S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/26/2019 - 04:23

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. తెలుపెసగెను తూర్పునందు
గొల్లలంత మేతల కని
పచ్చికగల బీళ్ళవైపు
పశుగణమును తోలినారు

2. తక్కిన గోపమ్మలపుడు
ఒక్కొక్కరు తరలుచుండ
మధ్యలోనె వారినాపి
మనవెంబడె రమ్మంటిమి.

12/26/2019 - 04:24

తూర్పు తెల తెలవారగానే పక్షులన్నీ గూళ్ల నుంచి మేతకై పరుగులిడుతున్నాయి. గోపబామలందరూ తమ పశువులు బీళ్లపైకి మేత కోసం పంపుతున్నారు. మేమూ ఇక తెల్లవారబోతున్నదని ఆ నందగోపబాలుని కీర్తించడానికి బయలుదేరాము.అపుడే నీవు గుర్తు వచ్చి నిన్ను పిలవడానికి నీ వాకిట నుంచున్నాం.
నీవు కూడా మాతో కలసి రమ్ము. చాణూరముష్టికలను వధించినవానిని, కేశిన చంపిన వానిని మనలను కాపాడుమని ప్రార్థించడానికి వెళ్లుతున్నాం.

12/26/2019 - 04:21

భగవంతుడు సృష్టించిన ఈ చరాచర జగత్తంతయు ప్రకృతే. ఫంచ భూతాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు అరణ్యాలు, అందులో జీవ జంతువులు అన్నియూ ప్రకృతిలోని భాగాలే. ఈ సృష్టి సమతుల్యాన్ని కాపాడే చెట్లు, గుట్టలు, అరణ్యాలు, పర్వతాలు అన్నీ మానవుని మనుగడ సాగించడానికి అవసరమైనవే. కనుక వాటి అన్నింటితోను కలసి ఉన్న ప్రకృతిని మనిషి తన స్వార్థం కోసం నాశనం చేయకూడదు.

12/24/2019 - 22:00

తే.గీ. ఎవరెవరి కన్న ఁదీసిపోరెవ్వరైన
వారలంతటి వారలు వారె గాద
యొకరు తక్కువగాదు వేరొకరుఁజాడ
నెక్వునవాదు కనుగొన నిది నిజమ్ము
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ

భావం: ఎవరెవరికన్నా ఏమాత్రం తీసిపోరు. ఎవరంతటివారువారు. ఒకరు తక్కువా కాదు. వేరొకరు ఎక్కువా కాదు. ఆలోచిస్తే ఇది అక్షరసత్యం అని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమయ్యా దివాకరా!

12/24/2019 - 02:32

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. భరద్వాజ పక్షులన్ని
భవ్యవౌ మధుర యందు
కీచుమంచు ధ్వని చేయుచు
కేరింతలు కొడుతున్నవి

2. తమమేతను తెచ్చు కొరకు
దవ్వుకేగ బెంగపడుచు;
పురుషోత్తము నొదులలేక
పులుగులగుమి వెనుకాడెను

12/23/2019 - 23:10

కీచు కీచుమనే శబ్దాలతో భరద్వాజ పక్షులన్నీ కూడా బాలభానుడికి సుప్రభాతం పలుకుతున్నాయి. తూర్పు తెల్లవారబోతుంటే కూడా ఇంకా నిద్ర లేవని నిన్ను పిచ్చిపిల్లా! అని సంబోధించాలనిపిస్తోంది. తలలోని పూవులు జారిపోతున్నాయి. గోపకాంతలందరూ లేచి పెరుగును చిలుకుతున్నారు. మనమూ వెళ్లి ఆ నందగోపుని అర్చిద్దాం రమ్మని ఆండాళ్ తల్లి పిలుస్తోంది.

12/23/2019 - 23:02

తే.గీ. ఓటమన్నది గెలుపుకు బాట యంచుఁ
దెలుసుకొనవలె దిగులేల? తివిరి యడుగు
ముందునకు వేయ గెల్పెవ రెందునైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/22/2019 - 23:56

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. పక్షులెన్నొ శ్రావ్యముగా
పలు భంగుల కూయుచుండె;
ఖగపతియును కోవెలలో
మంగళాలు పాడదొడగె

2. ఆలయ అర్చకులంతట
అర్చనాది విధులొనర్ప;
జేగంటలు గుడియందున
జయనాదములొనరించెను

12/22/2019 - 23:54

ఆండాళ్ తల్లి కృష్ణుని అనుగ్రహం పొందడానికి ఒక వ్రతం చేద్దామని ఆలోచించింది. వ్రతం తను ఒక్కర్తే చేసి ఫలాన్ని పొందడమేమున్నది. అందరం కలసి వ్రతనియమాలను పాటిస్తూ అందరం కలసి భగవన్నామానాన్ని పాడితే అపుడు అందరినీ భగవంతుడు రక్షిస్తాడు కదా అన్న భావనతో తన తోడి వారినందరినీ వ్రతాచరణకు రమ్మని పిలిచింది. అజ్ఞానమనే నిద్రలో కూరుకుని పోయి ఉన్నవారిని మేల్కొలిపి భగవంతుని పూజించడానికి రమ్మని పిలుస్తోంది.

12/22/2019 - 23:48

తే.గీ. అంతరాలను వీడిన హాయి నొంది
యాత్మ సంతృప్తిఁ బడయుదుము మవనిలోన
నటుల ఁగాకున్న దైన్యత యావహించుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages