S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినియోగదారుడి ఇంటికే కూరగాయలు!

నంద్యాల, జూలై 19: వినియోగదారులకు వచ్చే ఖరీఫ్ నాటికి నేరుగా రైతుల పొలాల వద్ద నుంచి కూరగాయలు అందేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశామని, మంచి నాణ్యమైన కూరగాయలు అందేలా చేస్తామని రాష్ట్ర మార్కెట్ శాఖ సిఇఓ రమణమూర్తి అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్‌యార్డును చైర్మన్ సిద్ధం శివరామ్‌తో కలిసి మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను పరిశీలించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

కర్నూలు ఓల్డ్‌సిటి, జూలై 19 : ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి రోజున వేద వ్యాసుడు జన్మించిన సందర్భంగా గురుపౌర్ణమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మంగళవారం నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా, కొత్తపేటలోని నాగసాయి, చిత్తారివీధిలోని శ్రీ గురుదత్త, వెంకటరమణ కాలనీలోని సాయిబాబా, బి.క్యాంపులోని సాయి మంది రం, గణేష్ నగర్‌లోని సాయిబాబా, కల్లూరు ఎస్టేట్‌లోని శ్రీ సాయిబాబా దేవాలయాలు, గుత్తిరోడ్డులోని శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సాయి మందిరాలు ‘ఓం సాయి శ్రీ సాయి.. జయజయ సాయి’ నామస్మరణతో మారుమోగాయి.

పుష్కరాల విధులు సమర్థవంతంగా నిర్వహించండి

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 19: త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా శ్రీశైలం, సంగమేశ్వరం క్షేత్రాల్లో 24 గంటల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులు ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం పుష్కర విధుల నిర్వహణపై ఎస్పీ ఆకే.రవికృష్ణ, జాయింట్ కలెక్టర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా అన్ని శాఖలు తమ సిబ్బంది చేత 24 గంటల పాటు విధులు నిర్వహించేలా పక్కాప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు.

సాంస్కృతిక వారసత్వాన్ని మరవద్దు

నంద్యాలటౌన్, జూలై 19: భారతీయులు సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుంచుకోవాలని, పాశ్చాత్య విధానాన్ని విడనాడి మన సంప్రదాయాలను పాటించాలని శ్రీశ్రీశ్రీ అచల పరిపూర్ణ యోగానంద(పాములేటి) స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం వ్యాసపూర్ణిమను పురస్కరించుకుని ఎన్‌జిఓ కాలనీలో వెలసిన అమరయోగాశ్రమ ఆవరణంలో యజ్ఞాలను నిర్వహించారు. 108 యజ్ఞ యజ్ఞ వేదికలను ఏర్పాటు చేసి హోమాన్ని పాల్గొన్న భక్తులచేత చేయించారు. ముందుగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన వేదవ్యాసుడికి పూజలు చేశారు. ఈసందర్భంగా యజ్ఞంలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారన్నారు.

ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడండి

నంద్యాలటౌన్, జూలై 19: స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడి, వారి సమస్యను పరిష్కరించాలని డిఐజి రమణకుమార్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. డిఐజి మంగళవారం పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్‌ను సందర్శిం చారు. తొలుత డిఐజికి డీఎస్పీ హరినాథరెడ్డి, సిఐ మురళీధర్‌రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డిఐజి నంద్యాల మండలంలో ఉన్న 18 మండలాల చిత్రపటాన్ని పరిశీలించారు. అలాగే కేసులు, మండలంలోని సమస్యలపై సిఐని, ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.

ఘనంగా మృత్తిక సంగ్రహణ మహోత్సవం

మంత్రాలయం, జూలై 19: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మృత్తిక సంగ్రహణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం గురుపౌర్ణమి పురస్కరించుకుని మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠం నుండి తులసి వనం వరకూ మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు మధ్య బంగారు పల్లకిలో బృందావన ప్రతిమను ఉంచి ఊరేగించారు. తులసి వనంలో బృందావనానికి, పవిత్రమైన మృత్తికకు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అక్కడి నుండి మృత్తికను బంగారు పల్లకిలో ఉంచి ఊరేగిస్తు శ్రీమఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనం ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేసి మహా మంగళ హారతి ఇచ్చారు.

శాకాంబరిగా దర్శనమిచ్చిన అంకాలమ్మ

మహానంది, జూలై 19: మండలంలోని తిమ్మాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అలంకారం చేసి భక్తులకు కనువిందు కలిగేలా అలంకరించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మరచిన వ్యాసపౌర్ణిమ వేడుకలు

అమరావతిని ఫ్రీజోన్ చేయాలి:ఆప్

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 19:రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సుబ్బయ్య, కన్వీనర్ రాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతిలో సామాన్య పౌరుడు కూడా నివసించేందుకు తగిన వసతులు, వనరులు కల్పించి ఫ్రీజోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో కోటీశ్వర్లు మాత్రమే నివసించే అవకా శం ఉందన్న అపవాదును తొలగించాల్సిన బాధ్యత సిఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించారని అలాంటి స్ఫూర్తితో రా ష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి..

కర్నూలు, జూలై 19:కల్లూరు మండల పరిధిలోని ఎర్రకత్వ గ్రామంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎర్రకత్వ గ్రామంలో ఓ పాడుబడిన బావి పక్కన శిథిలమైన చిన్న గదిలో మద్దమ్మ(35), ఆమె కూతురు లక్ష్మీ(8) మృతదేహాలు పడి ఉండగా గూడూరు గ్రామానికి చెందిన వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఆకే రవికృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, కల్లూరు తహశీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఫొరెన్సిక్ నిపుణులు డా శంకర్‌నాయక్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

అత్తింటి ఆరళ్లకు అబల బలి

కోవెలకుంట్ల, జూలై 19:అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కోవెలకుంట్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని అమడాల గ్రామానికి చెందిన శివకుమార్, రాజేశ్వరి దంపతుల కుమారుడు లక్ష్మినారాయణకు, బనగానపల్లె మండలం ఇల్లూరుకొత్తపేట గ్రామానికి చెందిన నాగేశ్వరయ్య కుమార్తె లక్ష్మిసుజాత(25)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పట్టణంలోని అభిరుచి హోటల్ సమీపంలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్నారు. లక్ష్మినారాయణ చెక్క పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

Pages