S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/08/2018 - 17:35

బెంగళూరు: కర్నాటకలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మోదీ కొప్పల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ దేశ భక్తిని విశ్వసిస్తుందని, సమాజానికి సేవ చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కులతత్త్వాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. యాత్రలు, విజ్ఞాన యాత్రల కోసం విద్యార్థులను కులం ఆధారంగా ఎంపిక చేసిందని చెప్పారు. రైతుల కష్టాలకు కాంగ్రెస్సే కారణమని విమర్శించారు.

05/08/2018 - 17:34

బెంగళూరు: మోదీ ఎక్కడికి వెళ్లినా తప్పుడు ప్రచారం, చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నారని సోనియా విమర్సించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సోనియాగాంధీ మంగళవారనాడు మాట్లాడారు. కర్ణాటకను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కాంగ్రెస్ తీర్చిదిద్దిందని అన్నారు. ప్రజల కోసం లెక్కకు మించిన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.

05/08/2018 - 17:14

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలు కల్పించామో వివిధ శాఖలు లెక్కలు తయారుచేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. 2014 ఎన్నికల్లో మోదీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హమీ ఎంత వరకు నెరవేరిందో ఎన్ని ఉద్యోగాలు కర్పించామో లెక్కలు తేల్చాల్సిందిగా ఆయన కోరారు.

05/08/2018 - 17:13

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీచేస్తున్న బదామీ నియోజకవర్గంలో ఐటీ దాడులు నిర్వహించారు. కృష్ణా హెరిటేజ్ హోటల్‌పై దాడులు జరిగాయి. ఈ హోటల్‌లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ దాడులు వెనుక బీజేపీ హస్తం ఉందని సిద్ధరామయ్య ఆరోపించారు.

05/08/2018 - 16:04

చెన్నై: తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేసే విషయంలో మే 14న జల వనరుల శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా ముసాయిదాను సమర్పించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు ఆదేశించింది. అలా చేయకపోతే కేంద్రం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. కావేరీ జలాల వివాదం కేసులో తాజాగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ ఈ తీర్పు వెలువరించింది.

05/08/2018 - 13:47

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో భార్య శవాన్ని ఓ భర్త భుజాలపై మోసుకెళ్లాడు. ఓ ఆస్పత్రి సిబ్బంది మానవత్వం మరిచి ప్రవర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు.

05/08/2018 - 13:42

అగర్తలా : త్రిపుర రాజధాని అగర్తలాలోని సుభాష్‌నగర్‌లో త్రిపుర స్టేట్ రైఫిల్స్‌కు చెందిన ఓ జవాన్ తన భార్యాపిల్లలను చంపి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న జవాన్‌ను మానిక్ లాల్ ఘోష్(40)గా పోలీసులు గుర్తించారు.

05/08/2018 - 13:40

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా నలుగురు ఉగ్రవాదులను, ఏడుగురు సానుభూతిపరులను బలగాలు అరెస్టు చేశాయి. ఏప్రిల్ 30న జరిగిన ముగ్గురు యువకుల హత్యలో ఈ నలుగురు ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

05/08/2018 - 13:35

జగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో పలువురు కూలీలు ఉపాధి పనుల నిర్వహణలో భాగంగా మట్టి గడ్డలు తవ్వుతున్నారు. మట్టి పెళ్లలు ఒక్కసారిగా మీదపడడంతో సరికెల ముత్తమ్మ(50), జెల్లా పోసాని, సరికెల రాజు(55) అనే కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 6గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కాగా... గాయపడ్డ వారిని మెట్‌పల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

05/08/2018 - 13:34

బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తొలిసారిగా ప్రధాని పదవిపై పెదవి విప్పారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధాని అవుతానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఓ అవినీతి వ్యక్తిని ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారో ప్రధాని మోదీ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. రూ.

Pages