S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/07/2020 - 22:46

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. పరమాత్ముడు పవళించిన
భవ్యమైన మృదుతల్పము
పంచముఖ గుత్తిదివ్వె
పంచసుగుణ తత్త్వబోధి

2. మదేభపు దంతాలతో
మలచినట్టి సుందరమగు,
కోడులుగల మంచముపై
గోవిందుడు పవళించెను

01/07/2020 - 06:04

ఈ ఆండాళ్ తల్లి ఈరోజు నీళాదేవిని నిద్ర నుంచి మేల్కొపడానికి బయలుదేరింది. గుత్తి దీపాలు వెలుగుతుండగా దంతపు కోళ్లు గల మంచంపై మెత్తనైన ఐదు లక్షణములు గల పాన్పుపై పడుకుని ఉన్న ఓ నీళాదేవి నిన్ను ఆనుకుని శయనించి ఉన్న ఓ విశాల వక్షఃస్థలం గల ఓ దేవాదిదేవా! నీవును మేల్కొనుము అంటూ ఆండాళ్ తల్లి నీళాదేవిని, శ్రీకృష్ణ భగవానుని మేల్కొపుతున్నది. ఓ దేవా నోరు తెరువుము. ఒక మాటను పలుకుము.

01/07/2020 - 06:04

ఆండాళ్ తల్లి పాడిన పాశురాలను అనుసంధానించుకుంటూ ప్రతి వైష్ణవ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సాయంత్రం వేళలో ఆ పాశురాలకు అర్థతాత్పర్యాలను చెబుతూ శ్రీకృష్ణుని రమ్యమైన జీవిత కథావిశేషాలను చెప్పే భాగవతులతో కూడా కోవెలలు కళకళలాడుతుంటాయి. అటువంటి దేవాలయమే ఈ హైదరాబాదు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న సౌభాగ్యపురంలోని ‘‘ శ్రీ అలివేలు మంగ పద్మావతి గోదా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం’’.

01/07/2020 - 06:02

తే.గీ. శక్తులుడిగిన వారన్న సరకు చేయ
రట్టివారికి మట్టుకు నరయ శక్తు
లుడుగ కుండునా ? యవివేకముడుగకుండెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/07/2020 - 00:09

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. మదేభముల పొగరడంచు
మహాశక్తివంతుడైన,
నందప్రభుని కోడలమ్మ
నప్పిన్నపిరాట్టి లెమ్ము

2. నిదురనొదిలి యంతఃపుర
గదిగడియను తొలగించుము
కోడిపుంజులెపుడొ లేచె
కొక్కొరొకో యని కూయుచు

01/06/2020 - 22:57

శ్రీకృష్ణుని నిదుర నండి లేపుటను నీళాదేవిని లేపుట మరిచి యుండుటచే నీళాదేవినే ప్రత్యేకించి నిద్ర లేపుతున్నది. మదమును స్రవించు ఏనుగుల బోలిన బలము కలవాడు. వెనుదీయని భుజబలము కలవాడైన నందగోపుని కోడలా నప్పిన్నారాట్టి ! సువాసన గుబాళించుచున్న కొప్పు కలదానా! గడియ తీయుము. కోళ్లు వచ్చి అంతా కూయుచున్నవి. మాధవి పందిరపై పలుసార్లు కోకిలల గుంపులు కూయుచున్నవి.

01/06/2020 - 22:53

తే.గీ సర్వమత సారమొక్కటే సకల జనులు
భేదభావాలు వీడుచు వెలుగు పూల
తోటలనుఁబెంచి పోషింప దొరకు సుఖము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!
భావం: జనులంతా భేదభావాలు లేకుండా సర్వత్రా వెలుగు పూల తోటలను పెంచి పోషించిన పక్షంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అలా లభించిన సుఖ సంతోషాలను జనులంతా అనుభవించాలన్నదే సర్వమత సారమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

01/06/2020 - 06:03

ప్రతిమాసంలో రెండు చొప్పున 24 లేక 26 ఏకాదశులు సంవత్సరంలో వస్తాయ. వాటిల్లో ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి పవిత్రమైనా అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో పుష్యశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా ప్రాచుర్యం పొందింది. ఏకాదశి విష్ణు వరప్రసాది. ఈ రోజున చేసే కార్యాలన్నీ విష్ణుప్రీత్యర్థం చేస్తే వేలకోట్ల పుణ్యరాశులు సొంతం అవుతాయ.

01/04/2020 - 22:47

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. ముఖద్వారము తెరువగనే
మూకుమ్మడిగ వనితలు
నందగోప ప్రభువునుగని
వందనమ్మిడి వేడినట్లు

2. స్వామీ! మీ దాతృత్వము
సర్వజనుల కొదవు హితము,
విరివిగాను మీరిత్తురు
నీరు, అన్న వస్తమ్రులను,

01/04/2020 - 22:47

ద్వారం నుండి లోపలకు వచ్చిన తర్వాత చల్లని తీర్థం, ప్రసాదాన్ని, వస్త్రాలను కూడా ఇచ్చే ధర్మబుద్ధి ఉన్న ఓ స్వామీ!నందగోపాలుడా! మేల్కాచుము. నీటి ప్రెబ్బలి మొక్కవోలె ఉన్న ఓ యశోదమ్మా నీవు స్ర్తిజాతికే మణివి. చక్కని దేదీప్యమానంగావెలిగే జ్యోతివి. వంశకీర్తిని పెంచే ఓ నందుని ఇల్లాలా! ఇక మేల్కొనుము. లోకాన్నింటిని గెలిచే సామర్థ్యమున్న తమ్ముని పొందిన ఓ బలరామా! నీవును మేల్కొనుము.

Pages