S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/16/2018 - 06:34

శ్రీకాకుళం, ఆగస్టు 15: ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి పురస్కారాలు ప్రకటించారు. రాష్టవ్య్రాప్తంగా 31 మందికి పది వేల రూపాయలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేసారు.

08/16/2018 - 06:34

శ్రీకాకుళం, ఆగస్టు 15: 72 గంటలుగా కుండపోత వర్షం..11 సెంటీమీటర్ల వర్షపాతం..ఎడితెరిపిలేని ముసురు, కారుమబ్బుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జెండా పండుగలో పాల్గొన్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన భారీ వర్షం ఉదయం 8.30 గంటల వరకూ కురుస్తునే ఉంది. సుందరంగా తీర్చిదిద్దిన నగరమంతా జలమయమైంది.

08/15/2018 - 05:52

పుత్తూరు, ఆగస్టు 14: దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పీఏగా పనిచేసిన ఉపాధ్యాయుడు రమణను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అయితే రమణ చాకచక్యంగా కిడ్నాపర్ల నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. బాధితుడు రమణ కథనం ప్రకారం తిరుపతి పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న వీరమంగళం వెంకటరమణ పుత్తూరు మండల ఇషా కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

08/15/2018 - 02:45

శ్రీకాకుళం, ఆగస్టు 14: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం పడినప్పటికీ శ్రీకాకుళం తొలిసారి రాష్టస్థ్రాయలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు వేదిక కాబోతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో రాష్టస్థ్రాయిలో ఆగస్టు 15 సంబరాలను ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవవందనం స్వీకరించడం తొలిసారి కాబోతోంది.

08/15/2018 - 05:32

అమరావతి, ఆగస్టు 14: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాము కూడా అండగా ఉంటామని సీనియర్ సిటిజన్లు, మాజీ సైనికోద్యోగులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చారు.

08/15/2018 - 02:41

విజయవాడ, ఆగస్టు 14: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వజల్ పథకం అమలుకు విజయనగరం, విశాఖ, కడప జిల్లాలు ఎంపికయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. 2000 కోట్ల రూపాయలతో గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

08/15/2018 - 02:39

విజయవాడ, ఆగస్టు 14: పేద కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే మోదీ కేర్ (ఆయుష్మాన్ భారత్) పథకం బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్దా చంద్రశేఖర్ తెలిపారు.

08/15/2018 - 02:37

విజయవాడ, ఆగస్టు 14: అమరావతి రాజధాని నిర్మాణానికి సంస్థాగత మదుపరుల నుంచి నిధుల సమీకరణకు ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారంపై అమరావతి బాండ్ల బిడ్డింగ్ ప్రక్రియ మొదలైన తొలి గంటలోనే భారీ స్పందన వచ్చింది. రూ. 1300 కోట్ల బాండ్లను బిడ్డింగ్‌కు ఉంచగా సంస్థాగత ఇనె్వస్టర్లు 2 వేల కోట్ల బాండ్ల కొనుగోలుకు ఆఫర్ ఇచ్చారు.

08/15/2018 - 02:36

అమరావతి, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాస్తవాలను పలకాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7 దశాబ్దాలకు పైగా దేశాన్ని అనేకమంది పాలించారని, అయితే హామీల అమలులో విఫలమైన ప్రధానిగా మోదీ మిగిలారని విమర్శించారు.

08/14/2018 - 06:36

రాజమహేంద్రవరం, ఆగస్టు 13: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న 7.50 లక్షల ఇళ్లలో వచ్చే ఏడాది మార్చినాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసి, లబ్ధిదారులకు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇందులో రెండున్నర లక్షల ఇళ్లు సొంత స్థలాల్లో నిర్మిస్తున్నామని, స్థలాలు లేని చోట జీ ప్లస్ విధానంలో మరో ఐదు లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు.

Pages