S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపి వ్యూహం ఏమిటి..?

మార్కాపురం, జూలై 19 : రాజకీయ ఉద్దండుడు, మార్కాపురం నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పర్యాయాలు మార్కాపురం సమితి అధ్యక్షుడిగా పనిచేసిన కెపి కొండారెడ్డి రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. కాగా గత శుక్రవారం కెపికి సన్నిహితంగా ఉండే మాజీ ఎంపి, ప్రస్తుత ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును విజయవాడలో కలిశారు. అయితే తన బంధువు సొంతపనిపై కలిసినట్లు చెప్తున్నప్పటికీ పట్టణంలో మాత్రం మరోరకంగా ఊహాగానాలు వినపడుతున్నాయి. గత ఆరునెలలుగా ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నప్పటికీ వాస్తవంగా మాత్రం నిజంకాలేదు.

రేపు జిల్లాకు వ్యవసాయ కమిషన్ బృందం రాక

ఒంగోలు,జూలై 19: ఈనెల 21వతేదీన జిల్లాకు వ్యవసాయకమిషన్ బృందం వస్తున్న దృష్ట్యా వారి పర్యటనలు విజయవంతం చేయాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో వ్యవసాయ టాస్క్ఫోర్స్ కమిటీ పర్యటనపై వ్యవసాయశాఖ,దాని అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 21న వ్యవసాయ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ సుబ్బారావు నేతృత్వంలో కమిటీ సభ్యులు ఒంగోలులో పర్యటించి అంబేద్కర్ భవన్‌లో జరిగే సమావేశంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు.

పోలీసులకు ఊరట

విజయనగరం, జూలై 19: కేసుల పరిశోధన, పరిష్కారంతో నిత్యం సతమతమవుతున్న పోలీసు సిబ్బందికి ఊరట కలిగించే నిర్ణయాన్ని జిల్లా ఎస్పీ కాళిదాసు తీసుకున్నారు. ఇకనుంచి జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి 15రోజులకు ఒకరోజు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించటంతోపాటు వెంటనే ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు ప్రతి 15రోజులకు ఒకరోజు చొప్పున సెలవులు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. అత్యవసర పరిస్థితులలో మాత్రం ఈ సిబ్బంది సెలవు ఉపయోగించుకోకుండా విధులు నిర్వహించవలసి ఉంటుంది.

సహకార సంఘాలతో రైతులకు ప్రయోజనం

విజయనగరం, జూలై 19: ఉద్యాన పంటలు పండించే రైతులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కల్పించే సదుపాయాలు, రాయితీలు ఉపయోగించుకోవాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ సూచించారు. ఉద్యాన రైతులు సహకార సంఘాలుగా ఏర్పడితే రైతులకు, ప్రభుత్వానికి చాలా సమస్యలు తగ్గుతాయని చెప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్యానశాఖ, ఆత్మా ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యాన పంటల రైతులతో పరస్పర సహాయ సహకార సంఘాలకు సంబంధించిన అంశాలపై అధ్యక్ష, కార్యదర్శులకు నిర్వహించే రెండురోజుల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ నాయక్ మంగళవారం ప్రారంభించారు.

మహిళా కమిషన్ సభ్యురాలిగా శ్రీవాణి

విజయనగరం, జూలై 19: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా తెలుగుదేశం నాయకురాలు కొయ్యాన శ్రీవాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను స్ర్తి, శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాబర్ట్స్ మంగళవారం శ్రీవాణికి చీపురుపల్లిలో అందజేసారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో స్ర్తి, శిశుసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన ఆమె గత ఎన్నికలలో పార్వతీపురంనియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ ఆశించి విఫలమయ్యారు. ఆ తరువాత శ్రీవాణి టిడిపిలో చేరారు.

ప్రజలను దోచుకుంటున్న టిడిపి నేతలు

విజయనగరం, జూలై 19: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి సామాన్య కార్యకర్త వరకు దోచుకోవడం..దాచుకోవడం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకు వై ఎస్సార్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని కె.ఎల్.పురంలో పార్టీ నాయకులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వంద ప్రశ్నలతో పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికి పంపిణీ చేసారు.

పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

విజయనగరం(పూల్‌బాగ్), జూలై 19: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి వనం గుడిలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవిప్రసాద్ అమ్మవారికి విశేష కుంకుమ పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని బత్తాయి పండ్లతో అలంకరించారు.చదురు గుడిలోని అమ్మవారిని ముఖరీ అరటి పండ్లతో అలంకరించి పూజలు జరిపారు.
చంఢీహోమం
చదురు గుడి ఆలయ ప్రాంగణంలో మంగళవారం చంఢీ హోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు, దూసి కృష్ణమూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాపై చర్యలు

విజయనగరం (్ఫర్టు), జూలై 19: చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాల అక్రమ రవాణాపై నిర్థిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) జోనల్ చైర్మన్ పివి కుమార్, రీజనల్ చైర్మన్ కెవిఎల్ నరసింగరావుకోరారు. ఈ మేరకు ప్రాంతీయ రవాణాశాఖ ఉప కమిషనర్, జిల్లా ఎస్పీ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌కు మంగళవారం వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ నగర పరిధిలో కాంప్లెక్స్, డిపోనకు మూడు కిలో మీటర్లు, జిల్లా ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు వాహనాలను నిలుపురాదనే నిబంధనలు అమలు చేసి ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

విజయనగరం(పూల్‌బాగ్), జూలై 19: పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలను మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. సాయిబాబా ఆలయాలు సాయినామ స్మరణతో మారుమ్రోగాయి. వేకువ ఝాము నుండి భక్తులు షిరిడిసాయి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబామెట్టలోని శివపంచాయతన ఆలయంలో కొలువైన షిరిడిసాయిబాబాకు వేకువ ఝామున ప్రత్యేక పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం జరిపారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. పవిత్రమైన రోజు కావడంతో బాబాను దర్శించుకున్న భక్తులందరు పాలతో బాబాకు అభిషేకం జరిపారు.

సంగమేశ్వరానికి పూర్వవైభవం!

కర్నూలు, జూలై 19 : సప్తనదీ సంగమేశ్వరం ఆలయానికి పూర్వవైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పలు ప్రముఖ ఆలయాలకు నిలయమైన జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. తాజాగా ఆగస్టులో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల ప్రారంభ వేడుకలను సైతం సంగమేశ్వరంలో నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారని, ఇక్కడే సిఎం చంద్రబాబు కుటుంబంతో పాటు పుష్కర స్నానం చేస్తారని జిల్లా అధికారులకు సూచనప్రాయంగా తెలిసింది.

Pages