S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/31/2016 - 06:31

బాగ్దాద్, మే 30: ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గల వాణిజ్య స్థలాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోమవారం జరిపిన బాంబు దాడుల్లో 24 మంది మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లో షియాల ప్రాబల్యం గల ఒక వాణిజ్య ప్రాంతంలోని ఒక చెక్‌పాయింట్‌లోకి ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన కారుతో దూసుకెళ్లాడు.

05/31/2016 - 06:31

న్యూఢిల్లీ, మే 30: ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదానుండి తప్పించుకునేందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాజస్తాన్‌కు పారిపోయారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఆదివారం జరిగిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చిన నారాయణ సోమవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు.

05/31/2016 - 06:30

న్యూఢిల్లీ, మే 30: ఓ ఆయుధ డీలర్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గిఫ్టుగా లండన్‌లో ఫ్లాట్ దక్కిందన్న కథనాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఓ ఆంగ్ల వార్తా సంస్థలో వచ్చిన కథనాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. 2009లో రాబర్ట్‌వాద్రాకు లండన్‌లో బినామీ పేరుతో ఫ్లాట్ దక్కినట్టు చెబుతున్నారు.

05/31/2016 - 06:29

న్యూఢిల్లీ. మే 30: దేశంలో ఆఫ్రికన్లపై వరుస దాడుల నేపథ్యంలో వారిలో నమ్మకం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్రికన్ల భద్రత, సురక్ష తమ ప్రధాన విధానమని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ అన్నారు. కాంగో జాతీయుడి హత్య, ఆఫ్రికన్లపై కేసుల నమోదు నేపథ్యంలో జయశంకర్ సోమవారం ఆఫ్రికన్ విద్యార్థుల బృందాన్ని కలిసి చర్చించారు.

05/31/2016 - 06:29

ముంబయి, మే 30: ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్‌తోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌ను అనుకరి స్తూ హాస్య నటుడు తన్మయి భట్ రూపొందించిన వీడియోపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో తన్మయి భట్‌పై ఫిర్యాదు దాఖలవడంతో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

05/31/2016 - 06:28

న్యూఢిల్లీ, మే 30: ఆదిశంకరాచార్యుల జయంతి రోజైన మే 11న జాతీయ తత్వవేత్తల దినోత్సవంగా పాటించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఎన్‌జివో సంస్థ ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ సభ్యుడు పి పరమేశ్వర్ నవోదయం పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు.

05/31/2016 - 06:27

న్యూఢిల్లీ, మే 30: ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) రాష్ట్ర శాఖ అనుసరించిన ఎన్నికల వ్యూహాలు.. పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయాలకు, పార్టీ రాజకీయ ఎత్తుగడల పంథాకు అనుగుణంగా లేవని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. సిపిఐ(ఎం) రాజకీయ ఎత్తుగడల పంథా ప్రకారం పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి అవగాహన కుదుర్చుకోవడానికి కాని పొత్తు పెట్టుకోవడానికి కాని వీల్లేదు.

05/31/2016 - 06:26

న్యూఢిల్లీ, మే 30: దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ విషయంలో రైల్వేలు మరింత ఆశావహ దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. రైల్వే శాఖతో పాటు రోడ్లు, రహదారుల శాఖ పనితీరుపై సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించి న సమీక్షా సమావేశంలో ప్రధాని ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

05/31/2016 - 06:26

పనాజీ, మే 30: న్యాయస్థానాలు జారీ చేస్తున్న కొన్ని ఆదేశాలు అర్థరహితంగా ఉన్నాయని, వాటికి ఎలాంటి శాస్ర్తియ పునాదిలేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సోమవారం ఇక్కడ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సైన్స్ అంటే తెలియని కొందరు వ్యక్తులు వాటిని అన్వయిస్తున్నారని, ఎలాంటి శాస్ర్తియ దృక్పధం లేకుండా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి సంబంధించిన ఓ వార్తను ఉదహరించారు.

05/31/2016 - 06:25

న్యూఢిల్లీ, మే 30: పొగాకు వినియోగాన్ని నిరోధించడంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ సంస్థలు భాగస్వాములు కావాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా పిలుపునిచ్చారు. ఒక్కో సంస్థ అయిదారు పాఠశాలలను దత్తత తీసుకొని, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించడంద్వారా చిన్న వయస్సులోనే వారిని చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు.

Pages