S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/14/2016 - 05:16

హైదరాబాద్, సెప్టెంబర్ 13: విదేశీ విద్యార్ధులకు ఐఐటి మెయిన్స్ నుండి మినహాయించాలని జాయింట్ అడ్మిషన్స్ బోర్డు యోచిస్తోంది.

09/14/2016 - 03:13

హైదరాబాద్, సెప్టెంబర్ 13: అమెరికాలోని ప్రఖ్యాత కాలేజీల్లో ఒకటైన మిస్సోరి స్టేట్ యూనివర్శిటీ (ఎంఎస్‌యు) ఎంబిఎ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. విస్తృత అవకాశాలను వినియోగించుకునేలా, సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్ధులకు అవగాహన పెంపొందిస్తూ, నేటి అత్యుత్తమ విధానాలను అనుసరించేలా వారిని సన్నద్ధం చేస్తోంది.

09/14/2016 - 02:47

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఏపిలో ప్రధాని నరేంద్ర మోదీ కంటే వెంకయ్యనాయుడుకే ఇమేజ్ ఎక్కువైంది. ఏపి బిజెపి ఇంచార్జి సిద్ధార్థ నాథ్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడి వరకూ అందరూ వెంకయ్యనే అభిమానిస్తున్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చిన తర్వాత పార్టీ నేతల నుంచి కనిపిస్తున్న స్పందన, పవన్‌పై చేస్తున్న ఎదురుదాడి చూస్తుంటే ఇది నిజమమనిపించకమానదు.

09/14/2016 - 02:02

హైదరాబాద్, సెప్టెంబర్ 13: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు పబ్లిక్ సర్వీసు కమిషన్లు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంగళవారం నాడు ఆంధ్రాలో గ్రూప్-1 పరీక్షలు ప్రారంభం కాగా, తెలంగాణలో బుధవారం నుండి ఈ పరీక్షలు మొదలవుతాయి. బుధవారం బక్రీద్ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం 13న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను 24కు వాయిదా వేసింది.

09/14/2016 - 02:01

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యం వహిస్తే మేలన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేత, సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ వ్యక్తం చేశారు. ఎంపీలను నిలదీయాలని, వారు రాజీనామా చేస్తారో? ఉద్యమానికి సహకరిస్తారో? చూడాలన్నారు.

09/14/2016 - 02:01

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యం వహిస్తే మేలన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేత, సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ వ్యక్తం చేశారు. ఎంపీలను నిలదీయాలని, వారు రాజీనామా చేస్తారో? ఉద్యమానికి సహకరిస్తారో? చూడాలన్నారు.

09/13/2016 - 03:40

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(సెప్టెంబర్ 17న) రాష్ట్రప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సామాజిక వేత్తలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరనున్నట్లు చెప్పారు.

09/13/2016 - 03:37

విజయవాడ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ స్టేషన్‌లో తొలిసారిగా దాదాపు 150 కోట్లతో పెద్దఎత్తున రూట్ రిలే ఇంటర్ లాకింగ్ పనులు, సిగ్నలింగ్ వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 28 వరకు మొత్తం 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. ఇదే సమయంలో మరో 215 రైళ్లను దారి మళ్లించబోతున్నారు.

09/13/2016 - 03:32

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలోని ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజుల ప్రకారం ఎంబిబిఎస్‌లో ఎ కేటగిరికి 60వేలు, బి కేటగిరికి 11 లక్షలు చెల్లించాలి, సి కేటగిరి ఫీజు 22 లక్షలు ఉంటుంది. అలాగే బిడిఎస్‌లో ఏ కేటగిరి ఫీజు 45వేలు కాగా, బిడిఎస్‌లో బి, సి కేటగిరిల ఫీజు 2.7 లక్షలుగా నిర్ధారించారు.

09/13/2016 - 03:31

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ సోమవారం రాత్రి పూర్తయిందని అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. 23 ప్రభుత్వ కాలేజీల్లో 1390 ఎంబిఎ సీట్లకు 1363, 267 ప్రైవేటు ఎంబిఎ కాలేజీల్లో 21,006 సీట్లకు 20654 సీట్లు భర్తీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎంబిఎలో కన్వీనర్ కోటా కింద కేవలం 379 సీట్లు మాత్రమే మిగిలాయని చెప్పారు.

Pages