S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/19/2016 - 02:28

హైదరాబాద్, సెప్టెంబర్ 18: అన్ని గ్రామాలకు వచ్చే డిసెంబర్ నాటికి మంచినీరు అందించేలా మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు కోటి ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందించాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు.

09/19/2016 - 02:24

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్ర పన్ను వాటాగా రావాల్సిన మొత్తాన్ని తెలంగాణకు కేంద్రం దానమిచ్చినట్టు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతున్నారని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చింది పన్ను వాటాయే తప్ప, ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదన్నారు.

09/19/2016 - 02:01

అనంతపురం, సెప్టెంబర్ 18 : అనంతపురం నగరంలో డెంగ్యూ వ్యాధికి గురై ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మూడోవ రోజు ఆదివారం కూడా కలెక్టరేట్‌లో వరుస సమీక్షలు జరిగాయి.

09/19/2016 - 01:58

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాబోయే రోజుల్లో ప్రతి కార్మికునికీ ఇల్లు నిర్మించి ఇస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ప్రత్యేకంగా చట్టం చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ 33మంది కార్మికులకు ప్రశాంసా పత్రాలు, అవార్డులు అందించారు.

09/19/2016 - 01:55

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హైదరాబాద్‌లోని ఆంధ్ర రాష్ట్ర సచివాలయం ఖాళీ అవుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో వెలగపూడి వద్ద సచివాలయం భవనాల నిర్మాణం పూర్తికావస్తుండటంతో అక్టోబర్ 1 నుంచి పూర్తిస్ధాయిలో ఆంధ్ర సచివాలయం కొత్త భవనాల నుంచే పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఐదు వేలమంది ఉద్యోగులు 19వ తేదీ నుంచి అమరావతిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

09/19/2016 - 01:52

విజయవాడ, సెప్టెంబర్ 18: విజయదశమి తరువాత నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయం నుంచే పూర్తిస్థాయిలో తన విధులను నిర్వర్తించబోతున్నారు. ఇందుకుగాను ఆయన ఆదివారం తన నివాస గృహంలో పురపాలక మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మొదటి బ్లాక్‌లోని సిఎం చాంబర్‌కు ఆనుకుని ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

09/18/2016 - 06:26

వరంగల్, సెప్టెంబర్ 17: తెలంగాణలో బిజెపి లక్ష్యం మారుతోందా? మజ్లిస్ సంతుష్టీకరణ విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఇకపై కమలం లక్ష్యంగా ఎంచుకుందా? అందుకే మజ్లిస్ భుజంపై తుపాకిపెట్టి కేసీఆర్‌కు గురిపెట్టిందా? హిందువులకు చేరువయ్యే వ్యూహానికి మళ్లీ పదనుపెడుతోందా? అందుకే రజాకార్ల అరాచాలను మరోసారి తూర్పారబట్టిందా?

09/18/2016 - 03:28

హైదరాబాద్, సెప్టెంబర్ 17: కృష్ణా జలాలపై తలెత్తిన వివాదంపై ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అత్యున్నతి మండలి సమావేశంలో బలంగా వాదనలు వినిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాయత్తమవుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలపై రాజీపడకుండా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని చంద్రబాబు నిర్ణయించారు.

09/17/2016 - 07:07

సూళ్లూరుపేట, సెప్టెంబరు 16: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుండి ఈ నెల 26న పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగ జరిపేందుకు శ్రీకారం చుట్టింది.

09/17/2016 - 05:51

హైదరాబాద్, సెప్టెంబర్ 16: దేశంలోని 19 ఐఐటిలతో పాటు 31 ఎన్‌ఐటిలు ఇతర జాతీయ ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జెఇఇ-2017ను నిర్వహించే బాధ్యతను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చెన్నై ఐఐటికి అప్పగించింది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష ప్రశ్నాపత్రం రూపకల్పన, ఫలితాల ప్రకటన వరకూ అన్ని బాధ్యతలను ఐఐటి చెన్నై చూసుకుంటుంది.

Pages