S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంశధార పనులు పునఃప్రారంభం

హిరమండలం, జూలై 19: వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. వంశధార ఇఇ సీతారామనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు పరిహారం చెల్లింపులకు నిధులు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు నిర్మాణ పనులను చేపట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు. పనులను వేగవంతంగా చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. తొలుత కుంద్రే ప్రాంతంలో పనులు చేపట్టినట్టు తెలిపారు.

వ్యాసుడి రచనల్లో విలువలు పుష్కలం

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 19: వేద సారాన్ని అందించిన వేద వ్యాసుడు శిష్యులకు నైతిక విలువలు బోధించి మంచి మార్గాన్ని నడిపించారని ఉపన్యాస కర్త పైడి హరనథ్‌రావు అన్నారు. ఆయన రచనల్లో విలువలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. శ్రీమన్నారాయణుడే లోకానికి వేద సారాన్ని అందించి వ్యాసునిగా ద్వాపరయుగంలో సత్యవతి గర్భాన పరశురామునీంద్రునికి సద్యోగర్భాన జన్మించెనన్నారు. బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా వేదాలను విభజించి అష్టదశా పురణాలను, ఉపనిషత్తులను, మహాభారతాన్ని, స్మృతులను వ్యాసుడే రచించాడని, వ్యాసుడు త్రికాలవేది, త్రికాలద్రష్ఠ, స్వేచ్ఛా గమనం కాలవాడని అన్నారు.

డౌన్!

శ్రీకాకుళం, జూలై 19: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పల్స్ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజాసాధికార సర్వే ప్రారంభమై పది రోజులు కావస్తున్నా నత్తనడకన సాగడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎన్యుమరేటర్లకు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. సర్వే నాలుగు అడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా గ్రామాల్లో సాగడంతో అటు అధికారులు, ఇటు ఎన్యుమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని 27లక్షల జనాభా ఉండగా పది రోజుల్లో కేవలం 8,573 కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.

కిడ్ని బాధితులను ఆదుకోండి

శ్రీకాకుళం, జూలై 19: జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్ని వ్యాధులను సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్య కుటుంబు సంక్షేమ శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ను పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఇటీవలి బాధ్యతలు స్వీకరించిన ఆరోగ్యసహాయ మంత్రిని ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలుసుకుని కిడ్ని వ్యాధుల సమస్యపై తీసుకోవల్సిన అంశాలు చర్చించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పొగాకును సాగుచేసి కష్టాల్లో కూరుకుపోయిన రైతులను కేంద్రప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఎం.పి, మంత్రి నిర్మలా సీతారాంను కలిసి ఇక్కడి పరిస్థితులను చర్చించారు.

బిసిల అభ్యున్నతికి కృషి

ఎచ్చెర్ల, జూలై 19: జిల్లాలో అధిక శాతం బిసిలు ఉన్నారని వీరి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సెర్ఫ్ సిఇవో కృష్ణమోహన్ స్పష్టంచేశారు. సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించడంలో వెలుగు, డిఆర్‌డిఎ సిబ్బంది ప్రధాన భూమిక పోషించాలని, బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాతలు శతశాతం లక్ష్యాలు అధిగమించాలని కోరారు. అలాగే రికవరీలో కూడా ముందు వరుసలో నిలవాలని ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ అమలులో కూడా మహిళా సంఘాలు కీలకంగా వ్యవహరించాలన్నారు. బిసిలకు స్వయం ఉపాధి రుణాలు 50శాతం మహిళా సంఘాల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు.

అధిక దిగుబడులు సాధించాలి: కలెక్టర్

పాతపట్నం, జూలై 19: వ్యవసాయరంగంలో అధికదిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గస్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశం స్థానిక వ్యవసాయ మార్కెట్ అవరణలో జరిగింది. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా నియెజకవర్గం వెనుకబడి ఉందన్నారు. సారవంతమైన భూములు ఉన్నప్పటికీ పరిశ్రమలు, పట్టణీకరణ తక్కువగా ఉండడం వలన తలసరి ఆదాయం తక్కువగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో జిల్లాలో ఎచ్చెర్ల మొదటిస్థానంలో నిలవగా, టెక్కలి రెండోస్థానంలో ఉందన్నారు. వ్యవసాయంలో రెండు,మూడు పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు

జి.సిగడాం, జూలై 19: భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మ ఉత్కృష్టమైనదని అటువంటి మానవ జన్మలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువని మండలం ఎందువ గ్రామానికి చెందిన గురుదేవులు విశ్వనాథ చైతన్య మహరాజ్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక షిర్డీసాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బాబావారి చిత్రపటాన్ని పల్లకిలో నగర సంకీర్తన నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమాల్లో మహరాజ్ పాల్గొని గురుపౌర్ణమి విశిష్టతను విపులంగా వివరించారు. గురుతత్వాన్ని గూర్చి బాబాల వారే ముందుగా తెలియజేసినట్టు ఆయన తెలిపారు.

విద్యార్థులకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు

నరసన్నపేట, జూలై 19: మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నేత్రశస్త్ర చికిత్సలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రముఖ సంధ్యాకంటి ఆసుపత్రి వైద్యుడు ఎం ఎస్ రాజు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక బోర్డు ఉన్నత పాఠశాలలో 550మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా విద్యార్థుల్లో ‘ఎ’ విటమిన్ లోపం కనిపిస్తోందని వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లేనిపక్షంలో కంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్పష్టంచేశారు.

సక్రమంగా పల్స్ సర్వే

పోలాకి, జూలై 19: జిల్లాలో ప్రతీ ఒక్క పంచాయతీ కార్యదర్శి స్థానికంగా ఉండి పల్స్ సర్వేను ప్రతీ రోజూ ఉదయం 6గంటలకు ప్రారంభించాలని డిపివో కోటేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం ఎంపిడివో కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చిన సమయంలో పల్స్ సర్వే నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పల్స్ సర్వే దయనీయంగా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 200 పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపినట్టు తెలిపారు.

‘అభివృద్ధే ధ్యేయం’

పలాస, జూలై 19: పలాస మున్సిపాలిటీ ప్రజాభివృద్ధి తమ పాలకవర్గం ధ్యేయమని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం మొదటిగా 17,25వ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అనంతరం తన కార్యాలయంలో చినబాడంకు చెందిన శ్రీసంతోషిణి మహిళ పొదుపు సంఘానికి 5 లక్షల రూపాయలు రుణం, సైన ప్రసాద్ అనే వికలాంగుడుకు ట్రైసైకిల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పారిశుద్ధ్యం మెరుగుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని, ప్రజా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు బల్లయ్య, కృష్ణమూర్తి, యోగి, వల్లభ, నర్శింహులు, లక్ష్మణ్, పి.మల్లేసు పాల్గొన్నారు.

Pages