S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/13/2018 - 03:36

విజయవాడ, ఆగస్టు 12: ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్ 1 నుండి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో పామాయిల్‌ను కూడా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

08/13/2018 - 03:34

తుని, ఆగస్టు12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 235వ రోజైన ఆదివారం తుని మండలంలో కొనసాగింది. రేఖవాని పాలెం నుండి ప్రారంభమైన పాదయాత్ర డి పోలవరం వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు జగన్‌కు వినతిపత్రాలు అందించారు. పలువురు జగన్‌ను కలసి తమ గోడును జగన్‌కు విన్నవించుకున్నారు.

08/13/2018 - 03:33

రాజమహేంద్రవరం, ఆగస్టు 12: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బిజెపితో సంబంధం లేదని, ఆయనకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పవన్‌కళ్యాణ్‌కు బిజెపితో సంబంధం లేదు కాబట్టే వామపక్షాలతో కలుస్తున్నారని స్పష్టం శారు. బిజెపితో కలిసేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదన్నారు.

08/13/2018 - 03:32

గుంటూరు, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం శ్రీశైలం ఆలయంలోని కరివెన వారి సత్రంలో జరిగింది. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం అఖిల భారత కరివెన సత్రం కోశాధికారి టీవీ రమణ అధ్యక్షతన జరిగింది.

08/13/2018 - 03:31

విశాఖపట్నం, ఆగస్టు 12: గ్రామాలు, ప్రాంతాల వారీగా ప్రజలే తమ అవసరాలను గుర్తించి మేనిఫెస్టోలు రూపొందించుకోవాలని, వాటిని అమలు చేసేందుకు అంగీకరించే రాజకీయ పార్టీలకే పట్టం కట్టాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

08/13/2018 - 03:31

అనకాపల్లి, ఆగస్టు 12: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే యువివి కన్నబాబురాజు ఆయన తనయుడు, డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మ గడచిన పది రోజులుగా పార్టీ వర్గీయులకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అవుతోంది. కన్నబాబురాజు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

08/13/2018 - 02:12

గుంటూరు, ఆగస్టు 12: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వరుస సెల్ఫ్‌గోల్స్ తన ఇమేజ్‌ను తానే డ్యామేజ్ చేసుకుంటూ పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆదివారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/13/2018 - 02:10

విశాఖపట్నం, ఆగస్టు 12: ఆదివాసీ అటవీ హక్కులు హరించే జాతీయ అటవీ విధాన ముసాయిదాను వ్యతిరేకించాలని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(ఏఏఆర్‌ఎం) జాతీయ కన్వీనర్, త్రిపుల లోక్‌సభ సభ్యుడు జితేంద్ర చౌదరి పిలుపునిచ్చారు.

08/13/2018 - 02:13

అమరావతి: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పైచేయి ఏ పార్టీదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 18 నుంచి ఈనెల 10వ తేదీ వరకు మొత్తంగా 18రోజులు జరిగిన ఈ సమావేశాల్లో ఎవరి బలమెంత అనే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

08/13/2018 - 02:05

తుని, ఆగస్టు 12: ఉద్యమ నేతగా పేరొందిన ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంపై యూటర్ను ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం డి పోలవరం ప్రజా సంకల్పయాత్ర విశ్రాంతి శిబిరం వద్ద ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాపు జాతి కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసిన ముద్రగడ ఇప్పడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

Pages