S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/17/2016 - 05:20

హైదరాబాద్, సెప్టెంబర్ 16: దళిత నేత, సీనియర్ న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు బొజ్జా తారకం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా కందికుప్ప గ్రామంలో 1939 జూన్ 27న జన్మించారు. నాటి కారంచేడు ఊచకోత నుంచి ఇటీవలి లక్సింపేట మారణకాండ వరకు బొజ్జా తారకం అత్యంత క్రియాశీలకమైన రీతిలో పోరాటాలు సాగించారు.

09/16/2016 - 07:28

గుంటూరు, సెప్టెంబర్ 15: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యవసాయ పంటలకు అపార నష్టం సంభవించింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20 వేల హెక్టార్ల మేర వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గురజాల, మాచర్ల పట్టణాల్లోని పలు కాలనీలు ఇంకా నీట నానుతున్నాయి. ఐదు మండలాల్లో 120 కిలోమీటర్ల వరకు రోడ్లు కోతకు గురయ్యాయి.

09/16/2016 - 07:22

కర్నూలు, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో భూగర్భజలాలు పాతాళానికి చేరుకున్నాయి. వీటిని పైకి రప్పించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో కాని ప్రస్తుతం భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నిత్యం నిండుగా గోదావరి ప్రవహించే ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం భూగర్భ జలాలు అట్టడుగుకు చేరాయని అధికారుల రికార్డులు వెల్లడిస్తున్నాయి.

09/16/2016 - 07:12

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. తమ విద్యుత్ బిల్లులను వోడాఫోన్ ఎంపెసాతో ప్రయాణ సమయంలో కూడా చెల్లించవచ్చునని ఆ సంస్ధ బిజిసెన్ హెడ్ సురేష్ సేథీ తెలిపారు. నగదు బదిలీ, బిల్లులు, యుటిలిటీ చెల్లింపులు మర్చంట్ పేమెంట్స్, వ్యాపార పరిష్కారాలను అందించే వోడాఫోన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ డిస్కాంలతో ఒప్పం దం కుదుర్చుకుంది.

09/16/2016 - 07:04

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఐటి కంపెనీల్లో సున్నితమైన డాటాను థర్ట్‌పార్టీ వెండర్లు తస్కరిస్తున్నారని ఐటి కంపెనీలకు చెందిన ప్రతి నలుగురు నిపుణుల్లో ఒకరు అభిప్రాయ పడుతున్నారు. ఈ వివరాలపై సెక్లోర్ట ఎంటర్ ప్రైజస్ స్ట్రాటెజీ గ్రూపు 200 ఐటి నిపుణులతో మాట్లాడి సర్వే చేసింది.

09/16/2016 - 07:03

భోపాల్, సెప్టెంబర్ 15: అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు లభ్యమవుతుండడం, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తూ ఉండడంతో భారత్ ఆన్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ భాషల విభాగం చీఫ్ రిచాసింగ్ చిత్రాంశి చెప్పారు.

09/16/2016 - 07:01

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 88 శాతం మంది తల్లులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని కోరుకుంటున్నా దానిని ఎలా అందించాలో ప్రస్తుతం వారికి తెలియదని హంస రీసెర్చి గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ భాగస్వామ్యంలో రిన్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

09/16/2016 - 06:59

హైదరాబాద్, సెప్టెంబర్ 15: స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ గురువారం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తూ, అమరావతి రాజధాని నగరంలో అభివృద్ధి అనే అంశాన్ని రియల్ ఎస్టేట్ కోణంలో చూడరాదన్నారు.

09/16/2016 - 06:34

హైదరాబాద్, సెప్టెంబర్ 15: సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బి రామలింగరాజుకు పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేయాలని హైకోర్టు గురువారం ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్ ఈ ఆదేశాలను జారీ చేశారు. తనకు పాస్‌పోర్టు ఇప్పించాల్సిందిగా బి రామలింగరాజు పెట్టుకున్న అభ్యర్ధనను కింది కోర్టు డిస్మిస్ చేసింది.

09/16/2016 - 06:13

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన జలాశయాలు ఈ ఏడాదైనా నీటితో కళకళలాడతాయని అంతా భావించినప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, కండలేరు, సోమశిల, పులిచింతల తదితర జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు.

Pages