S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/13/2016 - 03:30

హైదరాబాద్, సెప్టెంబర్ 12: రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీతకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 53 ఎకరాల స్థలంలో గల ఫెన్సింగ్‌ను తొలగించి..పెంకుటిల్లును కూల్చేసి సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడ్డారు. రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా తన భూమిని లాక్కున్నారని అరకు ఎంపి కొత్తపల్లి గీత ఆరోపించారు. ఒక ఎంపికి చెందిన భూమికి రక్షణ లేకపోతే ఎలా?

09/13/2016 - 03:27

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించేందుకు మూడవ బిక్స్ అర్బనైజేషన్ ఫోరం విశాఖలో చర్చించనుంది. బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల ప్రతినిధులు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు ఫోరం ఏర్పాటు చేస్తున్న సదస్సులో వివిధ అంశాలపై చర్చించనున్నారు.

09/13/2016 - 03:27

హైదరాబాద్, సెప్టెంబర్ 12: కేంద్ర జల సంఘం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఈ నెల 21న ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నెల 18, 19 తేదీలలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు కేంద్ర జల సంఘం రాష్ట్రానికి తెలియజేసిన విషయం తెలిసిందే.

09/13/2016 - 03:26

హైదరాబాద్, సెప్టెంబర్ 12: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో సాగుతున్న అనైతిక, అక్రమ పద్ధతులపై వివరణ ఇవ్వాల్సిందిగా ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. కేర్ ఆస్పత్రి, గ్లోబల్ ఆస్పత్రి, అపోలో ఆస్పత్రి సహా రాష్ట్ర ప్రభుత్వాలకు, విజిలెన్స్ విభాగాలకు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

09/13/2016 - 03:25

హైదరాబాద్, సెప్టెంబర్ 12: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు విచారణ వేగవంతమైంది. సిట్ అధికారులు చేపడుతున్న ఈ కేసును మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పు చోటుచేసుకుంది. సిట్‌ను విస్తరిస్తూ తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు మరో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

09/13/2016 - 02:57

విజయవాడ, సెప్టెంబర్ 12: కాంట్రాక్ట్ కంటింజెంట్, పార్ట్‌టైం ఉద్యోగుల జీతాల పెంపుదలపై ఉద్యోగ సంఘాల జెఎసి ఈ నెల 27న అన్ని జిల్లా డివిజన్ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో సోమవారం విజయవాడలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం, కార్యదర్శి ఎం.రవిచంద్ జిఎస్‌సి నేతలతో జరిపిన తొలి విడత చర్చలు సఫలమయ్యాయి.

09/13/2016 - 02:50

గజ్వేల్/ హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రాజెక్ట్‌ల నిర్మాణం పేరిట ప్రజాధనం దోపిడీని సహించేదిలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు చేపట్టిన దీక్షలు వంద రోజులకు చేరిన సందర్బంగా గజ్వేల్‌లో సోమవారం నిర్వహించిన సంఘీబావ సదస్సులో ఆయన మాట్లాడారు.

09/13/2016 - 02:42

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఎమ్సెట్-3లో అర్హులకు మెడికల్, డెంటల్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ షెడ్యూలును కాళోజీ నారాయణ రావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ ప్రకటించింది. 17 నుంచి 20 వరకూ నాలుగు రోజుల పాటు అర్హత సాధించిన అభ్యర్థులకు ర్యాంకుల వారీ సర్ట్ఫికెట్ల పరిశీలన నిర్వహిస్తారు. వెబ్ కౌనె్సలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను కెఎన్‌ఆర్ మెడికల్ యూనివర్శిటీ ఏర్పాట్లు చేసింది.

09/13/2016 - 02:39

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణలోని గురుకులాల్లో మరో 516 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ భర్తీ చేస్తుంది. టిజిటి 350 పోస్టులు, పిఇటి 50 పోస్టులు, స్ట్ఫా నర్సు 50 పోస్టులు, ప్రిన్సిపాల్ పోస్టులు 16, ఆర్ట్సు టీచర్సు 18 పోస్టులు, మ్యూజిక్ 32 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

09/13/2016 - 02:38

హైదరాబాద్, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో సిఎం ఫోన్లో మాట్లాడారు.

Pages