S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/16/2016 - 05:15

హైదరాబాద్, సెప్టెంబర్ 15: లిబియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఏడాదిపాటు బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అధ్యాపకుల కథ సుఖాంతమైంది. వీరిద్దరినీ ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు విడిచిపెట్టినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆంధ్రాకు చెందిన టి. గోపికృష్ణ, తెలంగాణకు చెందిన సి బలరామ కిషన్‌లను గత ఏడాది జూలై 19న లిబియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

09/15/2016 - 08:33

కరీంనగర్/మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 14: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై వివిధ జిల్లాల్లో అదే తీరుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతుండగా, సిరిసిల్ల జిల్లాకోసం మాత్రం ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.

09/15/2016 - 08:19

కాకినాడ, సెప్టెంబర్ 14: విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీర రహదారి నిర్మాణానికి 1350 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) నుండి నిధులు మంజూరైనట్టు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని తిమ్మాపురం అతిథి గృహంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో యనమల మాట్లాడారు.

09/15/2016 - 07:30

హైదరాబాద్, సెప్టెంబర్ 14: పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ నెల 19, 20 తేదీల్లో వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

09/15/2016 - 07:18

విజయవాడ, సెప్టెంబరు 14: ఏపి రాజధాని అమరావతిలోని ప్రధాన భవనాల డిజైన్లను మరోసారి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని అమరావతిలోని అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి పలు ప్రధాన భవనాలను నిర్మించే బాధ్యతను మాస్టర్ ఆర్కెటెక్ట్‌గా ఎంపికైన జపాన్‌కు చెందిన మాకీ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ భవనాలకు సంబంధించి మాకీ సంస్థ సుమారు నాలుగు నెలల కిందట డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది.

09/15/2016 - 07:06

హైదరాబాద్, సెప్టెంబర్ 14: కష్టమైనా నిష్ఠూరమైనా తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేయాలన్న నిర్ణయానికి ఏపి బిజెపి నాయకులు వచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా దిశానిర్దేశంతో ఏపిలో భాజపా,తెదేపాల మధ్య ఇక దూరం తగ్గనుంది. ఆ మేరకు పార్టీపరంగా తెదేపాను, వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడును విమర్శించే బిజెపి నాయకులు కూడా ఇకపై తమ వైఖరి మార్చుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొంది.

09/15/2016 - 07:05

హైదరాబాద్, సెప్టెంబర్ 14: మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కోరారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి అధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

09/15/2016 - 07:04

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-3 ఫలితాలను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. జెఎన్‌టియుహెచ్ యుజిసి అకడమిక్ స్ట్ఫా కాలేజీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో జెఎన్‌టియు విసి ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రశ్నాపత్రాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు వ్యక్తం చేసిన అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం పూర్తయింది.

09/15/2016 - 05:12

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: అనూహ్యంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న 3వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

09/15/2016 - 05:06

హైదరాబాద్, సెప్టెంబర్ 14: కావేరి నదీ జలాల పంపిణీ నేపథ్యంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని చూసిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆంధ్ర, తెలంగాణ సిఎంలను అత్యున్నత మండలి సమావేశానికి రావాలని ఆహ్వానించింది.

Pages