S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/10/2016 - 03:16

హైదరాబాద్, జూలై 9: అవిభక్త కవలలు వీణావాణీలకు శస్తచ్రికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా వైద్యుల బృందం ముందుకొచ్చిందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి వెల్లడించారు. వారి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి నగరంలోని నిలోఫర్, తదితర ఆసపత్రులను సందర్శించారు.

07/10/2016 - 03:06

హైదరాబాద్, జూలై 9: రాష్ట్రంలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరం అయిన ఇసుక రీచ్‌లను నీటిపారుదల శాఖ గుర్తిస్తోంది. రెండు రోజుల్లో రిసోర్స్ మ్యాపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ప్రాజెక్టులకు కోటి 72లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అని నిర్ధారించారు.

07/10/2016 - 03:04

హైదరాబాద్/శామీర్‌పేట, జూలై 9: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ఎయిర్ అండ్ స్పేస్ లా లో నిష్ణాతుడైన ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డికి శ్రీలంక రాజధాని కొలంబోలోని జనరల్ సర్ జాన్ కోటేలవల డిఫెన్స్ యూనివర్శిటీ నుండి ఆహ్వానం అందింది. డిఫెన్స్ యూనివర్శిటీలో న్యాయ శాస్త్ర విద్యార్థులకు అంతర్జాతీయ న్యాయం, అంతర్జాతీయ స్పేస్ లా అంశాలపై బోధించేందుకు బాలకిష్టారెడ్డిని ఆహ్వానించారు.

07/10/2016 - 03:00

హైదరాబాద్/పంజగుట్ట, జూలై 9: ఇటీవల పంజగుట్ట కారు ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల రమ్య తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడి, శనివారం కన్నుమూసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటిక ముందు పమ్మి రాజేష్ (34) కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా, అదే సమయంలో ఎదురుగా ఓ కారులో మద్యం సేవించిన నలుగురు యువకులు అతివేగంతో వచ్చి, డివైడర్‌ను ఢీకొట్టారు.

07/10/2016 - 02:56

హైదరాబాద్, జూలై 9: ‘జిహాద్ అంటే ఇస్లాం కోసం చావడం కాదు, ఇస్లాం కోసమే బతకడం’ అని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దారుస్సలాంలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అసద్ ప్రసంగిస్తూ ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. వాళ్ళు నరకలోకపు కుక్కలు, ఇస్లాం పేరిట అమాయకుల రక్తం తాగుతున్నారంటూ మండిపడ్డారు.

07/10/2016 - 02:53

హైదరాబాద్, జూలై 9: గోదావరిపై కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఈనెల 14న కుదరాల్సిన ఒప్పందం వాయిదా పడింది. జూలై మూడవ వారంలో ఈ ఒప్పందం కుదురుతుందని అధికార వర్గాలు తెలిపాయి. గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంతో పాటు ఒప్పందాల కోసం జూలై 14న ముంబైలో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావాలని తొలుత నిర్ణయించారు.

07/10/2016 - 02:53

హైదరాబాద్, జూలై 9: ‘మెడికల్ సీటు గ్యారెంటీ...లేకపోతే ఫీజు వాపస్’ అంటూ శ్రీచైతన్య విద్యాసంస్థలు జారీ చేసిన ప్రకటనలపై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. ‘ష్యూర్ నీట్’ అంటూ శ్రీచైతన్య జారీ చేసిన ప్రకటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ సైతం ఈ నోటీసులను ఒకటి రెండు రోజుల్లో పంపనున్నట్టు తెలిసింది.

07/10/2016 - 02:52

నల్లమాడ, జూలై 9: పొలాల్లో గడ్డి తీసేందుకు అన్నదాతలు ఇకపై ప్రయాస పడనక్కర్లేదు. తక్కువ ఖర్చుతో, సొంతంగా తామే ఆ పని చేసుకోగలిగేలా రూపొందించిన ‘సైకిల్ వీడర్’ ఇప్పుడు అందుబాట్లోకి వచ్చింది. దీని సాయంతో ఒక రైతు రోజుకు ఒకటిన్నర ఎకరా పొలంలోని గడ్డి తొలగించవచ్చు. అనంతపురం జిల్లా నల్లమాడలోని రైతుసేవా కేంద్రం రూపొందించిన ఈ సైకిల్ వీడర్ రైతన్న కష్టాలు తీర్చే పరికరమని చెప్పవచ్చు.

07/10/2016 - 02:34

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ఎమ్సెట్-2కు ఒక్క నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయం ఆలస్యంగా వచ్చిన దాదాపు వందమంది విద్యార్ధులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. కొద్ది సెకెన్లు ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను సైతం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/10/2016 - 02:31

హైదరాబాద్, జూలై 9: ఫీవర్ ఆస్పత్రిలో ఒకరికి కలరా సోకినట్టు నిర్థారణ అయ్యందని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఫీవర్ ఆస్పత్రిలో కలరా వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు తెలియడంతో మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిని శనివారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. కలరా, ఇతర విష జ్వరాలపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు.

Pages