S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/07/2018 - 16:51

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విగ్రహ ధ్వంస ఘటనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి నల్ల రంగు పూశారు. కొందరు విద్యార్థులే ఈ పనిచేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు.

03/07/2018 - 13:07

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రంలో తలెత్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు బిజెపి నేతలు సిద్ధంగా ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రి కామినేనికి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. ఏపీ బిజెపి మంత్రులు వైదొలిగితే కేంద్రంలో కూడా టిడిపి మంత్రులు వైదొలిగే అవకాశాలు ఉన్నాయి.

03/07/2018 - 12:41

వేలూరు: తమిళనాడు కాట్పాడి సమీపంలోని వల్లి మలై సుబ్రమ ణ్యస్వామి వారి ఆలయ కొలనులో భక్తులు వేసిన ఆహారప దార్థాలను తినడంతో చేపలు చనిపోయాయి. అలాగే ఈ కొలనులో నిర్వాహకులు చేపలను పెంచుతున్నారు. చేపలకోసం భక్తులు అటుకులు, బొరుగులు వేస్తుంటారు. మంగళవారం ఈ కొలనులో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి తేలియాడుతూ కనిపించాయి.

03/07/2018 - 16:56

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేశారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద ఆందోళన చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

03/07/2018 - 12:33

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో వాయిదాల పర్వం నేడు కూడా కొనసాగింది. లోకసభ ప్రారంభం అవ్వగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు, కావేరీ జల వివాదంపై అన్నాడిఎంకే సభ్యులు, పిఎన్‌బి, విగ్రహాల ధ్వంసంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో సభను వాయిదా వేశారు. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ కొనసాగింది. పీఎన్‌బీ కుంభకోణంపై చర్చకు చైర్మన్ అంగీకరించినా..

03/07/2018 - 12:32

న్యూఢిల్లీ: విగ్రహాల ధ్వంసంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యంకాదని ఆయన పేర్కొన్నారు. త్రిపురలో రష్యా కమ్యూనిస్టు పార్టీ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయటంతో ఆక్కడ అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. తాజాగా తమిళనాడులో సంఘ సంస్కర్త ఈవీఆర్ రామస్వామి విగ్రహాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయటంతో అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

03/07/2018 - 06:59

న్యూఢిల్లీ, మార్చి 6: ప్రత్యేక హోదా డిమాండ్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఏపీకి కేంద్రం ఝలక్ ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదాను ఇచ్చితీరాల్సిందే నంటూ అమీతుమీకి దిగిన ఏపీతో కేంద్రం రివర్స్‌గేర్ గేమ్ మొదలుపెట్టింది. హోదాకు సమానమంటూ ఇచ్చిన ప్యాకేజీ నిధులు 12 వేల కోట్ల రూపాయలకు తక్షణం లెక్కలు చూపించాలంటూ కొత్త మెలిక మొదలుపెట్టంది.

03/07/2018 - 06:57

న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి కట్టుబడి ఉన్నామని, కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని రాహుల్ స్పష్టం చేశారు. అందరితో కలిసి కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీపై విభజన సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తెస్తామన్నారు.

03/07/2018 - 06:55

న్యూఢిల్లీ, మార్చి 6: బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయే పారిశ్రామికవేత్తల ఆటకట్టించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా తరహాలో ఇంకెవరూ విదేశాలకు చెక్కేయకుండా రుణగ్రహీతల పాస్‌పోర్టులకే గాలం వేసింది.

03/07/2018 - 06:54

న్యూఢిల్లీ, మార్చి 6: మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీని ఈనెల 9 వరకు కోర్టు పొడిగించింది. అంతకుముందు కార్తీకి విధించిన ఐదురోజుల కస్టడీ సమయం ముగిసిపోయిన నేపథ్యంలో, ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా వద్ద సీబీఐ అధికార్లు ప్రవేశపెట్టారు.

Pages