02/2016 - 03:25

సామర్లకోట, అక్టోబర్ 1: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం సమీపంలో సర్పవరం రైల్వే స్టేషన్ వద్ద గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి 8.40 గంటలకు సుమారు 35 నిమిషాలపాటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతోప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.

10/02/2016 - 03:25

తిరుపతి, అక్టోబర్ 1: ప్రజా ఆరోగ్యం పరిరక్షణ చర్యల్లో భాగంగా పట్టణ పేదలకు వైద్యసేవలందించేందుకు ప్రాథమిక ఆరోగ్య టెలిమెడిసిన్ సదుపాయాలందించేందుకు సర్వీర్ ప్రొవైడర్‌గా అపోలో హాస్పిటల్ సహకారం తీసుకున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.

10/02/2016 - 03:24

హైదరాబాద్, అక్టోబర్ 1: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని అఖిల భారత పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కోరారు. సాధారణ ఖాళీల వల్ల సర్పంచ్‌లు లేని చోట ఉప సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కోరా.

10/02/2016 - 03:23

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి దరఖాస్తుల తుది గడువు శనివారంతో ముగిసింది. కాగా వీరికి నవంబర్ మొదటి వారంలో శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గత ఆగస్టు 27న కానిస్టేబుళ్ల (కమ్యూనికేషన్) నియామకానికి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

10/02/2016 - 03:23

హైదరాబాద్, అక్టోబర్ 1: కాంగ్రె స్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం మాని మంచి సలహాలు ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ (ఎపి) నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు ధర్నా నిర్వహించి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

10/02/2016 - 02:42

గుంటూరు, అక్టోబర్ 1: నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న కావేరి సీడ్స్, జీవా సీడ్స్ సంస్థలపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. శనివారం గుంటూరు ఆర్ అండ్ బి అతిథిగృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కావేరి సీడ్స్ రూ.

,
10/02/2016 - 04:07

విజయవాడ/ శ్రీశైలం, అక్టోబర్ 1: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో 11రోజులపాటు జరిగే దుర్ముఖ నామ దసరా మహోత్సవాలు శనివారం తెల్లవారుఝామున వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, అలాగే రాజధాని ప్రాంత అధికార ఉద్యోగులకు సెలవుదినం కావటంతో దుర్గమ్మను దర్శించుకునేందుకై తెల్లవారుఝాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

10/02/2016 - 02:35

విజయవాడ, అక్టోబర్ 1: ఖాళీ పోస్టుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా తొమ్మిది రకాల ఉద్యోగాలకు సంబంధించి 256 పోస్టుల భర్తీకి శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది. సహాయ ఇంజనీర్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల్లో కొన్నింటికి బిటెక్‌తో పాటు డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులు.

Pages