S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/22/2016 - 22:30

ముద్దు మనిషి జీవితంలో ఓ మధుర స్పర్శ.. మమతల శ్వాస. ఓసారి ఆప్యాయంగా, ఓపరి ఓదార్పుగా, ఓ పర్యాయం ఆనందంగా.. లాలనగా, కాంక్షగా, తమకంగా, తృప్తిగా.. ఇన్ని మధుర భావాల వ్యక్తీకరణకు సాధనమైన మరి ముద్దైన పద్ధతులేంటో తెలుసా మీకు? అయతే తెలుసుకోండి.

09/22/2016 - 06:40

అలలపై ఆసనాలు వేసేందుకే ఆధునిక యువత మొగ్గుచూపుతోంది. హవాలి ద్వీపవాసులు తెడ్డు బోర్డుపై యోగాసనాలు వేసే ప్రక్రియను కనిపెట్టారు. వాళ్లకు చుట్టూ నీళ్లే కాబట్టి ఆ నీళ్లపైనే యోగాను చేసే పద్ధతులను వారు ఆచరిస్తున్నారు. ఇపుడు ఈ యోగా ప్రక్రియ ఖండాంతరాలు దాటేసింది. నీటి అలలపై చల్లటి గాలుల మధ్య చేసే ఈ యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతోంది. ఇపుడు పాశ్చత్య దేశాలలో ఈ యోగా ప్రక్రియను విరివిరిగా ఆచరిస్తున్నారు.

09/21/2016 - 00:34

తూనీగల్లా ఎగురుతూ తుళ్లింతలు, కేరింతలతో ఆనందంగా ఆహ్లాదంగా గడిచేది బాల్యం. ఆటపాటలకి అసలుసిసలైన వయసు పసిప్రాయం. మారిన సమాజంలో చదువుల్లో ఒత్తిడి పెరిగింది. సినిమాలు, టీవీ ప్రభావం, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పిల్లల ఆలోచనా విధానంలోనూ కనబడుతోంది. శారీరక దృఢత్వానికి, వ్యాయామానికి వలసిన ఆటకు అవరోధం కలుగుతుంది.

09/17/2016 - 22:12

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. వరకట్నం అనే జాఢ్యం ఈ కమ్మటి మాటను కాలరాస్తోంది. అం దుకే ఆధునిక యువతి పెళ్లికి గుడ్‌బై చెప్పేస్తోం ది. ఒంటరి జీవితమే బెటర్ అనే నిర్ణయానికి వస్తోంది. కట్నం ఇస్తేనే తాళి కడతానని వరుడు భీష్మించుకుని కూర్చోవటాన్ని నేటి యువతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని అవమానకరంగా భావిస్తున్నారు.

09/16/2016 - 22:56

ఇల్లు ఆహ్లాదకరంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ముందుగా మానసిక ఆరోగ్యవంతురాలుగా ఉండాలి కదా! అప్పుడే ఆ కుటుంబంలోని సభ్యులంతా ఉత్తములుగా ఎదుగుతారు. ‘సంస్కారం’ అనే బండి సజావుగా ముందుకువెళ్ళాలంటే తల్లీదండ్రులు బుద్ధిమంతులై ఉండాలి.

09/16/2016 - 00:37

కౌసల్యా సుప్రజారామా! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం- అంటూ ఆ కలియుగ దైవాన్ని మేల్కొలిపే ఆ గాన మాధుర్యం నేటికీ ప్రతి ఇంటిలోనూ మారుమోగుతూనే వుంటుంది. ప్రాతఃకాలంలో మధుర మంజులంగా వినబడే స్వరం ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిది. కర్నాటక శాస్ర్తియ సంగీతం పేరు చెబితే తొలుత వినబడే పేరు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.

09/15/2016 - 04:40

కృష్ణకుమారి ఇష్టంగా వండే వంటల వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయని కుమార్తె దీపిక చెబుతోంది. అలాగే అందాల నటి పట్ల సహనటీ, నటులుకున్న అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

09/13/2016 - 20:57

ఇంచుమించు తొంభై సంవత్సరాలుగా భారతీయ మహిళ మేనుకు మెత్తగా హత్తుకునే నల్లిసిల్క్స్ వస్త్ర సామ్రాజ్యానికి ఐదవతరం ప్రతినిధిగా లావణ్య నల్లి అడుగుపెట్టారు. అనతికాలంలోనే సిల్క్ వస్త్రాలకు పర్యాయపదంగా నల్లి సిల్క్స్‌ను తీర్చిదిద్దారు. గత కొనే్నళ్లుగా ఆ కుటుంబంలోని మగవారే ఈ వస్త్ర సామ్రాజ్యాన్ని తరతరాలుగా ఏలుతున్నారు. నేడు ముప్పయి రెండేళ్ల అమ్మాయి ఆ సామ్రాజ్యాన్ని ఏలుతూ తన వ్యాపార దక్షతను చాటిచెబుతోంది.

09/13/2016 - 20:51

కట్టిపడేసే డిజైన్లలో వస్త్రాల అమ్మకాలు జరపటం లావణ్య ప్రత్యేకమని అంటారు. వస్త్రాలు కొనేది ఆడవారే అయినప్పటికీ ఈ రంగంలో డిజైనింగ్, అమ్మకాల రంగం మాత్రం పూర్తిగా పురుషాధిక్యతతో నిండివుంది. ఇలాంటి సమయంలో ఆధునిక తరానికి ప్రతినిధిగా లావణ్య రావటం జరిగింది. సంప్రదాయ వస్త్రాలతో పాటు పాశ్చాత్య డిజైన్‌లలో వస్త్రాలను అధికంగా అందుబాటులోకి తెచ్చారు.

09/10/2016 - 22:03

మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఏర్పడటానికి పెంపొందటానికి ఒకరినొకరు పిల్చుకునే పిలుపులు కూడా ఎక్కువగా కారణమవుతాయి. ఒకరితో మరొకరికి ఉండే బాంధవ్యాన్ని తెలియజేస్తాయి. అనురాగాన్ని అభివృద్ధి చేస్తాయి.

Pages