S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/03/2016 - 06:40

విశాఖపట్నం, జూన్ 2: విశాఖ నగరం అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తున్న తరుణంలో రౌడీల ఆగడాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. నగరంలోని ఒక ఫుడ్‌కోర్టును దాదాపు 50 మంది రౌడీలు కూల్చివేసిన ఘటన సంచలనం సృష్టిచింది. నగరంలోని ద్వారాకనగర్ మొదటి లైన్‌లో శివరామ ఫుడ్‌కోర్టును గత నాలుగేళ్లుగా కె.మీనా నిర్వహిస్తున్నారు.

06/03/2016 - 04:57

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబం అవినీతిని బయటపెట్టడానికి తాను రెడీగా ఉన్నానని బిజెపి నేత నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల మధ్య నిద్రపోతానని నాడు చెప్పిన కెసిఆర్, నేడు ప్రాజెక్టుల అంచనాలు పెంచి అవినీతిని తారాస్థాయికి పెంచేశారని ఆరోపించారు.

,
06/03/2016 - 03:45

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో 62మంది ప్రముఖులను గవర్నర్ నరసింహన్, ముఖమంత్రి కెసిఆర్ ఘనంగా సత్కరించి, లక్షా 116 రూపాయల నగదు అందజేశారు.

06/03/2016 - 03:52

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండవ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాష్టవ్య్రాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. తొలి ఏడాది నిర్వహించిన దానికంటే రెండవ ఏడాది నిర్వహించిన ఈ వేడుకలు మరింత ఘనంగా జరగడం విశేషం. మొదటి సంవత్సర వేడుకలు రాష్ట్ర రాజధానికే ప్రాధాన్యత ఇవ్వగా, ఈ సారి వీటిని రాష్టవ్య్రాప్తంగా నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

06/03/2016 - 03:46

హైదరాబాద్, జూన్ 2: రెండు రాష్ట్రాలు బాగుపడే విధంగా సామరస్యంతో ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చునని, ఇరు రాష్ట్రాల రైతులకు మేలు జరిగేట్టు చూడాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెచ్‌ఐసిసిలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులు బహూకరించారు.

06/03/2016 - 03:46

హైదరాబాద్, జూన్ 2: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలను, అవరోధాలను అధిగిమించిందని, రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయనే ప్రజల విశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలనలో నిలబెట్టగలిగామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పరిపాలన సాగుతుందన్నారు.

06/03/2016 - 03:45

హైదరాబాద్, జూన్ 2: సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పరస్పరం సహకరించుకోవాలని కాలిఫోర్నియా గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా పర్యటనలో భాగంగా ఐటి శాఖ మంత్రి కె తారకరామారావుకాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశమయ్యారు.

,
06/03/2016 - 02:40

విజయవాడ, జూన్ 2: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, కుట్ర రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ కుమిలిపోయేలా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఇది నా కోరిక..అందుకే పట్టుదలతో పనిచేస్తున్నాను’అని అన్నారు. స్థానిక బెంజ్ సర్కిల్ వద్ద గురువారం ప్రజలతో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు.

06/03/2016 - 03:16

విజయవాడ, జూన్ 2: ఎక్కువ ఖర్చుతో కూడుకున్న డయాలసిస్ వైద్య సేవలను నిరుపేదలకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో పది యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిఎంఎస్‌ఎస్‌వై గ్రాంట్ కింద వచ్చిన 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.

06/03/2016 - 02:30

హైదరాబాద్/కడప, జూన్ 2: ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి బొల్లవరం నాగభూషణరెడ్డి నైజీరియాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. నాగభూషణరెడ్డి స్వస్థలం కడప జిల్లా పొద్దుటూరు. ఆయన తండ్రి రామసుబ్బారెడ్డి పొద్దుటూరులో ప్రముఖ వైద్యుడు. ప్రస్తుతం నాగభూషణరెడ్డి జెనీవాలోని పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రాల ట్రాన్స్‌పోర్టు అధికారిగా కూడా పని చేశారు.

Pages