S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/02/2016 - 01:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ విచారణ పూర్తియ్యేదాకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ గతంలో ఉమ్మడి ఏపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

04/02/2016 - 01:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సిగరెట్ ప్రియులకు ఓ షాక్. సిగరెట్ పెట్టెలపై 85 శాతానికి పైగా హెచ్చరికల బొమ్మలను ముద్రించాలన్న కేంద్ర ఆదేశంతో ఐటిసి, గాడ్‌ఫ్రే, ఫిలిప్స్, విఎస్‌టి వంటి సంస్థలు తమ ఫ్యాక్టరీలను శుక్రవారం నుంచి మూసివేశాయి.

04/02/2016 - 01:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రాష్ట్ర విభజన చట్టం 9, 10 షెడ్యూలులోని ఉమ్మడి సంస్థల పంపకాల విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు పరస్పర చర్చల ద్వారానే రెండు షెడ్యూళ్లలోని సంస్థలను విభజించుకోవాలని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి దిలీప్‌కుమార్ హితవు చెప్పి తప్పించుకున్నారు.

04/01/2016 - 18:14

నైనిటాల్: అసెంబ్లీ అచేతనావస్థలో ఉన్నందున తమకు అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు లేదని సవాల్ చేస్తూ 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఇక్కడి హైకోర్టు ఈ నెల 11కి వాయిదా వేసింది.

04/01/2016 - 17:17

దిల్లీ: విమానాన్ని నడిపేందుకు నిరాకరించిన ఓ కమాండర్‌ను ఎయిర్ ఇండియా సంస్థ విధుల నుంచి సస్పెండ్ చేసింది. ముంబయి-్భపాల్ మధ్య కొత్త సర్వీస్‌ను ఎయిర్ ఇండియా సంస్థ శుక్రవారం ప్రారంభించింది. తొలి సర్వీస్‌ను నడిపేందుకు ఓ సీనియర్ కమాండర్‌ను ఇదివరకే అధికారులు ఎంపిక చేశారు. అయితే, విమానం నడిపేందుకు తాను సుముఖంగా లేనని చివరి నిమిషంలో ఆ కమాండర్ చెప్పడం వివాదాస్పదమైంది.

04/01/2016 - 17:15

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సాయుధ జవాన్లు మరణించారు. కాల్పులకు ముందు మావోలు మందుపాతరను పేల్చారని సిఆర్‌పిఎఫ్ అధికారులు తెలిపారు.

04/01/2016 - 17:05

హైదరాబాద్: కోల్‌కతలో ఫ్లయ్ ఓవర్ కుప్పకూలిపోవడం అన్నది కేవలం ప్రమాదమేనని, ఇందులో తమ సంస్థ నిర్లక్ష్యం ఏమీ లేదని ఐవిఆర్‌ఎల్‌సి కంపెనీ ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. కోల్‌కతలో ఫ్లయ్ ఓవర్ కుప్పకూలిన దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వారు అన్నారు. ఆ ఫ్లయ్ ఓవర్‌లో 59 పిల్లర్లకు ఎలాంటి సామగ్రి వాడామో 60వ పిల్లర్‌ను కూడా అంతే జాగ్రత్తగా నిర్మించామన్నారు.

04/01/2016 - 13:58

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రిగా మొహబూబా ముఫ్తీ ఈనెల 4న ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. మొహబూబా నేతృత్వంలోని పిడిపి, మిత్రపక్షమైన బిజెపి నేతలు శుక్రవారం సమావేశం జరిపి ఈనెల 4న కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు.

04/01/2016 - 13:58

కోల్‌కత: కోల్‌కత నగరంలో ఫ్లయ్‌ఓవర్ కుప్పకూలిన ఘటనలో నిర్మాణ సంస్థ ప్రతినిధులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ఐవిఆర్‌ఎల్‌సి సంస్థ ఈ ఫ్లయ్‌ఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణం ఆకస్మికంగా కూలిపోవడంతో 25 మరణించగా, సుమారు వందమంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటన స్థలాన్ని సందర్శించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

04/01/2016 - 13:58

దిల్లీ: ఓబుళాపురం మైనింగ్ సంస్థ కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గాలి జనార్దన రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ప్రత్యేక కోర్టు చేపట్టినందున ప్రస్తుత సమయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Pages